Saturday, November 23, 2024
Homeఓపన్ పేజ్Death penalty: మరణ శిక్షకు ప్రత్యామ్నాయం?

Death penalty: మరణ శిక్షకు ప్రత్యామ్నాయం?

మరణ శిక్ష విధించిన నేరస్థులను ఉరి ద్వారా చంపడం అనేది క్రూరమూ కాదు, ఆటవికమూ కాదని సు మారు నలభై ఏళ్ల క్రితం తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు ఇప్పుడు దీని మీద కూడా పునరాలోచన చేస్తోంది. మరణ శిక్షను ఉరికన్నా తేలికగా, బాధారహితంగా అమలు చేయాల్సిన అవసరంపై దీర్ఘాలోచన చేయ డం ప్రారంభించింది. అసలు మరణ శిక్షను పూర్తిగా తొలగించాలా అన్న చర్చలో భాగంగా న్యాయమూ ర్తులు, న్యాయ నిపుణులు ఇప్పుడు తక్కువ బాధాకరంగా మరణ శిక్షను అమలు చేయడంపై దృష్టి సారించారు. మరణ శిక్ష విధించడం మంచిదా కాదా అన్న చర్చకు ఇప్పుడు ఉరి శిక్ష ద్వారా ఖైదీలను చ ౦పడం మంచిదా కాదా అన్న చర్చ తోడయింది. ఒక్క న్యాయ నిపుణులే కాదు, పాలకులు, అధికారు లు సైతం ఈ చర్చలో నిమగ్నమయ్యారు. మరణ శిక్షను కూడా మరింత మానవతా దృక్పథంతో అమ లు చేయడానికి మార్గాలను అన్వేషించాల్సిందిగా సుప్రీంకోర్టు బెంచి సూచించడంతో పాటు, ఇందుకు సంబంధించిన వివరాలను దేశ, విదేశాల నుంచి సేకరించాల్సిందిగా కూడా కోరింది.

- Advertisement -

నిజానికీ, ఈ అంశానికి సంబంధించి గతంలో రెండు తీర్పులు వెలువడ్డాయి. 1980లో బచన్‌ సింగ్‌ కు, పంజాబ్‌ ప్రభుత్వానికి మధ్య జరిగిన కోర్టు వివాదంలో కోర్టు అరుదులో కెల్లా అరుదైన కేసుల్లో మాత్రమే మరణ శిక్ష విధించాలని స్పష్టం చేసింది. ఆ తరువాత దీనదయాళ్కు, కేంద్ర ప్రభుత్వానికి మ ధ్య చోటు చేసుకున్న వివాదంలో కోర్టు అతి తక్కువ బాధతో, అన్నిటికన్నా తేలికగా అమలయ్యే మరణ శిక్ష ఉరి మాత్రమేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. కాగా, 1967లో 25వ లా కమిషన్‌ తన నివేదిక లో, మరణ శిక్ష పడిన ఖైదీలను విద్యుదాఘాతంతోగానీ, గ్యాస్‌ చేంబర్లో ఉంచడం ద్వారా కానీ, విష ప్రయోగం ద్వారా గానీ చంపడం తేలికగా, తక్కువ బాధాకరంగా ఉంటుందనే సూచన చేసింది కానీ, ఆ తర్వాత ఈ మార్గాలపై ఎక్కువగా చర్చ జరగలేదు. ఈ మార్గాలను అది సిఫారసు కూడా చేయలే

మరణ శిక్షను పూర్తిగా రద్దు చేయాలని సుప్రీంకోర్టు ఏనాడూ భావించలేదు. కానీ, మరణ శిక్షలను వి ధించడాన్నే కఠినతరం చేసింది. ఎక్కువగా మరణ శిక్షలు విధించడానికి వీలు లేకుండా చేసింది. అధికా రులు సంబంధిత ఖైదీకి సంబంధించి దర్యాప్తు చేస్తున్నప్పుడు, మరణ శిక్ష తప్పనిసరి కాకుండా కొన్ని మార్పులు చేయించింది. ఏ నేరస్థుడికైనా, ఖైదీకైనా ఉరి శిక్ష అమలు చేసే ముందు, అందుకు దారితీసిన

