Friday, November 22, 2024
Homeహెల్త్Curd benefits: పెరుగుతో పట్టులాంటి చర్మం

Curd benefits: పెరుగుతో పట్టులాంటి చర్మం

పెరుగులో గుడ్ బాక్టీరియా ఉంటుంది. ఇది జీర్ణక్రియ బాగా జరిగేట్లు చేస్తుందని అందరికీ తెలుసు. అయితే పెరుగును బ్యూటీ రొటీన్ లో కూడా ఉపయోగిస్తే ఎన్నో లాభాలు పొందుతాం. చర్మ సంరక్షణకు పెరుగు ఎంతో మంచిది. ముఖ్యంగా వేసవిలో శిరోజాలకు, చర్మానికి పెరుగు చేసే మేలు ఎంతో. పెరుగులో కాల్షియం, ప్రొటీన్, వివిధ ఎసెన్షియల్ విటమిన్లు ఉన్నాయి. ఇవి చర్మం అందంగా, ఆరోగ్యంగా ఉంచేలా దోహదపడతాయి. పెరుగులోని విటమిన్ డి శరీరానికి అందించే ఆరోగ్య లాభాలు ఎన్నో. పెరుగులోని లాక్టిక్ ఆమ్లం చర్మంపై ఉండే మ్రుతకణాలను పోగొడుతుంది. చర్మం ముడతలు పడకుండా పరిరక్షిస్తుంది. యంగ్ గా కనిపించేలా చేస్తుంది. అంతేకాదు చర్మానికి కావలిసినంత మాయిశ్చరైజర్ ని అందిస్తుంది. ముఖాన్ని మెరిసేలా చేస్తుంది. చర్మంపై దద్దుర్లు రావు. అంతేకాదు యాక్నే వంటి సమస్యలను కూడా నిరోధిస్తుంది. ట్యానింగును పోగొడుతుంది.

- Advertisement -

చర్మాన్ని పట్టులా నున్నగా ఉండేట్టు చేయడమేకాదు కాంతివంతం చేస్తుంది. అందుకే చర్మంలో తేమ తగ్గినట్టు అనిపిస్తే రెండు టేబుల్ స్పూన్ల పెరుగును కప్పులో తీసుకుని అందులో తేనె కొద్దిగా కలిపి ముఖానికి రాసుకోవాలి. పదిహేను నిమిషాల తర్వాత చల్లటి నీళ్లతో ముఖం కడుక్కోవాలి. ఇలా చేస్తే చర్మానికి కావలసిన మాయిశ్చరైజర్ అంది చర్మం నునుపుగా తయారువుతుంది. ఇలా రోజూ చేస్తే చర్మం పట్టులా మెరుస్తుంది. ఇది వేసవి కాలం. సూర్యకాంతిలోని అతినీలలోహిత కిరణాల వల్ల చర్మంపై సన్ బర్న్స్ ఏర్పడతాయి. వీటివల్ల చర్మం దెబ్బతినడమే కాదు కాంతివిహీనంగా కనిపిస్తుంది.

చర్మంపై ట్యానింగ్ ఏర్పడుతుంది. కొన్ని సార్లు తీవ్రమైన సూర్యకిరణాల కారణంగా చర్మంపై ఎర్రటి దద్దుర్లు ఏర్పడతాయి. అలాంటప్పుడు దద్దుర్లపై పెరుగును రాస్తే సాంత్వన లభిస్తుంది. పెరుగులోని యాంటి ఇన్ఫ్లమేటరీ గుణాలవల్ల, జింకు కారణంగా దద్దుర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది. చర్మంపై వచ్చే యాక్నేను కూడా పెరుగు పోగొడుతుంది.

యాక్నే ఉన్న ప్రదేశంలో పెరుగును రాయాలి. పెరుగులోని యాంటి ఇన్ఫ్లమేటరీ, యాంటీ బాక్టీరియల్ గుణాల వల్ల యాక్నే తీవ్రత తగ్గుతుంది.కళ్ల కింద నల్లటి వలయాలు ఏర్పడితే కూడా తాజా పెరుగును ఆ ప్రాంతంలో రాసి పది నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో కళ్లను కడుక్కోవాలి. ఇలా నిత్యం చేస్తే మంచి ఫలితం చూస్తారు. పెరుగు, గుడ్డు కలిపి వెంట్రుకలకు రాసుకుంటే వెంట్రుకలు ఆరోగ్యంగా, నిగనిగలాడుతాయి. ఇది వెంట్రుకలకు నేచురల్ కండిషనర్ గా పనిచేస్తుంది. రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో ఒక గుడ్డు పగలగొట్టి వేసి బాగా కలపాలి. ఆ మిశ్రమాన్ని శిరోజాలకు పట్టించి పదినిమిషాలు అలాగే ఉంచాలి. ఆ తర్వాత చల్లటి నీళ్లతో శుభ్రంగా కడిగేసుకోవాలి. వేసవికాలంలో చర్మ రక్షణకు పెరుగు మంచి బ్యూటీ ట్రీట్మెంట్ అనడంలో సందేహం లేదంటున్నారు సౌందర్య నిపుణులు కూడా.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News