Saturday, June 21, 2025
Homeఇంటర్నేషనల్KHAMENI KAHAANI : సినిమాని మించిన ఖమేని జీవిత కథ

KHAMENI KAHAANI : సినిమాని మించిన ఖమేని జీవిత కథ

IRAN SUPREME LEADER ALI KHAMENI : ఒడిదుడుకుల్లో ఒంటరిగా నిలిచిన చీకటి శక్తి అతను. మతాన్ని ఆయుధంగా మార్చి, రాజకీయాన్ని శాస్త్రంగా మలిచిన వ్యక్తి అతను. అణుశక్తిలా శత్రువుల గుండెల్లో రగిలే గుబులు విస్ఫోటనమతను. యుద్ధ విమానాల చప్పుళ్ల మధ్య మౌనంగా దూసుకొస్తున్న చీకటి నిశ్శబ్దం అతను. ఎనిమిది పదుల వయసులో అలుపెరుగనిపోరాటం చేస్తున్న సాహస వీరుడతను. నాడు, పాశ్చాత్య దేశాల చరిత్రలో చెరగని ముద్ర వేసి.. నేడు, ఇజ్రాయెల్ – ఇరాన్ యుద్ధంలో కళ్లకీ దొరక్కుండా, శబ్దానికీ చిక్కకుండా ఇజ్రాయెల్‌ నిఘా నేత్రాలను దాటి పర్వత లోయల్లో దాక్కున్న ఓ పాలకుడి కథ. పర్వత లోయల్లోని బంకర్ గర్భంలో దాగి యుద్ధ పాచికలు వేస్తున్న ఓ వృద్ధ వీరుడి కథ… ఆ వృద్ధుడి పేరే “అలీ ఖమేనీ” ( AALI KHAMENI ) ఇరాన్ దేశపు కర్త, కర్మ, క్రియ. ఇది అస్తమించని చోట దాగి ఉదయస్తున్న ఖమేని కథ. తప్పక చదవండి, ఎందుకంటే ఇది చరిత్ర, ఇంకా ముగియని విప్లవ వీరుడి గాథ…

రాజుల పాలన నుంచి మత పాలన దాకా : ఒకప్పుడు ఇరాన్ అంటే…చాలా ఆధునిక దేశం. అక్కడ రాజులు పాలిస్తుండే వారు. వస్త్రధారణలోనూ, జీవనశైలిలోనూ, అభిప్రాయ స్వేచ్ఛలోనూ ముస్లిం మహిళలు కూడా హిజాబ్ తప్పనిసరి కాదు అన్నంత సహనం ఉన్న దేశం అది. అప్పటి ఇరాన్‌కు అమెరికా, ఇజ్రాయెల్‌ లాంటి దేశాలు స్నేహితులే. అన్నింటినీ కలుపుకుని ఒక పాశ్చాత్య సంస్కృతి స్ఫూర్తిగా ఉన్న ముస్లిం దేశం.
కానీ…
1978-79లో ఒక్క విప్లవం వచ్చిందంటే చాలు దేశం మొత్తం తలకిందులైంది. అదే… ఇస్లామిక్ విప్లవం. ఈ విప్లవంతో రాజుల పాలన గల్లంతయ్యింది. దాని స్థానంలో మతపరమైన పాలన ప్రారంభమైంది. అంతే కాదు… అమెరికా, ఇజ్రాయెల్ లాంటి పాశ్చాత్య దేశాలూ శత్రువులుగా మారిపోయాయి.

- Advertisement -

ఈ విప్లవానికి నాయకుడు ఎవరు అంటే..? ఆయతుల్లా రూహుల్లా ఖమేనీ అనే షియా మత పెద్ద. ఇరాన్‌లోని “ఖోమైన్” అనే ఊరిలో జన్మించడంతో ఆయన ఇంటి పేరు ఖమేనీ అయ్యింది. అలాగే… ఆయనకో శిష్యుడు ఉండేవాడు అదే అలీ ఖమేనీ. ఈయన కూడా తర్వాత ఇరాన్ సుప్రీం లీడర్ అయ్యాడు.

ఖమేనీ అధికారం ఎక్కిన కథ : ఇరాన్ చరిత్రలో ఒక గొప్ప మలుపు 1979లో ఇస్లామిక్ విప్లవం విజయం సాధించింది. రాజుల పాలనకు తిరుగులేని చెక్ వేసిన ఈ విప్లవాన్ని నడిపించినవాడు ఆయతుల్లా రూహుల్లా ఖమేనీ అనే మతగురువు ఆ విప్లవంతో మొదటిసారిగా ఇరాన్‌కి “సుప్రీం లీడర్” అనే పదవి వచ్చింది. అదే పదవి రూహుల్లా ఖమేనీ చేపట్టారు. ఆయన ఇరాన్‌కి తలపాగా తీర్పుల తీర్పుగాడు అయిపోయారు.

