Samnatha Tatoo: మన సౌత్ స్టార్స్ ఈ మధ్య కాలంలో ముంబైలో సెటిల్ కావటానికే చూస్తున్నారు. ఇప్పటికే సమంత, లక్ష్మి మంచు, సూర్య వంటి స్టార్స్ చాలా మంది ముంబైకి మకాం మార్చారు. సమంత విషయానికి వస్తే.. ఆమె ఇప్పుడు హీరోయిన్‌గానే కాదు.. నిర్మాతగానూ తనదైన గుర్తింపును సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ట్రెండింగ్‌లో నిలుస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది. తాజాగా మరోసారి సామ్ వార్తల్లోకి ఎక్కింది. ముంబై బాంద్రాలోని ఓ జిమ్ బయటకి వస్తున్న సమయంలో ఫొటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు ఆమెను చుట్టుముట్టారు. ఎప్పటిలాగే కెమెరాలు, క్లిక్స్, లైట్లు ఆమెపైకి దూకడంతో సమంతకు అసహనం వచ్చింది.
సమంత తన పర్మిషన్ లేకుండా ఫొటోలు, వీడియోలు తీసిన వారిపై సీరియస్ కావటానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సెలబ్రిటీలకూ ప్రైవసీ అవసరమే. కెరీర్ పరంగా ఎంత బిజీగానో, క్రేజ్తోనో ఉన్నా వ్యక్తిగత సమయాన్ని గౌరవించాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ ఉంది. జిమ్ వంటి ప్రైవేట్ ప్రదేశాల్లోనూ ఇలా హద్దులు దాటడం ఎవరికైనా ఇబ్బందికరమే అవుతుంది. ఇప్పుడు సమంతకు కూడా అలాంటి పరిస్థితే ఎదురైంది. అందుకనే ఆమె రియాక్షన్ అలా ఉందని అభిమానులు, నెటిజన్స్ అంటున్నారు. ఇలాంటి సందర్భంలో సమంత స్పందన కూడా చాలామందికి సహజంగానే అనిపించింది.
ALSO READ: https://teluguprabha.net/news/kannappa-movie-controversy-andhra-pradesh-high-court-issued-notices/
అయితే ఈ వీడియోలో మరో అంశం నెటిజన్స్ సహా అందరి దృష్టిని ఆకర్షించింది.. అదేంటంటే ఆమె టాటూ. ఆమె మెడపై ఉన్న ‘ఏమాయ చేసావె’ (YMC) టాటూ. సమంత తొలి సినిమా ‘ఏం మాయ చేశావే’ లో నటించిన సమయంలో వేసుకున్న ఈ టాటూని ఆమె తొలగించిందన్న ఇటీవల వార్తలు వినిపించాయి. నాగచైతన్యతో ప్రేమ, పెళ్లి, విడాకుల తర్వాత ఆమె గతాన్ని మరిచేందుకు ఈ టాటూని తొలగించిందని అందరూ అనుకున్నారు. ఎందుకంటే ఇటీవల కొన్ని ఫోటోలలో ఇది కనిపించలేదు. కానీ తాజా వీడియోలో ఈ టాటూ స్పష్టంగా కనిపించడంతో టాలీవుడ్ వర్గాల్లో చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. టాటూని తొలగించలేదు కాబట్టి, ఆమె ఇప్పటికీ తన తొలి సినిమా ఏ మాయ చేసావె సినిమాతో స్పెషల్ బాండింగ్‌కు గౌరవం ఇస్తుందని అందరూ అనుకుంటున్నారు.
సామ్ కెరీర్లో తొలి చిత్రమైన ఏ మాయ చేసావె.. ఆమెకు ఎంతో ముఖ్యమైంది. కెరీర్‌ను మలుపు తిప్పటమే కాదు.. ఆమె పర్సనల్ లైఫ్‌లోనూ నాగచైతన్యతో ప్రేమలో పడి, అతన్ని వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. తర్వాత జరిగిన పరిస్థితుల కారణంగా ఇద్దరూ విడిపోయారు. చై, సామ్ విడాకులు తీసుకున్నప్పటి నుంచి ఆమె టాటూ వార్తల్లో నిలుస్తూనే ఉంది. ఆమె ఈ టాటూని తొలగించిందని వార్తలు వచ్చినప్పటికీ ఆమె టాటూని కొనసాగిస్తూ, సినిమాను జీవితంలో ఓ ప్రత్యేక ఘట్టంగా గుర్తు పెట్టుకోవాలన్న ఆలోచనతో ఉంచేసుకుని ఉండొచ్చని భావిస్తున్నారు.