పరిస్థితుల మధ్య సమతూకం సాధించడానికి, అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే మరణ శిక్ష విధించ డానికి మార్గం సుగమం చేసింది. అంతేకాదు. ఖైదీలు బహిరంగ న్యాయస్థానం ద్వారా క్షమాభిక్షను అభ్య ర్థించడానికి కూడా అవకాశం కల్పించింది. క్షమాభిక్ష పిటిషన్లపై విచారణ జరిపే కాలాన్ని, సమయాన్ని బా గా తగ్గించి, కాలయాపన జరగకుండా చర్యలు తీసుకుని, ఈ పిటిషన్లను సాధ్యమైనంత ఎక్కువ సంఖ్య లో స్వీకరించడానికి అవకాశం కల్పించి, మొత్తం మీద అత్యంత అరుదైన కేసుల్లో మాత్రమే మరణ శిక్ష అమలు చేయడానికి కావాల్సిన చర్యలన్నీ చేపట్టింది.

ఇప్పుడు దీన్ని కూడా మరింత మానవత్వంతో నిర్వహించడానికి ప్రయత్నాలు చేస్తోంది. ఉరి శిక్ష అనే ది బాధాకరంగా ఉండాల్సిన అవసరం లేదని, దీనినే మరింత సున్నితంగా, బాధారహితంగా చేయవచ్చ నే అభిప్రాయం కూడా వినవస్తోంది. అదే విధంగా విద్యుదాఘాతంతో లేదా విష ప్రయోగంతో మరణ శి క్ష విధించడం అనేది బాధాకరంగా ఉంటుందని చెప్పడానికి కూడా ఆధారాలు లేవు. కాగా, కేంద్ర ప్రభు త్వం మాత్రం మరణ శిక్షను కొనసాగించాలనే భావిస్తోంది. ఇతర మరణ శిక్షల కంటే ఉరి శిక్ష చాలా త క్కువ బాధాకరంగా ఉంటుందని, ఇతర దేశాలలోని మరణశిక్షలను కూలంకషంగా పరిశీలించిన తర్వా తే ఇక్కడ ఈ పద్ధతిని అమలు చేయడం జరుగుతోందని కూడా స్పష్టం చేసింది. ఇంతకన్నా తేలికైన, బాధారహితమైన మరణ శిక్ష మరొకటి ఉండే అవకాశం లేదని కూడా అభిప్రాయపడింది.

వాస్తవానికి, మరణ శిక్ష అనేదే మానవతా విలువలకు విరుద్ధమైనది. ఇది తక్కువ బాధాకరమా, ఎకు ్కవ బాధాకరమా అన్నది సరైన వాదనగా కనిపించడం లేదు. మరణ శిక్షను ఏ విధంగా విధించినా అది క్రౌర్యమే. బాధాకరమే. మరణ శిక్ష అనేది మానవ హుందాతనానికి, మానవ గౌరవ మర్యాదలకు పూర్తి గా విరుద్ధం. ఇందులో సందేహమేమీ లేదు. హత్యకు హత్య శిక్ష కాదు, పరిష్కారం కాదు. మరణ శిక్ష మీద లోతుగా చర్చ జరుగుతున్న కొద్దీ ఇది మరింత ఆటవికం, క్రౌర్యం అనే అభిప్రాయమే స్థిరపడు తుంది. క్రౌర్యాన్ని, అమానుషత్వాన్ని తగ్గించాలని భావిస్తున్నప్పుడు మరణ శిక్షను రద్దు చేయడమే సరైన పరిష్కారంగా కనిపిస్తోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News