Sunday, June 15, 2025
Homeచిత్ర ప్రభAllu Arjun: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్

Allu Arjun: సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా అవార్డు అందుకున్న అల్లు అర్జున్

Allu Arjun: హైదరాబాద్‌లోని హైటెక్స్ వేదికగా తెలంగాణ గద్దర్‌ సినీ అవార్డుల(Gaddar Awards) ప్రదానోత్సవం అట్టహాసంగా జరిగింది. ముందుగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి, TFDC ఛైర్మన్ దిల్ రాజు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అనంతరం అవార్డు గ్రహీతలకు రూ.5లక్షల నగదుతో పాటు సీల్డ్, ప్రశంసా పత్రం ప్రదానం చేశారు. కార్యక్రమం మధ్యలో సీఎం రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా అతిథులను ఆత్మీయంగా పలకరించారు. ఇందులో భాగంగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు షేక్ హ్యాండ్ ఇచ్చి అలింగనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియా వైరల్ అవుతోంది. ఇక కార్యక్రమంలో చివర్లో ఉత్తమ నటుడు అవార్డును అల్లు అర్జున్ కు సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క్ ప్రధానం చేశారు. అలాగే బాలయ్యకు ఎన్టీఆర్ అవార్డు, ఉత్తమ నటిగా నివేదా థామస్, ఉత్తమ దర్శకుడిగా నాగ్ అశ్విన్ కు కూడా అవార్డును అందించారు.

అనంతరం బన్నీ మాట్లాడుతూ.. ఇలాంటి ప్రతిష్టాత్మక అవార్డు అందుకోవడం తనకు చాలా ఆనందంగా ఉందన్నారు. ఈ అవార్డు తనకు అందజేసిన సీఎం రేవంత్ రెడ్డి అన్న, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క గారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే పుష్ప-2 సినిమాలోని డైలాగ్‌ను రేవంత్ రెడ్డి అనుమతితో చెప్పడం విశేషం. ఆ బిడ్డ మీద ఒక్క గీత పడినా.. గంగమ్మ తల్లి జాతరలో యాట తల నరికినట్లు రప్పా రప్పా నరుకుతా.. పుష్ప.. పుష్పరాజ్.. అస్సలు తగ్గేదేలే అంటూ డైలాగ్ చెప్పారు. దీంతో ప్రేక్షకుల కేరింతలతో అడిటోరియం దద్దరిల్లిపోయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News