Puri- Sethupathi Movie: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైలే వేరు. ఆయన సినిమా ఎప్పుడు మొదలుపెట్టారు.. ఎప్పుడు తీశారో కూడా తెలియదు. అంత ఫాస్ట్ గా, పక్కాగా మూవీ కంప్లీట్ చేస్తారు. పూరి సినిమాలంటే ఒకప్పుడు ట్రెండ్ సెట్ సినిమాలుగా నిలిచాయి. ఆయన డైలాగులు హీరోల నోటి నుంచి బాంబుల్లా పేలుతుంటే అభిమానులు విజిల్స్ తో గోల చేసేవారు. బద్రి, ఇడియట్, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, శివమణి, పోకిరి, దేశముదురు, ఇస్మార్ట్ శంకర్ లాంటి సినిమాలు టాలీవుడ్ ను షేక్ చేశాయి. అయితే కొంతకాలంగా పూరిలోని మ్యాజిక్ తగ్గిపోయింది. రొటీన్ స్క్రిప్టులతో వెనకబడిపోయారు. లైగర్, డబుల్ ఇస్మార్ట్ శంకర్ సినిమాలు అయితే భారీ డిజాస్టర్ గా నిలిచాయి.
దీంతో ఈసారి సూపర్ హిట్ కొట్టి స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వాలని డిసైడ్ అయ్యాడు. ఇందుకోసం కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని లైన్ లో పెట్టాడు. విజయ్ సేతుపతి సెటిల్డ్ నటనకు, తన మేకింగ్ స్టైల్ జోడించి హిట్ కొట్టాలని పూరి భావిస్తున్నాడు. ఈ నేపథ్యంలో పక్కాగా ప్లాన్ ప్రకారం వెళ్తున్నాడు. పాన్ ఇండియా సినిమా కావడంతో అందుకు తగ్గ నటులను ఎంపిక చేస్తున్నాడు. ఇప్పటికే కన్నడ హీరో దునియా విజయ్, సీనియర్ నటి టబులను ఈ సినిమలో కీలక పాత్రలకు తీసుకున్నాడు. తాజాగా మరో యంగ్ బ్యూటీని కూడా మూవీలో భాగం చేశాడు. ఈ విషయాన్ని పూరి కనెక్ట్స్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేసింది.
భీమ్లా నాయక్, బింబిసార, విరూపాక్ష, సార్ చిత్రాల్లో నటించిన హీరోయిన్ సంయుక్తను ఇందులో నటించనున్నట్లు తెలింది. ఈమేరకు పూరి, ఛార్మితో సంయుక్త కలిసి దిగిన ఫొటోను పంచుకుంది. ఆమె నడకలో హుందాతనం.. కళ్లల్లో ఆగ్రహం.. అంటూ రాసుకొచ్చింది. ఇక ఈ మూవీని పూరి కనెక్ట్స్ బ్యానర్ పై పూరి జగన్నాథ్, ఛార్మి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ‘బెగ్గర్’ లేదా‘భిక్షాందేహి’అనే పేర్లను పరిశీలిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే షూటింగ్ లొకేషన్స్ ఫైనల్ చేశారు. దీంతో త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేసి వచ్చే ఏడాది సమ్మర్ లో మూవీని విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నారు.
Puri Jagannadh: పూరి-విజయ్ సేతుపతి చిత్రంలో యంగ్ బ్యూటీ
సంబంధిత వార్తలు | RELATED ARTICLES