Jr NTR: ప్రతీ ఒక్కరికీ ఇంటిపేరు చాలా అవసరం. ప్రస్తుతం ఉన్న ఈ కంప్యూటర్ కాలంలోనూ ఇంకా కులాలు, మతాలు, వారసత్వాల గురించి మాట్లాడుకుంటున్నామంటే వాటికి అంత విలువ ఉంది కాబట్టే. ఇదే అంశాన్ని దర్శకుడు సుకుమార్ పుష్ప ఫ్రాంఛైజ్‌లో చూపించారు. పుష్ప సినిమాలో, హీరో ఇంటిపేరు కోసం తను ఎదుర్కొన్న అవమానాలపై పోరాడతాడు. తన పేరు ముందు ఇంటి పేరు చేర్చడం, జీరో నుండి హీరోగా ఎదిగే క్రమంలో అయిన వాళ్ళ నుంచే ఎన్నో కష్టాలు ఎదుర్కొంటాడు. ప్రాణాలకి తెగించి తన అన్న కూతురుని కాపడితే గానీ ఆ ఇంటిపేరు తనను వెతుక్కుంటూ రాదు.
నిజ జీవితంలో స్టార్ హీరో ఎన్టీఆర్ పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంటుంది. ఆయనను అభిమానించే వారికి దీని గురించి బాగా తెలుసు. తాజాగా ఇదే అంశం గురించి బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి పలు ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. సీనియర్ ఎన్టీఆర్ కూతురు, ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తారక్ ను చిన్నతనంలోనే నందమూరి ఫ్యామిలీకి దూరం పెట్టారని తెలిపారు. ‘జూనియర్ ఎన్టీఆర్‌ను చిన్నతనంలోనే దూరం పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. వాటి గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చర్చించాల్సిన పనిలేదు. కారణాలు లేకపోలేదు. అందుకే కొంత దూరం పెరిగింది. కానీ, ఇప్పుడు అందరం కలిసే ఉంటున్నాం’ అని పురందేశ్వరి తెలియజేశారు.
ALSO READ: https://teluguprabha.net/news/actress-kajal-aggarwal-to-direct-soon/
ఇక ఇదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రాజకీయ ఎంట్రీ గురించి కూడా పురందేశ్వరి ఇలా మాట్లాడారు.’ రాజకీయాల్లోకి తారక్ రావాలనుకుంటే వస్తారు. అతనిది ఇంకా చిన్న వయసు. మరి ఇంత చిన్న వయసులో అతను పాలిటిక్స్‌లోకి రావాల్సిన అవసరం ఉందా..? అనేది మనం ప్రశ్నించుకోవాలి. రాజకీయాల గురించి తన మనసులో ఏముంది..? అనే సంగతి నాకు తెలియదు. దీని గురించి అంత ప్రత్యేకించి ఎప్పడు మాట్లాడలేదని ఆమె అన్నారు.
గతంలో కూడా పురందేశ్వరి ఎన్టీఆర్ గురించి పలుమార్లు మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. తారక్ మా పిల్లలతో కలిసి ఉంటాడని పురందేశ్వరి చెప్పారు. అంతేకాదు, తన సినిమా విడుదలవుతుందంటే తప్పకుండా విజయం సాధించాలని కోరుకుంటా..అంటూ చెప్పుకొచ్చారు.. ఎన్టీఆర్ అత్తా అనే పిలుస్తాడనితారక్‌తో ఎలాంటి ఇబ్బంది లేదని పురందేశ్వరి క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పాన్ ఇండియా హీరోగా రాణిస్తోన్న సంగతి తెలిసిందే. ఆగస్ట్14న వార్2 రానుండగా, ప్రశాంత్ నీల్ సినిమా వచ్చే ఏడాది రిలీజ్ కానుంది. మరో వైపు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ సినిమా చేయటానికి సిద్ధమవుతున్నారు.