లోక నాయకుడు కమల్ హాసన్(Kamal Haasan)ప్రధాన పాత్రలో నటించిన ‘థగ్ లైఫ్'(Thuglife) జూన్ 5వ తేదీన విడుదలైన సంగతి తెలిసిందే. కన్నడ భాష వివాదం నేపథ్యంలో కర్ణాటకలో రాష్ట్రంలో తప్ప మిగిలిన రాష్ట్రాల్లో సినిమా రిలీజైంది. అయితే సినిమా రిలీజైన రోజే మూవీకి నెగెటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. తొలి రోజు కేవలం రూ.15.50 కోట్లు మాత్రమే వచ్చాయి. కమల్ గత సినిమాల కన్నా ఈ సినిమాకే తక్కువ ఓపెనింగ్స్ రావడం గమనార్హం.
ఇక రెండో రోజు రూ.7.15 కోట్ల కలెక్షన్లు రాగా.. మూడో రోజు రూ.5.84 కోట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా మూడు రోజుల కలెక్షన్లు కలిపి రూ.28 కోట్లు మాత్రమే వచ్చాయి. మూవీ టాక్ నెగెటివ్ రావడంతో వీకెండ్స్ లో కూడా కలెక్షన్లు దారుణంగా పడిపోయాయి. సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్స్ కు రావడం లేదు. దీంతో సోమవారం నుంచి మరింత కలెక్షన్స్ పడిపోయే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నాయి. అలాగే థియేటర్ల సంఖ్య కూడా తగ్గిపోనుందని భావిస్తున్నారు.
దీంతో కమల్ హాసన్ కెరీర్ లోనే మరో భారీ డిజాస్టర్ గా మూవీ మిగిలిపోయింది. ప్రముఖ దర్శకుడు మణిరత్నం మార్క్ మూవీలో మిస్ అయింది. సాగదీత సీన్లు, రొటీన్ కంటెంట్, పేవలమైన స్క్రీన్ ప్లేతో ప్రేక్షకులకు బోర్ కొట్టింది. దాదాపు 37 ఏళ్ల తర్వాత కమల్-మణిరత్నం కాంబోలో వచ్చిన ఈ సినిమా డిజాస్టర్ కావడంతో మూవీ యూనిట్ తీవ్ర నిరాశలో ఉంది. రూ.200 కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమా రూ.100 కోట్లు కూడా రాబట్టడం కష్టమనే చెబుతున్నారు. మొత్తానికి ఈ సినిమాతో నిర్మాతలకు, డిస్ట్రిబ్యూటర్లకు భారీ నష్టాలు మిగిలాయి. కాగా ఈ సినిమాలో శింబు, త్రిష, అభిరామి, నాజర్, తనికెళ్ల భరణి, అశోక్ సెల్వన్, మహేశ్ మంజ్రేకర్ వంటి ప్రముఖ నటులు నటించగా.. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.
కథేంటంటే.. రంగరాయ శక్తి రాజు(కమల్ హాసన్), తన అన్న మాణిక్యం (నాజర్)తో కలిసి ఢిల్లీలో గ్యాంగ్‌ను నడుపుతూ ఉంటాడు. సదానంద్ (మహేష్ మంజ్రేకర్) గ్యాంగ్‌తో గ్యాంగ్ వార్ నడుస్తూ ఉంటుంది. ఓ సందర్భంలో సదానంద్, శక్తి రాజు గ్యాంగ్‌ను పట్టించే ప్రయత్నం చేస్తాడు. అయితే శక్తి రాజు ఒక చిన్నారిని (శింబు) కవచంగా ఉపయోగించి తప్పించుకుంటాడు. ఆ రోజు నుంచి ఆ చిన్నారిని సొంత కొడుకులా పెంచుతాడు. తన తండ్రిని చంపింది శక్తి రాజేనని తెలుసుకున్న అమర్, శక్తి రాజును ఒక లోయలోకి తోసేస్తాడు. చనిపోయాడు అనుకుని తిరిగి వచ్చి అతని సామ్రాజ్యం అంతటినీ తన కంట్రోల్లోకి తెచ్చుకుంటాడు. రెండేళ్ల తర్వాత తిరిగి వచ్చిన శక్తి రాజు మళ్ళీ తిరిగి తన సామ్రాజ్యాన్ని దక్కించుకున్నాడా? చివరికి ఏం జరిగింది? అనే కథాంశంతో మూవీని తెరకెక్కించారు.
Thuglife: దారుణంగా పడిపోయిన ‘థగ్ లైఫ్’ కలెక్షన్లు
సంబంధిత వార్తలు | RELATED ARTICLES