Friday, June 20, 2025
Homeచిత్ర ప్రభKaruppu: కత్తి పట్టిన సూర్య… టైటిల్ రివీల్

Karuppu: కత్తి పట్టిన సూర్య… టైటిల్ రివీల్

Suriya: కోలీవుడ్ వెర్సటైల్ స్టార్ సూర్య వైవిధ్యమైన కథలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. ఇప్పుడు మళ్లీ ఓ క్రేజీ ప్రాజెక్ట్‌తో సందడి చేయటానికి సిద్ధమయ్యారు. ‘జై భీమ్’, ‘శూరరై పోట్రు’ వంటి సినిమాల ద్వారా తన నటనను మరో స్థాయికి తీసుకెళ్లిన సూర్య, ఇప్పుడు ఆర్.జె.బాలాజీ దర్శకత్వంలో రూపొందుతున్న కొత్త చిత్రాన్ని పూర్తి చేసే పనిలో ఉన్నాడు. సూర్య 45గా పిలవబడిన ఈ సినిమాకు తాజాగా ‘కరుప్పు’ అనే శక్తివంతమైన టైటిల్‌ను అధికారికంగా ప్రకటించి టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నర్ ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.

- Advertisement -

‘కరుప్పు’ అంటే నలుపు అని అర్థం. తమిళనాడు సంస్కృతిలో వీరభద్ర స్వామి వంటి గ్రామ దేవతను కరుప్పు అని కూడా పిలుస్తుంటారు. సూర్య టైటిల్ లుక్, ఆయన కత్తి పట్టుకున్న తీరు.. పక్కన ఉన్న విగ్రహాలు, త్రిశూలాలు, ఆయుధాలు గుడి వాతావరణాన్ని గమనిస్తుంటే సూర్య విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీ చేస్తున్నారని, చేతిలో కత్తి పట్టుకుని ఉన్న అతని రూపం ఈ చిత్రం ఓ మాస్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతుందనే సంకేతాన్ని ఇస్తోంది.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/will-jr-ntr-yamadonga-august-month-sentiment-continue-for-war-2/

ఈ సినిమాలో ప్రముఖ నటి త్రిష కృష్ణన్ హీరోయిన్‌గా నటిస్తుండగా, సినిమాటోగ్రఫీకి జీకే విష్ణు, మ్యూజిక్‌కు సాయి అభినయ్ బాధ్యతలు చేపట్టారు. ఫైట్స్ అన్బరివ్ డిజైన్ చేస్తున్నారు. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, థీమ్ అన్నింటినీ గమనిస్తే ఈ సినిమా ప్రత్యేకంగా నిలవనుందనే అంచనాలు ఉన్నాయి. ప్రస్తుతం షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ ఏడాది చివర్లో లేదా 2025 ప్రారంభంలో విడుదల చేసే అవకాశముందని తెలుస్తోంది. డైరెక్టర్ ఆర్జే బాలాజీ ఈ చిత్రంలో సమాజానికి అవసరమైన ఓ మెసేజ్‌ను ఉత్సాహభరితంగా ప్రెజెంట్ చేయాలని భావిస్తున్నారు. టైటిల్ పోస్టర్‌తోనే క్రేజ్ పెరిగిన ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలతో ఎదురు చూస్తున్నారు. మరి దీనికి తెలుగులో కొత్త టైటిల్ ఏమైనా పెడతారో లేక.. తమిళ టైటిల్‌తోనే రిలీజ్ చేస్తారో తెలియాలంటే వెయిట్ చేయాల్సిందే.

శూరరై పోట్రు, జై భీమ్ చిత్రాల తర్వాత సూర్యకు సాలిడ్ హిట్ లేదు. రీసెంట్‌గా రిలీజైన రెట్రో కూడా డిజాస్టర్‌గా నిలిచింది. ప్రస్తుతం సూర్య రెండు సినిమాలు సెట్స్ పై ఉన్నాయి. వాటిలో కరుప్పు ఒకటి. మరి దీనితోనైనా ఇటు తెలుగు, అటు తమిళంలో సూర్య హిట్ కొడతాడేమో చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News