Wednesday, June 18, 2025
HomeNewsVijay Deverakonda: సెంటిమెంట్‌తో భయపడుతున్న రౌడీ స్టార్ ఫ్యాన్స్

Vijay Deverakonda: సెంటిమెంట్‌తో భయపడుతున్న రౌడీ స్టార్ ఫ్యాన్స్

Kingdom: సినీ ఇండస్ట్రీలో సెంటిమెంట్‌ను స్టార్స్ ఫాలో అవుతుంటారు. కొంతమందికి హీరోయిన్స్ సెంటిమెంట్… మరికొంతమందికి టైటిల్ సెంటిమెంట్. తెలుగు ఇండస్ట్రీలో ఈ విధంగా కొన్ని సెంటిమెంట్స పుష్కలంగా కనిపిస్తుంటాయి. ఉదాహరణకు సూపర్ స్టార్ మహేశ్ బాబుని తీసుకుంటే, మూడక్షరాల టైటిల్స్ అంటే ఆయనకి ఒక ప్రత్యేక అనుభావం ఉందనే టాక్ ఉంది. మురారి, దూకుడు, పోకిరి లాంటి టైటిల్స్ బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకున్నా, అదే తరహాలో ఖలేజా, అర్జున్, అతడు లాంటి సినిమాలు మాత్రం అంచనాల్ని చేరుకోలేకపోయాయి. కాబట్టి టైటిల్ సెంటిమెంట్ అన్ని సినిమాలకి వర్తిస్తుందా అనేది ప్రశ్నార్థకం.

- Advertisement -

ఇలాంటి టైటిల్ సెంటిమెంట్ చర్చలు తాజాగా విజయ్ దేవరకొండ సినిమాల చుట్టూ ఎక్కువగా వినిపిస్తున్నాయి. నెటిజన్స్ గమనించిన ఓ ఆసక్తికర విషయమేమిటంటే.. విజయ్ నటించిన తెలుగు టైటిల్స్ ఉన్న సినిమాలే బ్లాక్‌బస్టర్ గా నిలిచాయనీ, ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్నవే బాక్సాఫీస్ దగ్గర ఫెయిలయ్యాయనీ. వివరంగా చెప్పాలంటే, పెళ్లిచూపులు, అర్జున్ రెడ్డి, గీత గోవిందం వంటి టోటల్ తెలుగు టైటిల్స్ తో వచ్చిన సినిమాలు ఘనవిజయం సాధించాయి. ఈ చిత్రాలతో విజయ్ ఖాతాలో క్రేజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. అయితే, నోటా, డియర్ కామ్రేడ్, వరల్డ్ ఫేమస్ లవర్, లైగర్, ఫ్యామిలీ స్టార్ వంటి ఇంగ్లీష్ టైటిల్స్ ఉన్న సినిమాలన్నీ తీవ్ర పరాజయాన్ని ఎదుర్కొన్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో వచ్చిన లైగర్‌కి మాత్రం బాక్సాఫీస్ దక్కలేదు. ఈ సినిమాలు విజయ్ మార్కెట్ ని కొంతవరకు డామేజ్ చేశాయన్నదే జనాభిప్రాయం.

ALSO READ: https://teluguprabha.net/news/megastar-chiranjeevi-shocks-keeravani/

ఇప్పుడే ఆయన నటిస్తున్న కింగ్‌డమ్ సినిమా విషయంలో కూడా ఇదే చర్చ మొదలైంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో రూపొందుతున్న ఈ పాన్ ఇండియా మూవీకి ఇంగ్లీష్ టైటిల్ పెట్టడంపై కొంతమంది అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే విడుదలైన “హృదయంలోపల” పాటకు, టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చినా, టైటిల్ విషయంలో మాత్రం అనుమానాలు ఉన్నాయి. కేజీఎఫ్ తరహాలో ఇది మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ విశ్లేషకులు చెబుతున్నారు.

అయితే, ఈ టైటిల్ సెంటిమెంట్ కూడా శాశ్వతం కాదనే పాయింట్ ఒకటుంది. ఉదాహరణకు టాక్సీవాలా – ఇది ఇంగ్లీష్ టైటిల్ అయినా విజయ్ కెరీర్‌లో ఒక మంచి హిట్. అదే ద్వారక లాంటి పూర్తి తెలుగు టైటిల్ ఉన్న సినిమా మాత్రం ఫెయిలయ్యింది. ఈ ఉదాహరణలు చూస్తే, టైటిల్ కన్నా కంటెంట్, ప్రెజెంటేషన్, రిలీజ్ టైమింగ్ వంటి అంశాలే కీలకంగా పనిచేస్తాయనిపిస్తుంది. కాబట్టి, టైటిల్ సెంటిమెంట్ అనేది ఆసక్తికరమైన పరిశీలన మాత్రం కానీ, దాన్ని ఓ మైనస్ లేదా ప్లస్ పాయింట్‌గా పరిగణించడం బేస్ కాకపోవచ్చు. విజయ్ దేవరకొండ – గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్‌పై మంచి అంచనాలున్న తరుణంలో, కింగ్‌డమ్ టైటిల్ అయినా, కథను ఎలా న్యాయపరుస్తుందన్నదే అసలు విషయం.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News