Monday, June 23, 2025
HomeతెలంగాణKavitha: హలో కాదు.. జై తెలంగాణ అనాలి: కవిత

Kavitha: హలో కాదు.. జై తెలంగాణ అనాలి: కవిత

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha)వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఆమె తండ్రి, మాజీ సీఎం కేసీఆర్ కు రాసిన లేఖ లీక్ అయిన నాటి నుంచి ఆమె వ్యవహారశైలి పూర్తిగా మారింది. కేసీఆర్ పక్కన దెయ్యాలు ఉన్నారంటూ కవిత చేసిన రాజకీయ దుమారం రేపాయి. అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ, జెండాలతో సంబంధం లేకుండా ఆమె సొంతంగా కార్యక్రమాలు చేపడుతున్నారు. ఇటీవల తెలంగాణ జాగృతి కొత్త కార్యాలయం కూడా ప్రారంభించారు.

ఈ క్రమంలోనే పెంచిన బస్సు పాస్ ఛార్జీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ జాగృతి ఆధ్వర్యంలో బస్సు భవన్ ఎదుట కవిత ధర్నా నిర్వహించారు. ఛార్జీలు తగ్గించే వరకు తమ పోరాటం ఆగదని హెచ్చరించారు. బస్ భవన గేటు వద్ద పోలీసులు ఆమెను అడ్డుకోవడంతో రోడ్డుపైనే భైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జాగృతి కార్యకర్తలతో పాటు ఆమెను కూడా పోలీసుల వాహనాల్లో అక్కడి నుంచి తరలించారు.

అనంతరం తెలంగాణ జాగృతి కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఆర్టీసీ బస్సు పాస్ ధరల పెంపు విషయంలో ప్రభుత్వం వెనక్కి తగ్గాలని డిమాండ్ చేశారు. లేకపోతే బస్ భవన్ ముట్టడి చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఒకప్పుడు తెలుగు సినిమాలలో.. తెలంగాణ భాష, యాస అంటే అవహేళనగా చూసేవారని తెలిపారు. కానీ ఇప్పుడు తెలంగాణ భాష, యాస లేకుండా సినిమాలు హిట్ కావడం లేదన్నారు. రానున్న బోనాల పండుగ సందర్భంగా ప్రతి బోనం మీద జై తెలంగాణ నినాదం రాయాలని పిలుపునిచ్చారు అలాగే ఎవరి దగ్గరి నుంచైనా కాల్ వచ్చినప్పుడు ఫోన్ లిఫ్ట్ చేసి.. హలో అనే బదులు జై తెలంగాణ అనాలంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News