Google AI Edge Gallery : టెక్నాలజీ ప్రపంచం రాకెట్ వేగంతో దూసుకుపోతోంది, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ప్రతిరోజూ కొత్త శిఖరాలను అధిరోహిస్తోంది. ఈ విప్లవాత్మక పురోగతిలో, టెక్ దిగ్గజం గూగుల్ మరోసారి సంచలనం సృష్టించింది. నెట్‌వర్క్ లేకపోయినా పనిచేసే సరికొత్త యాప్‌ను గూగుల్ ఆవిష్కరించింది. అవును, మీరు విన్నది నిజమే..! ఇకపై ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా, మీ ఫోన్‌లో మీకు కావలసిన పనులను చేసుకోవచ్చు. ఇది ఎలా సాధ్యం? గూగుల్ అందించిన ఈ వినూలమైన సాంకేతికత వెనుక ఉన్న రహస్యం ఏమిటో తెలుసుకుందాం.
ఇంటర్నెట్ లేకుండానే AI సామర్థ్యాలు మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వాడొచ్చా? అవును, ప్రపంచ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ మరో విప్లవాత్మక ఆవిష్కరణతో ముందుకు వచ్చింది. ఇంటర్నెట్ కనెక్షన్ లేకపోయినా మీ స్మార్ట్‌ఫోన్‌లో AI మోడల్స్‌ను ఉపయోగించుకునేలా ‘AI ఎడ్జ్ గ్యాలరీ’ అనే సరికొత్త యాప్‌ను లాంచ్ చేసింది. ఈ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ మీ ఫోన్‌లో ఇంటర్నెట్ లేకపోయినా అద్భుతాలు చేస్తుంది. మీరు ఇమేజ్‌లను సృష్టించవచ్చు, కోడ్ రాయవచ్చు, ప్రశ్నలకు సమాధానాలు రాబట్టవచ్చు – ఇవన్నీ ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేకుండానే! ఇది కేవలం సౌకర్యవంతంగా ఉండటమే కాదు, అనేక ప్రయోజనాలను అందిస్తుంది.
యూజర్ ప్రైవసీ: మీ డేటా క్లౌడ్ సర్వర్‌లకు వెళ్ళకుండా, మీ మొబైల్ ఫోన్‌లోనే బ్యాక్‌ఎండ్‌లో రన్ అవుతుంది. ఇది మీ వ్యక్తిగత గోప్యతకు పూర్తి భద్రతను ఇస్తుంది.
సెక్యూరిటీ: డేటా క్లౌడ్‌లోకి వెళ్లకపోవడం వల్ల సెక్యూరిటీ రిస్క్ కూడా గణనీయంగా తగ్గుతుంది.
వేగవంతమైన పనితీరు: సర్వర్ల కోసం వేచి చూడాల్సిన అవసరం లేకుండా, యాప్ చాలా వేగంగా పనిచేస్తుంది. మీరు అడిగిన ప్రశ్నలకు AI తక్షణమే సమాధానాలు ఇవ్వగలదు.
శక్తివంతమైన ‘గెమ్మా 31బీ’ మోడల్ : ఈ గూగుల్ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ వెనుక ఉన్న శక్తివంతమైన సాంకేతికత ‘గెమ్మా 31బీ’ అనే లాంగ్వేజ్ మోడల్. ఇది కేవలం 529 MB పరిమాణంలో ఉండే ఒక కాంపాక్ట్ మోడల్. ఇది అపాచీ 2.0 లైసెన్స్‌తో వస్తుంది, అంటే ఇది విద్య, వాణిజ్య అవసరాలకు కూడా ఉపయోగించడానికి అనుమతిస్తుంది.
గెమ్మా 31బీ సామర్థ్యాలు అద్భుతం:
ఇది ఒక సెకనుకు 2,585 టోకెన్లను ప్రాసెస్ చేయగలదు. అంటే పెద్ద మొత్తంలో టెక్స్ట్‌ను క్షణాల్లో ఉత్పత్తి చేయగలదు.
గెమ్మా పరిమాణంలో చిన్నదైనప్పటికీ, కంటెంట్ క్రియేట్ చేయడం, డాక్యుమెంట్లను విశ్లేషించడం, స్మార్ట్ రిప్లైలు ఇవ్వడం వంటి పనులను అత్యంత వేగంగా చేయగలదు.
లభ్యత & భవిష్యత్తు ప్రణాళికలు
ప్రస్తుతానికి, ఈ గూగుల్ AI ఎడ్జ్ గ్యాలరీ యాప్ ఓపెన్ సోర్స్‌లో అందుబాటులో ఉంది. ఇది ఆండ్రాయిడ్ యూజర్లకు సరికొత్త AI అనుభవాన్ని అందిస్తోంది. త్వరలోనే iOS (ఐఫోన్) వెర్షన్‌ను కూడా విడుదల చేయనున్నట్లు గూగుల్ ప్రకటించింది.