Rahul Gandhi Birthday: కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ పక్ష నేత రాహుల్ గాంధీ నేడు 55వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఆయన జన్మదినం సందర్భంగా రాజకీయ ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు.
రాహుల్ గాంధీకి ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా బర్త్ డే విషెస్ తెలిపారు. “లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన దీర్ఘాయుష్షుతో, ఆరోగ్యంగా జీవించాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ పోస్ట్ చేశారు.
“లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయనకు మంచి ఆరోగ్యం, దీర్ఘాయుష్షు కలగాలి” అని కేంద్ర రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
“లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు, ఎంపీ శ్రీ రాహుల్ గాంధీ గారికి నా హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. ఈ సందర్భంగా ఆనందంతో పాటు ఆరోగ్యం, శ్రేయస్సు కలగాలని కోరుకుంటున్నాను” అని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
“నా సోదరుడు శ్రీ రాహుల్ గాంధీ గారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు దృఢంగా నిలబడి ధైర్యంగా ముందుకు సాగాలి. ప్రకాశవంతమైన భారతదేశం కోసం పోరాటం చేసే మన ప్రయాణంలో విజయం మనదే” అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ పేర్కొన్నారు.
ఇక రాహుల్ గాంధీ జన్మదినం సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్ చెప్పారు. నా లీడర్, నిజమైన దార్శనికుడు, తెలివైన వాడు, ప్రజల హృదయాల్లో స్థానం దక్కించుకున్న నాయకుడు, భారతదేశం కోసం పోరాడే సైనికుడు, ఈ దేశాన్ని నిజంగా ప్రేమించే వారందరికీ స్ఫూర్తి శ్రీ రాహుల్ గాంధీ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు. దేశ ప్రజల పట్ల చూపే ప్రేమను ప్రపంచం గుర్తించాలని ఆకాంక్షించారు.
“మా నాయకుడు శ్రీ రాహుల్ గాంధీ వారికి హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు. భారత ప్రజల పట్ల మీ నిబద్ధత, లక్ష్యం, స్పష్టత నిజమైన నాయకత్వాన్ని ప్రతిబింబిస్తాయి. విలువలతో కూడిన రాజకీయాలను విశ్వసించే మాకు స్ఫూర్తినిస్తూనే ఉంటాయి” అని కర్ణాటక డిప్యూటీ సీఎం శివకుమార్ వెల్లడించారు.
“మీరు ఐక్యత, కరుణ, ధైర్యమైన మార్గంలో కొనసాగండి.” అని రాజ్యసభ సభ్యులు కమల్ హాసన్ తెలిపారు. వీరితో పాటు ఇతర రాజకీయ ప్రముఖులు కూడా రాహుల్ గాంధీకి శుభాకాంక్షలు పుట్టినరోజు చెబుతున్నారు.