Wednesday, June 18, 2025
HomeNewsKubera Movie: ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..

Kubera Movie: ‘కుబేర’ సెన్సార్ పూర్తి.. రన్ టైం ఎంతంటే..

Sekhar Kammula – Dhanush: మోస్ట్ క్రేజీ మూవీ కుబేర ఈ నెల 20న భారీ స్థాయిలో రిలీజ్ కి రెడీ అవుతోంది. ఈ నేపథ్యంలో జోరుగా ప్రమోషన్స్ నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు దర్శకుడు శేఖర్ కమ్ముల నుంచి రానటువంటి ఓ డిఫరెంట్ ఫిల్మ్ కుబేర రూపంలో వస్తోంది. టాలీవుడ్ కింగ్ నాగార్జున కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ఇందులో ప్రధాన పాత్రల్లో నటించారు. రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ సంగీతం సినిమాకి పెద్ద ఎస్సెట్ గా నిలవబోతోంది.

- Advertisement -

రీసెంట్‌గా కుబేర సినిమా రన్ టైమ్ లాకవబోతుందని వార్తలు వచ్చాయి. కానీ, అది కుదరలేదు. ఇక ఇప్పటికే చాలాసార్లు ఈ సినిమా రన్ టైమ్ గురించి ఎన్నో రూమర్స్ వినిపించాయి. దాదాపు మూడున్నర గంటల నిడివితో కుబేర థియేటర్స్‌లోకి రానుందని ప్రచారం జరిగింది. ఇదే విషయాన్ని చిత్ర నిర్మాతల్లో ఒకరైనా సునీల్ నారంగ్ స్వయంగా వెల్లడించారు. అందరూ అనుకున్నట్టుగా కుబేర రన్ టైమ్ 3 గంటలకి పైన ఉండదని తెలిపారు. 3 గంటలు అంతకన్నా తక్కువ నిడివితోనే సినిమా రిలీజ్ చేస్తామని చెప్పారు. తాజాగా అదే నిజమైంది. కుబేర మూవీ సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. 3 గంటల ఒక్క నిమిషంతో రన్ టైమ్ లాకైంది. కాగా, ఈ సినిమాను శేఖర్ కమ్ముల సొంత నిర్మాణ సంస్థ అమిగోస్ సినిమాస్, శ్రీవెంకటేశ్వర సినిమాస్ ఎల్ ఎల్ పి వారు కలిసి నిర్మించారు.

ALSO READ:https://teluguprabha.net/news/actress-samyuktha-menon-movies/

తెలుగులో నాగార్జున నటించిన సినిమాలు ఈ మధ్య కాలంలో అంత సక్సెస్ సాధించలేదనే చెప్పాలి. ధనుష్ మాత్రం డీసెంట్ హిట్స్ అందుకుంటున్నారు. పుష్ప ఫ్రాంఛైజీతో అలాగే, ఆనిమల్, ఛావా సినిమాలతో పాన్ ఇండియా వైడ్‌గా పాపులారిటీ తెచ్చుకున్నారు. దీంతో పాన్ ఇండియా రేంజ్‌లో రూపొందిన కుబేర సినిమాపై అన్నీ భాషలలో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఆ అంచనాలను దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి ఇటీవల గ్రాండ్ గా జరిగిన ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌లో చేసిన కామెంట్స్ రెట్టింపు చేశాయి. దాదాపు 120 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన కుబేర బాక్సాఫీస్ వద్ద భారీ సక్సెస్ ఖాయమని నిర్మాతలు చాలా ధీమాగా చెప్పారు. చూడాలి మరి ఈ నెల 20 రిలీజ్ కాబోతున్న కుబేరా ఎలాంటి సంచలనాలను క్రియేట్ చేస్తుందో. ఈ సినిమా గనక హిట్ అయితే శేఖర్ కమ్ముల కూడా పాన్ ఇండియా దర్శకుల్లో ఒకరిగా గుర్తింపు తెచ్చుకుంటారు. సినిమా కోసం అందరూ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News