Saturday, October 5, 2024
Homeఆంధ్రప్రదేశ్Banaganapalli: రవ్వలకొండ క్షేత్రంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

Banaganapalli: రవ్వలకొండ క్షేత్రంలో శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు

రవ్వలకొండ క్షేత్రంలో వెలసిన శ్రీ వీరప్పయ్య స్వామి ఆనంద్రాశ్రమం, గోశాల దేవస్థానముల వద్ద ఆనందాశ్రమ వ్యవస్థాపకులు, పీఠాధిపతులు శ్రీ జ్ఞానేశ్వరానంద స్వామి ఆధ్వర్యంలో ఈనెల 25-27 వరకు శ్రీ వీరప్పయ్య స్వామి, శ్రీ గాయత్రీ దేవి, శ్రీ దక్షిణామూర్తి స్వామి వార్ల  విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలను మూడు రోజులపాటు నిర్వహిస్తున్నట్టు  ఆనందాశ్రమం నిర్వాహకులు శ్రీ జ్ఞానేశ్వరానంద స్వామి తెలిపారు.

- Advertisement -

కాలజ్ఞాన తత్వవేత్త, శ్రీ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి నడయాడిన బనగానపల్లె రవ్వలకొండపై ఒక గుహలో బ్రహ్మంగారు కాలజ్ఞానం రచించి ఆ కాలజ్ఞానం ప్రతులను తనకు గోవుల కాపరిగా ఆశ్రయం ఇచ్చిన శ్రీ గరిమిరెడ్డి అచ్చమాంబ నివాసమున్న ప్రాంతంలో ఒక నేల మాళిగలో కాలజ్ఞాన ప్రతులను దాచి ఉంచటంతో బనగానపల్లె బ్రహ్మంగారు నడయాడిన పవిత్ర స్థలంగా ప్రఖ్యాతిగాంచింది. ఈ కాలజ్ఞాన గుహల వద్ద ఆనందాశ్రమ వ్యవస్థాపకులు జ్ఞానేశ్వరానంద స్వామి దాతల సహకారంతో కోటి వ్యయంతో శ్రీ వీరప్పయ్య స్వామి దేవస్థానము నిర్మించి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు చేపట్టారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News