Saturday, June 21, 2025
Homeచిత్ర ప్రభKubera Review: కుబేర రివ్యూ

Kubera Review: కుబేర రివ్యూ

చిత్రం – కుబేర
నటీనటులు – నాగార్జున అక్కినేని, ధనుష్, రష్మిక, జిమ్ సర్బ్, దిలీప్ తాహిల్, షాయాజీ షిండే తదితరులు
దర్శకత్వం – శేఖర్ కమ్ముల
నిర్మాతలు– సునీల్ నారంగ్, రామ్మోహన్ పుస్కూరు
సంగీతం – దేవిశ్రీ ప్రసాద్
కెమెరా – నికేత్ బొమ్మి
ఎడిటర్ – కార్తీక శ్రీనివాస్

- Advertisement -

Sekhar Kammula: ఆనంద్, గోదావరి, హ్యపీడేస్, లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ ఫిదా, లవ్ స్టోరీ వంటి చిత్రాలతో పాటు లీడర్, అనామిక వంటి సినిమాలను తెరకెక్కించి దర్శకుడిగా తనదైన ముద్ర వేశారు శేఖర్ కమ్ముల. ఆయన తన స్టైల్ ఆఫ్ మేకింగ్‌కు దూరంగా తెరకెక్కించిన సినిమా కుబేర. గత చిత్రాలకు భిన్నమైన చిత్రంగా వచ్చిన కుబేర మూవీలో నాగార్జున, ధనుష్, రష్మిక మందన్న వంటి స్టార్స్ నటించటంతో సినిమాపై హైప్ ఓరేంజ్‌లో క్రియేట్ అయ్యింది. మరి ఇంత హైప్ క్రియేట్ చేసుకున్న ఈ మూవీ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో తెలుసుకోవాలంటే మాత్రం సినిమాకథంటే తెలుసుకోవాలి…

కథ:

Dhanush – Nagarjuna: దేశం ఆయిల్ కొరతతో బాధపడుతుంటుంది. అదే సమయంలో చేసిన కొన్ని పరిశోధనల ఫలితంగా ఓ భారీ ఆయిల్ నిల్వలను కనుగొంటారు. , ఇది దేశ అవసరాలకు 15 ఏళ్లకు పైగా సరిపడేంత గొప్ప ఆవిష్కరణ అని అందరూ భావిస్తారు. అయితే ఈ కీలకమైన సమాచారం ప్రభుత్వానికి తెలియకముందే, నీరజ్ మిత్రా (జిమ్ సర్బ్) అనే శక్తిమంతమైన పారిశ్రామికవేత్తకు తెలుస్తుంది. ఆ విలువను అంచనా వేసిన నీరజ్, నేరుగా పెట్రోలియం మినిస్టర్‌ను సంప్రదించి లక్ష కోట్ల రూపాయల భారీ డీల్‌ కుదుర్చుకుంటాడు. దేశ సముద్ర సరిహద్దుల్లో ఉన్న ఆయిల్ రిగ్‌ను ప్రైవేట్ కంట్రోల్‌లోకి తీసుకొచ్చేందుకు అన్నింటినీ ప్రణాళికాబద్ధంగా అమలు చేస్తాడు. తన డీల్ వెలుగులోకి రాకముందే, అక్కడ పనిచేస్తున్న కార్మికులు, అధికారులు ఈ సమాచారం బయటపడుతుందనే అనుమానంతో, నీరజ్ వారిని ఆపదగా భావించి యాక్సిడెంట్‌ను క్రియేట్ చేసి వారిని చంపేయిస్తాడు కూడా.

