Sunday, October 6, 2024
HomeతెలంగాణPatancheru: వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు హ్యాట్రిక్

Patancheru: వచ్చే ఎన్నికల్లో బిఆర్ఎస్ కు హ్యాట్రిక్

రాబోయే ఎన్నికల్లో భారత రాష్ట్ర సమితి హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేయనుందని పటాన్చెరు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అధికారంలోకి వస్తే ప్రజలకు ఏమి చేస్తారో చెప్పకుండా కేవలం కులం, మతం పేరిట ప్రతిపక్షాలు చౌకబారు రాజకీయాలు చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు బిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు అందరూ సిద్దం కావాలని, ఎప్పటికప్పుడు ప్రజలతో మమైకం కావాలని పిలుపునిచ్చారు.

- Advertisement -

జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్లో పటాన్చెరు డివిజన్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించిన ఆయన.. పార్టీ శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

తెలంగాణ రాకముందు వచ్చిన తర్వాత చేపట్టిన అభివృద్ధిని, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టుకుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్  పార్టీ అధ్యక్షులు అఫ్జల్, సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, శ్రేయోభిలాషులు, భారీ సంఖ్యలో స్థానిక కార్యకర్తలు హాజరయ్యారు

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News