Wednesday, June 18, 2025
Homeఇంటర్నేషనల్Trump shocks Macron : కాల్పుల విరమణ కాదు అంతకు మించి..

Trump shocks Macron : కాల్పుల విరమణ కాదు అంతకు మించి..



Trumps Response To Macron : ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ చేసిన వ్యాఖ్యలపై డొనాల్డ్ ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇరాన్-ఇజ్రాయెల్ కాల్పుల విరమణ కోసమే జీ7 సదస్సు నుంచి తాను బయలుదేరానన్న మెక్రాన్ వ్యాఖ్యలను ఖండించారు. మెక్రాన్ ప్రచార ఆర్భాటం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. వాషింగ్టన్ వెళ్లి కాల్పుల విరమణపై కసరత్తు చేయబోనని, “దాని కంటే చాలా పెద్దదే” చేయబోతున్నానని ట్రంప్ స్పష్టం చేశారు. మెక్రాన్ ప్రతిసారీ తప్పుగానే అర్థం చేసుకుంటున్నారని ఆయన ‘ట్రూత్ సోషల్ పోస్ట్స్’ పేజీలో పేర్కొన్నారు.


అమెరికాకు ఫ్రాన్స్ తప్పకుండా సహాయం చేస్తుంది :
‘ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణను అమెరికా సాధిస్తే మేం సంతోషిస్తాం. ఈ ప్రయత్నంలో అమెరికాకు ఫ్రాన్స్ తప్పకుండా సాయం చేస్తుంది’ అని అమెరికాకు చెందిన సీఎన్ఎన్ మీడియా సంస్థకు ఫ్రాన్స్ అధ్యక్షుడు మెక్రాన్ తెలిపారు.

అణ్వాయుధం ఉండకూడదు : ‘ట్రూత్ సోషల్’ వేదికగా ట్రంప్, ఇరాన్‌ను విడిచి వెళ్లాలని ప్రజలకు పిలుపునిస్తూ, ఆ దేశానికి అణ్వాయుధం ఉండకూడదని స్పష్టం చేశారు. అణు ఒప్పందంపై ఇరాన్ పాలకుల వైఖరిని విమర్శిస్తూ, “అమెరికా ఫస్ట్” లక్ష్యాల్లో ఇరాన్‌ను అణ్వాయుధ రహితంగా చేయడం కూడా ఒక భాగమని ఆయన పేర్కొన్నారు

ఉగ్రవాదాన్ని ఇరాన్ పెంచిపోషిస్తోంది : జీ7 కూటమి ఇజ్రాయెల్‌కు మద్దతు ప్రకటించి, దాని భద్రతకు అండగా నిలుస్తామని తెలిపింది. ఇరాన్ ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని ఆరోపిస్తూ, ఇజ్రాయెల్‌కు ఆత్మరక్షణ హక్కు ఉందన్నారు. ఇరాన్‌కు అణ్వాయుధాలు ఉండకూడదనే తమ వాదనను పునరుద్ఘాటిస్తూ, ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలను తగ్గించాలని పిలుపునిచ్చారు. అంతేకాదు, పశ్చిమాసియాలో అస్థిరత ఇంధన మార్కెట్లపై ప్రభావం చూపకుండా చూసేందుకు తాము సిద్ధమని జీ7 దేశాలు పేర్కన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News