అయితే చదువు రాని దేవాకు ఈ డేంజరస్ డీల్ గురించి ఎలా తెలిసింది? అతని జీవితంలో దాగి ఉన్న రహస్యాలు ఏవిటి? నిజాలు బయటపడిన తర్వాత దేవాను వీళ్లు వదిలేశారా? లేక మరింత ప్రమాదంలోకి నెట్టేశారా? ఇంతకీ దేవా గతంలో ఏం జరిగింది..? అతనికి సమీర (రష్మిక మందన) ఎందుకు తోడుగా నిలుస్తుంది? ఆమెను నడిపించే కారణం ఏంటి? నిజాయతీకి నిలువెత్తు రూపంగా కనిపించే దీపక్, చివరకు ఎందుకు తప్పుదోవ పట్టాడు? అతనికే ఏం జరిగింది? ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే… కథలో ప్రతి మలుపు.. ప్రతి ట్విస్ట్‌ను తెరపై చూడాల్సిందే.

సమీక్ష:

డబ్బుండే వాడికి డబ్బుపై కోరిక ఎక్కువ. లేనివాడికి ఆకలి తీరితే చాలు. వీళ్ల మధ్య జరిగే సంఘర్షణ ఆధారంగా రూపొందిన సినిమాయే ‘కుబేర’. నిజానికి ఇదొక సంక్లిష్టమైన పాయింట్. వైట్ కాలర్ నేరగాళ్లు వ్యవస్థలను ఎలా మేనేజ్ చేస్తారనేది ఇందులో చక్కగా చూపించారు. దీన్ని సినిమాగా.. కామన్ ఆడియెన్స్‌కు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించాలంటే చాలా కష్టమైన పని. కానీ డైైరెక్టర్ శేఖర్ కమ్ముల ప్రారంభం నుంచి చెప్పాలనుకున్న విషయాన్ని చక్కగా ప్రెజంట్ చేశారు. ధనుష్ వంటి స్టార్ దేవా అనే బిచ్చగాడి పాత్రలో నటించేలా శేఖర్ ఒప్పించటమే కాదు.. ఆ సన్నివేశాలను మనసుకు హత్తుకునేలా తెరకెక్కించారు. కుట్రలో భాగమైన తర్వాత పడే ఇబ్బందులు ఉత్కంఠతంగా ఉన్నాయి.

నాగార్జున పాత్రను సీబీఐ ఆఫీసర్‌గా ఆవిష్కరించిన తీరు బావుంది. దీపక్ పాత్ర అవినీతిలో భాగం కావటం, సిస్టమ్‌కు వ్యతిరేకంగా పని చేయాలనుకోవటం వంటి సన్నివేశాలను ఇంట్రెస్టింగ్‌గా మలిచారు. బ్లాక్ మనీ, బినామీ వ్యవస్థలను ఆవిష్కరిస్తూనే .. దేవా అనే బిచ్చగాడి జీవితాన్ని.. చిన్నారులు బెగ్గింగ్ మాఫియాలో ఎదుర్కొంటున్న సమస్యలను చూపించిన తీరు ఆకట్టుకుంది. సమీర పాత్రలో రష్మిక నటించిన తీరు బావుంది. దేవా జీవితంలో ఆమె ఎంట్రీ తర్వాత అతని ప్రాణాలకు ముప్పు ఏర్పడుతుంది. సెకండాఫ్‌లో దీపక్, నీరజ్ కలిసి దేవాను వెతికి పట్టుకునే సన్నివేశాలు, నీరజ్‌కు దీపక్ ఎదురు తిరగినప్పుడు వచ్చే సన్నివేశాలు అలరిస్తాయి.

ధనుష్, నాగార్జున, రష్మిక పాత్రల్లో ఒదిగిపోయారు. డబుల్ షేడ్ పాత్రలో నాగార్జున, రష్మిక మెప్పించారు. విలన్‌గా నటించిన జిమ్ సర్బ్ ..స్టైలిష్‌గా కనిపిస్తూనే భయపెట్టాడు. సాంకేతిక విషయాలకువస్తే.. డైరెక్టర్ శేఖర్ కమ్ముల తను చెప్పాలనుకన్న విషయాన్ని దారి మల్లకుండా హృద్యంగా చెప్పిన తీరు బావుంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, బ్యాగ్రౌండ్ స్కోర్ బావున్నాయి.

చివరగా.. ‘కుబేర’.. రెండు భిన్న ధృవాల సంఘర్షణ

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News