Monday, June 16, 2025
Homeచిత్ర ప్రభThe Rajasaab: భయపెడుతున్న 'ది రాజాసాబ్' ప్రీ టీజర్

The Rajasaab: భయపెడుతున్న ‘ది రాజాసాబ్’ ప్రీ టీజర్

The Rajasaab Pre Teaser: రెబల్ స్టార్ ప్రభాస్(Prabhas) వరుస పాన్ ఇండియా సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇందులో భాగంగా మారుతి దర్వకత్వంలో ‘ది రాజాసాబ్’ అనే హర్రర్ కామెడీ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ప్రభాస్ లుక్ పోస్టర్లు మూవీపై క్యూరియాసిటీ పెంచాయి. తన రెగ్యులర్ ఫార్మాట్ కు భిన్నంగా ప్రభాస్ హర్రర్ మూవీలో నటించడం విశేషం. దీంతో ఈ మూవీ కోసం డార్లింగ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ను మేకర్ ప్రకటించారు. ఇందుకోసం ప్రీ టీజర్ రిలీజ్ చేశారు.

ఈ ప్రీరిలీజ్ టీజర్ మూవీపై ఆసక్తి పెంచుతోంది. ఓ పాడుబడ్డ ఇంటి ముందు హీరోయిన్ మాళవికతో పాటు మరికొంతమంది పైకి భయపడుతూ చూస్తున్నారు. దీంతో ఈ మూవీ ఎంటర్‌టైనింగ్‍గా, భయానకంగా సాగుతుందని తెలుస్తోంది. ఈ సందర్భంగా జూన్ 16న ఉదయం 10.52 గంటలకు టీజర్ రిలీజ్ చేస్తామని ప్రకటించారు.

ఈ మూవీలో ప్రభాస్ పార్ట్ షూటింగ్ కంప్లీట్ అయిందని.. డబ్బింగ్ పనులు కూడా అయిపోయినట్లు సమాచారం. అయితే గ్రాఫిక్స్ పనులు పెండింగ్ లో ఉండటంతో మూవీ రిలీజ్ లేట్ అవుతుంది. ఈ ఏడాది డిసెంబర్ 5న మూవీని ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయనున్నారు.

పీపుల్స్ మీడియా బ్యానర్ మీద టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ది కుమార్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. సంజయ్ దత్, మురళి శర్మ, అనుపమ్ ఖేర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇక ప్రముఖ సంగీత దర్శకుడు థమన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాతో పాటు ‘స్పిరిట్’, ‘ఫౌజీ’ చిత్రాల్లోనూ ప్రభాస్ బిజీగా ఉన్నాడు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News