Mega 157 – Anil Ravipudi: మెగాస్టార్ చిరంజీవి నయనతార జంటగా మెగా 157 అనే వర్కింగ్ టైటిల్ తో ఓ క్రేజీ మూవీ సెట్స్‌పై ఉంది. సక్సెస్ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి ఈ మూవీని కంప్లీట్ కామెడీ జోనర్లో తెరకెక్కిస్తున్నారు. చిరు-అనిల్ కాంబినేషన్లో సినిమాను ప్రకటించగానే అంచనాలు భారీగా పెరిగాయి. ఇప్పటి వరకూ మెగాస్టార్ ని ఎలా చూపించబోతున్నారో..? అనే ఉత్సుకత ప్రతీ ఒక్కరిలో ఉంది. దీనికి కారణం అనిల్ రావిపూడి తన టీం ని పరిచయం చేస్తూ మెగాస్టార్ గత చిత్రాల పోస్టర్స్ ని చూపిస్తూ రౌడీ అల్లుడు సినిమా మ్యూజిక్ తో హైప్ క్రియేట్ చేయడమే. ఇందులో వింటేజ్ చిరంజీవిని చూపించటానికి అనీల్ రావిపూడి ఓ నిర్ణయం తీసుకున్నాడట..
అయితే, తాజాగా అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో మెగాస్టార్ పీఈటీ మాస్టర్‌గా కనిపించనున్నారట. ఇటీవల ముస్సోరీలో మొదలైన సెకండ్ షెడ్యూల్ అప్డేట్ ఇస్తూ మేకర్స్ ఓ పోస్టర్ ని వదిలారు. అందులో చిరంజీవి థంస్ అప్ చూపిస్తుండగా ఆయనకి ఎదురుగా కొందరు స్కూల్ పిల్లలు పరిగెత్తుకుంటూ వస్తూ కనిపించారు.
ALSO READ: https://teluguprabha.net/news/ntr-make-over-for-trivikram-movie/
దాంతో ఈ వార్త నిజమేననిపిస్తోంది. ఇక అనిల్ రావిపూడి మార్క్ కామెడీతో చిరు కామెడీ టైమింగ్ తోడైతే థియేటర్లలో ఉండే రచ్చ అభిమానులు చేసే హంగామాకి హద్దులే ఉండవు. ఇక మెగా 157 లో నయనతార హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. 2026 సంక్రాంతికి రఫ్ఫాడిద్దాం అంటూ ముందు నుంచే అనిల్ అండ్ టీం కన్ఫర్మ్ గా చెప్తున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో చిరంజీవిని సరికొత్తగా చూపించనున్నారు అనిల్.
అనిల్ రావిపూడి సీనియర్ హీరోలైన బాలకృష్ణని కాప్ కమ్ కేర్ టేకర్‌గా, వెంకటేష్‌ని సూపర్ కాప్ కమ్ ఫ్యామిలీ మెన్‌గా చూపించారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవిని డ్రిల్ మాస్టర్‌గా చూపిస్తున్నడంటే కామెడీ ఏ రేంజులో ఉంటుందో ఊహించుకోవచ్చు. గ్యాంగ్ లీడర్ తరహాలో మెగాస్టార్ పర్ఫార్మెన్స్ ఉండబోతుందని ముందుగానే హింట్ ఇచ్చారు. ఇక ఈ సినిమాకి భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ మ్యూజికల్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాకి గాను ఆయన మంచి ప్రశంసలు అందుకున్నారు. అందుకే, అనిల్ చిరు మూవీకి ఛాన్స్ ఇచ్చారు. వీలైనంత త్వరగా షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలు పెట్టాలని అనిల్ రావిపూడి టీం ప్లాన్ చేస్తోంది. చూడాలి మరి మెగా 157 తో బాక్సులు ఎలా బద్ధలవుతాయో.