Friday, June 20, 2025
HomeతెలంగాణPhone Tapping Case: కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్.. గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు

Phone Tapping Case: కేసీఆర్ కనుసన్నల్లోనే ఫోన్ ట్యాపింగ్.. గోనె ప్రకాశ్ రావు సంచలన ఆరోపణలు

Phone Tapping Case: తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశం రోజురోజుకు కీలక మలుపులు తిరుగుతోంది. ఇప్పటికే వందలాది మంది కీలక నేతల ఫోన్లు ట్యాప్ అయ్యాయంటూ ప్రచారం జరుగుతోంది. ఈ కేసుకు సంబంధించి పలువురు అధికారులను అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇటీవల ఈ కేసులో విచారణలో తమ ఫోన్ ట్యాప్ అయిన ఆరోపిస్తున్న ప్రముఖ నాయకులు సిట్ అధికారుల ఎదుట హాజరై తమ వాంగ్మూలం అందించారు. మాజీ సీఎం కేసీఆర్, కేటీఆర్ తమ ఫోన్లు ట్యాప్ చేశారంటూ ఆరోపించారు.

- Advertisement -

ఇక పక్క రాష్ట్రమైన ఏపీకి చెందిన కీలక నేతల ఫోన్లు కూడా ట్యాప్ అయినట్లు ఓ జాబితా హల్ చల్ చేస్తోంది. ఏపీసీసీ చీఫ్ షర్మిల అయితే తన ఫోన్ ట్యాప్ అయిందంటూ స్పష్టం చేశారు. ఆమె ఆరోపణలపై జగన్ కూడా తనదైన శైలిలో స్పందించారు. షర్మిల ఫోన్ ట్యాప్ అయితే అయి ఉండొచ్చేమో అని తెలిపారు.

ఈ ఆరోపణలతో ప్రకంపనలు రేపుతోన్న ఫోన్ ట్యాపింగ్ అంశంపై మాజీ ఎమ్మెల్యే గోనె ప్రకాశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. గోనె ప్రకాశ్ రావు ఫోన్ ట్యాపింగ్‌కు అయిందని గుర్తించిన అధికారులు ఆయనను సాక్షిగా వాంగ్మూలం ఇచ్చేందుకు పిలిచారు. దీంతో ఆయన అధికారుల ఎదుట విచారణకు హాజరై తన స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ.. ఫోన్ ట్యాపింగ్ తతంగమంతా బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ కనుసన్నల్లోనే జరిగిందని ఆరోపించారు.

గతంలో ఓటుకు నోటు కేసు కూడా ఫోన్ ట్యాపింగ్ ద్వారానే వెలుగులోకి వచ్చిందని తెలిపారు. అలాగే సొంత పార్టీ నేతలు ఎమ్మెల్సీ కవిత, పైలెట్ రోహిత్ రెడ్డి, రేగా కాంతారావు వంటి నేతల ఫోన్లను కూడా ట్యాప్ చేశారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ఫోన్ ట్యాపింగ్ బీఆర్ఎస్ పాలనలో జరిగిందని గోనె వెల్లడించారు.

ఇదిలా ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణలో కేంద్రమంత్రి బండి సంజయ్ సన్నిహితులు, సిబ్బంది ఫోన్లు సైతం గతంలో ట్యాప్ అయినట్టు అధికారులు గుర్తించారు. ఇందులో భాగంగా కరీంనగర్ బీజేపీ కన్వీనర్ బోయినపల్లి ప్రవీణ్ రావు ఫోన్ ట్యాప్ చేసినట్టు నిర్దారించారు. దీంతో ఆయనను సిట్ విచారణకు రావాలని ఆదేశించారు. ఫోన్ ట్యాపింగ్ అయిన వారిలో రాజకీయ ప్రముఖులతో పాటు సినిమా వాళ్లు కూడా ఉన్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News