Hari Hra Veeramallu: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఫస్ట్ పాన్ ఇండియా సినిమా హరి హర వీరమల్లు. జాగర్లమూడి రాధాకృష్ణ, జ్యోతికృష్ణ దర్శకులు. నిధి అగర్వాల్ హీరోయిన్గా నటించింది. వీరమల్లు మొదలై దాదాపు నాలుగేళ్ళవుతోంది. వాస్తవానికి పవన్ కళ్యాణ్ సినిమా కమిటైతే జెట్ స్పీడ్‌లో పూర్తి చేసేస్తారు. కానీ, ఆయన రాజకీయాలలోకి వెళ్ళిన తర్వాత ఆ స్పీడ్ తగ్గింది. ఒకదశలో పూరిగా సినిమాలకి గుడ్ బాయ్ అన్నారు. కానీ, ఆయన రాజకీయ సభల్లో ఎక్కడ కనిపించినా ప్రతీ ఒక్కరు మళ్ళీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించాలనే అడిగేవారు.
అంతేకాదు, ఎన్నో ఏళ్ళ క్రితమే నిర్మాత ఏ ఎం రత్నం దగ్గర అడ్వాన్స్ తీసుకున్నారట. అలాగే, మరికొన్ని సినిమాలు చేస్తానని కమిటై అడ్వాన్స్ తీసుకొని ఉన్నారు. ఆకారణంగానే మళ్ళీ వకీల్ సాబ్ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకున్నారు. ఆ తర్వాత భీంలా నాయక్ ని మనకి ఇచ్చారు. ఈ రెండు సినిమాలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అయ్యారు. అయితే, ఫస్ట్ పాన్ ఇండియా సినిమాగా మొదలైన హరి హర వీరమల్లు మాత్రం అడుగడుగునా అవాంతరాలను ఎదుర్కుంది. డిప్యూటీ సీఎం అయిన తర్వాత మళ్ళీ అందరిలో ఎన్నో అనుమానాలు.
ALSO READ: https://teluguprabha.net/news/is-mega-157-releasing-before-vishwambhara/
అసలు పవన్ కళ్యాణ్ కమిటైన సినిమాలను పూర్తి చేస్తారా అని. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే అన్నీ సినిమాలు మొదలు పెట్టి మధ్యలో ఆపేసినవే. అందుకే, ఆయన నిర్మాతలను ఇబ్బంది పెట్టదలుచుకోలేదు. అందరినీ పిలిచి డేట్స్ ఇస్తాను షూటింగ్ స్టార్ట్ చేసుకోమని చెప్పారు. చెప్పినట్టుగానే హరి హర వీరమల్లు, ఓజీ, ఉస్తాద్ భగత్‌సింగ్ సినిమాలకి డేట్స్ ఇచ్చారు. వీటిలో వీరమల్లు, ఓజీ షూటింగ్ పూర్తైంది. ప్రస్తుతం ఉస్తాద్ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. త్వరలో సాంగ్స్ కోసం ఫారిన్ వెళ్ళబోతున్నారు.
అయితే, ఈ నెల 12న అత్యంత భారీ స్థాయిలో రిలీజ్ కావాల్సిన హరి హర వీరమల్లు అనూహ్యంగా మళ్ళీ పోస్ట్‌పోన్ అయింది. ఇది పవన్ ఫ్యాన్స్ కి మాత్రమే కాదు, ప్రతీ ఒక్కరికీ పెద్ద షాకింగ్ న్యూస్. మేకర్స్ మాత్రం అద్భుతమైన ట్రైలర్ కోసం, కొత్త రిలీజ్ డేట్ కోసం ఎదురుచూడండి. గొప్ప చిత్రాన్ని మీ ముందుకు తీసుకువచ్చేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని నోట్ రిలీజ్ చేసింది చిత్రబృందం. అప్పటి నుంచి వీరమల్లు రాక ఎప్పుడూ..? అంటూ అందరూ ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే భారీ చిత్రాలు కొన్ని సాలీడ్ డేట్ ని లాక్ చేసుకున్నాయి. మరి వీరమల్లు రిలీజ్ ఎప్పుడుందో మేకర్స్ క్లారిటీ ఇస్తే బావుంటుంది.