Monday, November 25, 2024
Homeహెల్త్Caffeine: శరీర బరువు తగ్గించే కెఫైన్

Caffeine: శరీర బరువు తగ్గించే కెఫైన్

బరువు తగ్గడానికి మనం ఎన్నో ప్రయత్నాలు చేస్తుంటాం. వెయిట్ లాస్ డైట్, వ్యాయామాలు వంటివి అనుసరిస్తుంటాం. అయితే బరువు తగ్గడంలో కెఫైన్ కూడా శక్తివంతంగా పనిచేస్తుందని ఇటీవల పలువురు నిపుణులు చెప్తున్నారు. బరువు కరిగించడంలో కెఫైన్ బాగా పనిచేస్తుందట. టీ, కాఫీలలో కెఫైన్ ఉంటుందన్నది మనందరికీ తెలిసిందే. అలాగే ఎనర్జీ డ్రింకుల్లో కూడా ఇది ఉంటుంది. ఇటీవల ఆకలిని తగ్గించే సప్లిమెంటుగా కెఫైన్ ని వెయిట్ లాస్ రెజీమ్ లో సూచిస్తున్నారు. కెఫైన్ థెర్మోజెనిక్ కాంపౌండ్.
అంటే ఫ్యాట్, కాలరీలను కరిగించాలని శరీరానికి సూచించే మూలకం అనమాట. కెఫైన్ జీవక్రియను వేగవంతం చేస్తుంది. శరీరంలోని కాలరీలను, ఫ్యాట్ ను కరిగించడంలో సహాయపడుతుంది. దీన్ని తీసుకోవడం వల్ల తొందరగా ఆకలి వేయదు. ఇది కేవలం కొన్ని కాలరీలను మాత్రమే శరీరంలో ఫ్యాట్ గా స్టోర్ చేస్తుంది.

- Advertisement -

కెఫైన్ మెదడులోని కణాలను ఉత్తేజితం చేసి శారీరకంగా యాక్టివ్ గా ఉంచుతుంది. జీవక్రియను పెంచడం ద్వారా ఎక్కువ ప్రమాణంలో కాలరీలు కరిగేట్టు చేస్తుంది. దీన్ని తీసుకోవడం వల్ల శరీరానికి అలసట అనిపించదు. వర్కవుట్లు చేసేటప్పుడు ఫ్యాట్ కరిగేలా ఇది సహకరిస్తుంది. ఎల్లప్పుడూ ఉల్లాసంగా ఉంచడమే కాకుండా మూడ్ బూస్టర్ గా కూడా ఇది పనిచేస్తుంది. పని పరంగా ఏకాగ్రతను కూడా మీలో పెంచుతుంది. వ్యాయామాలు చేసిన తర్వాత తలెత్తే నొప్పులు, బాధల నుంచి సాంత్వన నిస్తుంది. వ్యాయామాలు చేయడానికి కావలసింత ఎనర్జీని కూడా ఇస్తుంది. శరీరాన్ని ఆరోగ్యకరమైన బరువుతో, ఆక్రుతితో ఉంచేలా కెఫైన్ ఎంత తోడ్పడుతుందో, దాన్ని అతిగా తీసుకుంటే ఇబ్బందులు కూడా అంతే తీవ్రంగా ఉంటాయని ఫిట్ నెస్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పరిమిత పరిమాణంలో టీ,
కాఫీలను తీసుకోవాలని సూచిస్తున్నారు.

ఉదాహరణకు అతిగా కెఫైన్ తీసుకోవడం వల్ల నిద్రలేమి సమస్య తలెత్తుతుంది. డీహైడ్రేషన్ సమస్యను కూడా ఎదుర్కొంటారు. దీంతో జీవక్రియ కూడా నెమ్మదిస్తుంది. ఎక్కువ కెఫైన్ డ్రింకులు తీసుకోవడం వల్ల ఎపినెఫ్రైన్ వంటి స్ట్రెస్ హార్మోన్లు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే పరిమితంగా మాత్రమే కెఫైన్ వాడకం శరీరానికి మంచిదని చెప్తున్నారు. మీరు కాఫీ లవర్ అయితే బుల్లెట్ ప్రూఫ్ కాఫీ తీసుకోవడం బెస్టు అంటున్నారు. అంటే నిత్యం వేడినీళ్ల కాఫీని (చికోరీ లేకుండా) ఒక కప్పు తీసుకుంటే మంచిది. లేదా రోజుకు రెండు కప్పులు గ్రీన్ టీ తాగితే మంచిది. లేదా డార్కు చాక్లెట్ చిన్న ముక్కను తినొచ్చు. లేదా
ఒక షాట్ ఎక్స్ ప్రెసో కాఫీని తాగాలి. అది కాకపోతే చక్కెర లేకుండా బ్లాక్ టీ తాగొచ్చు.

కెఫైన్ ఉన్న ఐటమ్స్ కు కూడా దూరంగా ఉండాలి. ముఖ్యంగా ఆకలిని తగ్గించే మందులు వాడకూడదు. వీటిల్లో కెఫైన్ ఉంటుంది. అంతేకాదు ప్రిజర్వేటివ్స్ కూడా వీటిల్లో బాగా ఉంటాయి. ఎనర్జీ డ్రింకులకు కూడా దూరంగా ఉండాలి. వీటిల్లో షుగర్ తో పాటు కెఫైన్ ఉంటుంది. కోలాలు, సోడాల్లో కూడా కెఫైన్ బాగా ఉంటుంది కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. సో… కెఫీన్ మంచిది కానీ మితం దాటకూడదని గుర్తుంచుకోండి. అలాగే వైద్యుల సూచనలతోనే కెఫీన్ ఎంత తీసుకోవాలో అంత తీసుకోవడం మంచిదని మరొవొద్దు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News