Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కంప్లీట్ చేయాల్సిన సినిమాలపై ఫోకస్ పెట్టటమే కాదండోయ్.. చాలా త్వరత్వరగా పూర్తి చేసేస్తున్నారు కూడా.. ఇప్పటికే హరిహర వీరమల్లు, ఓజీ చిత్రాలను ఆయన పూర్తి చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆయన పూర్తి చేయాల్సిన సినిమాగా ఉస్తాద్ భగత్ సింగ్ మాత్రమే ఉంది. రీసెంట్‌గానే ఆ మూవీని కూడా స్టార్ట్ చేసేశారు జనసేనాని. ఏపీ డిప్యూటీ సీఎంగా రాజకీయాల్లో బిజీగా ఉంటోన్న పవన్ మరీ తీరిక చేసుకుని సినిమాలకు టైమ్ కేటాయిస్తున్నారు. అందులో భాగంగా ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్లో ఆయన భాగం కాబోతున్నారు. త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన కీలక సన్నివేశాలు, పాటల చిత్రీకణ కోసం పవన్ సహా మెయిన్ టీమ్ అంతా విదేశాలకు వెళ్లబోతున్నారు.
లేటెస్ట్ సమాచారం మేరకు ఉస్తాద్ భగత్ సింగ్ విలన్ ఎవరనేది ఫిక్స్ అయ్యిందంటున్నారు. ఇంతకీ ఈ మాస్ కమర్షియల్ మూవీలో పవర్‌స్టార్‌ను ఢీ కొట్టబోయేదెవరో కాదు.. కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ యాక్టర్ పార్తిబన్. పలు కోలీవుడ్ సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా మెప్పించటంతో పాటు నిర్మాతగానూ, దర్శకుడిగానూ తనదైన ముద్ర వేశారీయన. ఇప్పటి వరకు తెలుగులో ఓ సినిమాలో మాత్రమే యాక్ట్ చేశారు. ఇప్పుడు పార్తిబన్ విలన్‌గా నటించబోతున్నాడనే వార్త కోలీవుడ్‌లో తెగ వైరల్ అవుతోంది. దీంతో పాటు ఇటీవల పవన్, పార్తిబన్ కలిసి ఉన్న ఫొటో కూడా వైరల్ అవుతుంది. ఉస్తాద్ భగత్ సింగ్ కథలో విలన్‌కు డైరెక్టర్ హరీష్ శంకర్ తనదైన శైలిలో కామెడీ టచ్ యాడ్ చేశారట. ఎవరైనా కొత్తవారితో ఆ క్యారెక్టర్ చేయిస్తే బావుంటుందని ఆలోచిస్తున్న తరుణంలో హరీష్‌కు పార్తిబన్ మైండ్లోకి రావటంతో ఆయన్ను కలవటం.. ఆయనకు క్యారెక్టర్ నచ్చటంతో ఒప్పుకోవటం చకచకా జరిగిపోయాయనేది ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోన్న టాక్.

పార్తిబన్ టాలీవుడ్ ఎంట్రీ అనేది అందరిలోనూ క్యూరియాసిటీని కలిగిస్తోంది. ఈసినిమాతో పాటు మరికొన్ని సినిమాల్లోనూ మేకర్స్ పార్తిబన్‌ను ఎంపిక చేసుకునే అవకాశాలైతే మెండుగా ఉన్నాయని సినీ సర్కిల్స్ అంటున్నాయి. తెలుగు సినిమా పాన్ ఇండియా రేంజ్లో రాణిస్తోన్న తరుణంలో చాలా మంది పరభాషా నటీనటులు ఇక్కడికి ఎంట్రీ ఇస్తున్నారు. వరుస అవకాశాలను అందుకుంటున్నారు. అదే బాటలో ఇప్పుడు పార్తిబన్ ఎంట్రీ కూడా డిస్కషన్ పాయింట్‌గా మారింది.
ఉస్తాద్ భగత్ సింగ్‌లో పవన్ కళ్యాణ్ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ చిత్రం తెరికి ఇది రీమేక్ అంటున్నారు. కానీ.. ఎప్పటిలాగానే హరీష్ తెరి కథను పూర్తిగా మార్చేశారని అంటున్నారు. పవన్ కళ్యాణ్ డేట్స్ ఇప్పుడెంతో కీలకం కావటంతో మేకర్స్ ప్లానింగ్ ప్రకారం సినిమాను పూర్తి చేసే పనిలో ఉన్నారు. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కాంబోలో వస్తోన్న సినిమా ఇది. ఇందులో పవర్‌స్టార్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారు. మరి సినిమా ఈ ఏడాదిలోనే రిలీజ్ అవుతుందా.. లేదా అనేది అందరిలో మెదులుతున్న ప్రశ్న.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/rajinikanth-watched-kannappa-movie/