Saturday, June 21, 2025
Homeటెక్నాలజీRealme budget phone: బడ్జెట్లో ధరలో 6000mAh బ్యాటరీతో రియల్‌మి ఫోన్

Realme budget phone: బడ్జెట్లో ధరలో 6000mAh బ్యాటరీతో రియల్‌మి ఫోన్

budget phone Realme Narzo 80 : బడ్జెట్ ధరలో రియల్‌మి మరో కొత్త ఫోన్ లాంచ్ చేసింది. కంపెనీ తన కొత్త స్మార్ట్‌ఫోన్ రియల్‌మి నార్జో 80 లైట్ 5జిని దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది. ఈ ఫోన్‌లో 32MP ప్రైమరీ కెమెరా ఉంది. ఈ ఫోన్‌లో శక్తివంతమైన 6000mAh బ్యాటరీ ఉంది. ఫోన్ ధర విషయానికొస్తే, రియల్‌మి నార్జో 80 లైట్ 5జి 4జిబి + 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 10,499 గా నరిర్ణయించింది. 6జిబి + 128జిబి స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 11,499 ఆ ఉంది. మీరు ఈ స్మార్ట్‌ఫోన్‌ను క్రిస్టల్ పర్పుల్ మరియు ఒనిక్స్ బ్లాక్ కలర్‌లలో కొనుగోలు చేయవచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ జూన్ 23 నుండి ఈ-కామర్స్ సైట్ అమెజాన్ ద్వారా దేశంలో అమ్మకానికి అందుబాటులో ఉంటుంది.

- Advertisement -

ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, రియల్‌మి నార్జో 80 Lite 5G 6.67-అంగుళాల HD+ డిస్‌ప్లేను కలిగి ఉంది, ఇది 1604 x 720 పిక్సెల్‌ల రిజల్యూషన్, 50/60/90/120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్, 240Hz టచ్ శాంప్లింగ్ రేట్ మరియు 625 nits వరకు పీక్ బ్రైట్‌నెస్ కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో Arm Mali-G57 MC2 GPUతో ఆక్టా కోర్ MediaTek Dimensity 6300 చిప్‌సెట్ ఉంది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 15 ఆధారంగా ఉంటుంది, అంటే రియల్‌మి యుఐ 6.0పై పనిచేస్తుందన్న మాట. గూగుల్ జెమిని ఇంటిగ్రేషన్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌కు మద్దతు ఇస్తుంది.


ఫోన్ కెమెరా సెటప్ విషయం చూస్తే ఎంతో బాగుంది. ఇది రియల్‌మి నార్జో 80 Lite 5G వెనుక భాగంలో 32MP GC32E2 ప్రైమరీ కెమెరాను అందిస్తోంది. అదే సమయంలో, సెల్ఫీ మరియు వీడియో కాల్స్ కోసం 8MP ఫ్రంట్ కెమెరా అందించబడింది. ఈ ఫోన్‌లో AI క్లియర్ ఫేస్ వంటి ఫీచర్ కూడా ఉంది. ముఖ్యంగా ఎఐ సపోర్ట్ చేయబడిన ఇమేజింగ్ మరియు ఎడిటింగ్ ఫీచర్లు కూడా ఈ ఫోన్ అందుబాటులో ఉన్నాయి. నార్జో 80 Lite 5Gలో 15W వైర్డు మరియు 5W రివర్స్ వైర్డు ఛార్జింగ్ సపోర్ట్‌తో 6,000mAh బ్యాటరీ ఉంది. ఈ ఫోన్ IP64 రేటింగ్ మరియు మిలిటరీ గ్రేడ్ MIL-STD-810H షాక్ రెసిస్టెన్స్ సర్టిఫికేషన్‌తో దుమ్ము మరియు స్ప్లాష్‌ల నుండి రక్షించడానికి వస్తుంది. కనెక్టివిటీ ఎంపికలలో 5G, డ్యూయల్ 4G వోల్ట్, వైఫై, బ్లూటూత్ 5.3, GPS, 3.5mm ఆడియో జాక్, USB టైప్ సి పోర్ట్ ఉన్నాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News