Trivikram: ఒకప్పుడు సినిమా హీరోలు సినిమాల కోసం మేకోవర్ పెద్దగా అయ్యేవారు కాదు. కానీ ఇప్పుడు మారుతున్న ట్రెండ్‌ను బట్టి స్టార్స్ మేకోవర్ అవుతున్నారు. ఓ సినిమాలో రా లుక్‌లో కనిపిస్తే మరోసారి స్టైలిష్‌గా, ఓసారి బరువు పెరిగి లావుగా కనిపిస్తే మరోసారి సన్నబడి కనిపిస్తున్నారు. కథ డిమాండ్ మేరకు మేకోవర్ కావటం అనేది ఆడియెన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తుందనటంలో సందేహం లేదు. ఇప్పుడు ఎన్టీఆర్ సైతం మేకోవర్ బాట పట్టబోతున్నాడని వార్తలు వైరల్ అవుతున్నాయి. వివరాల్లోకెళ్తే..
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ ప్రస్తుతం ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక హై యాక్షన్ ఎంటర్టైనర్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. దీనికి డ్రాగన్ అనే టైటిల్‌ను పరిశీలిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ మూవీ కోసం తారక్ ఇది వరకు ఎన్నడూ లేని విధంగా తన కెరీర్లో స్లిమ్ లుక్‌లోకి మారాడు. బరువు తగ్గి అభిమానులను ఆశ్చర్యపరిచాడు.దీనికి సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరల్ అయిన సంగతి తెలిసిందే. ట్రిపులార్ కోసం బాగా బరువు పెరిగిన ఎన్టీఆర్, తర్వాత దేవర సినిమా కోసం కాస్త బరువు తగ్గిన సంగతి తెలిసిందే. ఇప్పుడు డ్రాగన్ సినిమా కోసం మరోసారి మ్యాన్ ఆఫ్ మాసెస్ తన లుక్‌ను మార్చుకున్నాడు.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/supreme-court-on-kamal-haasan-kannada-issue/
కెజియఫ్, సలార్ వంటి చిత్రాలతో బాక్సాఫీస్ దగ్గర సెన్సేషన్ క్రియేట్ చేసిన ప్రశాంత్ నీల్ ఈ కొత్త లుక్‌లో ఎన్టీఆర్‌ను సరికొత్త స్థాయిలో ప్రజెంట్ చేయబోతున్నారనేది స్పష్టమవుతుంది. ఇంత వరకు బాగానే ఉంటుంది. అయితే తారక్ మేకోవర్ ప్రయాణం ఇక్కడితో ముగియడం లేదని సినీ సర్కిల్స్ అంటున్నాయి. వివరాల్లోకి వెళితే, ప్రశాంత్ నీల్ తర్వాత త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం యంగ్ టైగర్ లుక్‌ను మరోసారి మార్చుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే గురూజీ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయబోతున్న సినిమా హిందూ పురాణాల్లో అంతగా ప్రసిద్ధి చెందని దేవత కుమారస్వామి కథ ఆధారంగా రూపొందనుందని నిర్మాత నాగ వంశీ స్పష్టం చేశారు. ఈ పాత్ర కోసం ఎన్టీఆర్ భారీ, స్థూలమైన శరీరాకృతిని సంతరించుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
త్రివిక్రమ్‌తో తదుపరి చేయబోయే సినిమా కోసం, నీల్ సినిమా కోసం బరువు తగ్గిన ఎన్టీఆర్ మళ్లీ బరువు పెరగాల్సి వస్తుంది. అంతకు ముందు వీరిద్దరి కాంబోలో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ కోసం ఎన్టీఆర్ సిక్స్ ప్యాక్ లుక్‌లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరోసారి మాటల మాంత్రికుడు తారక్ లుక్‌ను మార్చబోతున్నాడు. ఈ జోడి కలిసి ఒక మిథికల్ స్టోరీని తెరకెక్కిస్తుండగా, త్రివిక్రమ్ ఎన్టీఆర్‌ను ఎలా చూపించబోతున్నాడనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.