కానీ, 1989లో ఆయన కన్నుమూయడంతో…ఆ స్థానం కోసం ఎవరూ పోటీ పడలేదు, ఎందుకంటే అది ఇప్పటికే ఒకరిదే అయిపోయింది. అతనెవరో కాదు రూహుల్లా శిష్యుడు అలీ ఖమేనీ.. అప్పటిదాకా అంటే 1981 నుంచి 1989 వరకూ ఆయన ఇరాన్ అధ్యక్షుడిగానే సేవలందించారు. కానీ గురువు మరణంతో.. ఆయనే సుప్రీం లీడర్ అయ్యారు. అలా.. ఒక శిష్యుడు అధ్యక్షుడయ్యాడు, ఆ అధ్యక్షుడు అధిపతయ్యాడు. అలా ఇరాన్ మతపరమైన పాలనకు శాశ్వత చిహ్నంగా అలీ ఖమేనీ మారిపోయాడు.

బంకర్‌లో దాక్కున్న అధికారి – ఖమేనీని చుట్టుముట్టిన చీకటి సవాళ్లు : సుదీర్ఘ మూడున్నర దశాబ్దాల పాలన…ఎన్నో యుద్ధాలు, ఆందోళనలు, అంతర్గత వ్యతిరేకతల్ని ఎదుర్కొన్నా అలీ ఖమేనీ మాత్రం ఎప్పుడూ కదిలాడని పర్వతంలా కనిపించేవాడు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా భిన్నం. ఇప్పుడు ఆయన కదిలిపోవాల్సిన పరిస్థితిలో ఉన్నాడు. అదికూడా బయట కాదు… భూమిలో పర్వతాల్లో బంకర్ లో.. ఇప్పుడు ఖమేనీ ఎదుర్కొంటున్నది ఆయన జీవితంలోనే అతిపెద్ద సవాల్ గా మారింది. ఇజ్రాయెల్…ఇప్పటికే ఖమేనీకి అత్యంత నమ్మకంగా ఉండే అణు శాస్త్రవేత్తలను, సైనిక ఉన్నతాధికారులను హతమార్చింది.

ఇరాన్ మద్దతుతో పనిచేసే హమాస్ (పాలస్తీనా), హిజ్బుల్లా (లెబనాన్), హౌతీలు (యెమన్) అన్నీ ఒక్కొక్కటిగా చితికిపోయాయి. ఒక్కొక్క నేత పడిపోతుంటే ఆయా సంస్థల ప్రాధాన్యం మాయమవుతోంది. తోడుగా ఉండే మిత్రదేశాలైన రష్యా, చైనా కూడా ఇప్పుడు వెనక్కి వెళ్లిపోయాయి. వాళ్ల సాయం లేకుండా ఖమేనీకి నమ్ముకోవాల్సిందల్లా తన భద్రత కోసం పర్వతాల్లో తవ్వించిన రహస్య బంకర్లే… ఇంతగా శత్రువు యుద్ధ విమానాలు ఇరాన్ గగనతలంలో స్వేచ్ఛగా తిరుగుతుంటే, ఇంతవరకూ ఎవరికీ వణుకు లేకుండా నిలిచిన ఖమేనీకి ఇప్పుడు మాత్రం అసలు దొరకకూడదన్న భయం మొదలైందని విశ్లేషకుల అభిప్రాయం. ఇది కేవలం శత్రువుల ముప్పు కాదు,ఇది ఒక నాయకుడి దశాబ్దాల అధికారానికి వచ్చిన భారీ పరీక్ష. ఇప్పుడు ప్రశ్న ఒకటే,ఖమేనీ బయట పడతాడా? లేక చరిత్రలో చీకటి పుటగా మిగిలిపోతాడా? ఇది యుద్ధం మాత్రమే కాదు, ఒక పాలకుని ‘ప్రాణం’ కోసం సాగుతున్న పరుగు కూడా..

అధికారం గెలుచుకున్నాడు… మతాన్ని కవచంలా మార్చుకున్నాడు : 1989లో అలీ ఖమేనీకి సుప్రీం లీడర్ పగ్గాలు వచ్చాయి. కానీ అప్పటికి ఆయన మతపరమైన ప్రాచుర్యం పెద్దగా లేదు.ఇరాన్‌ ప్రజల మధ్య అతను పెద్దగా పేరు తెచ్చుకున్నవాడు కాదు. అయినా, అతనికి ఎదురుగా నిలిచేవాళ్ల కంటే ఒక బలమైన బ్యాకప్ మాత్రం ఉండింది. అదే అతివాద షియా మత పెద్దల మద్దతు. అందుకే… అలీ ఖమేనీ అధికారం ఎక్కడ చీలిపోతుందోనని భయపడలేదు.
రాజకీయాన్ని మతపు నీడలోకి లాగడం : ప్రజలు కోరిన సంస్కరణలు తీర్పులే వచ్చాయి. “ప్రజాప్రతినిధుల అధికారాన్ని పెంచాలి” అని డిమాండ్లు వెల్లువెత్తాయి. కానీ షియా మత పెద్దలు ఇంతా వ్యతిరేకించారు. “ఇది మతపరమైన పాలనకు ప్రమాదం” అని అక్కడే ఖమేనీ నిర్ణయం తీసుకున్నాడు.

సంస్కరణవాదులను అణచాలి : అలాగే చేశాడు కూడా. ఈ పనికి ఉపయోగించిన ఆయుధం రెవల్యూషనరీ గార్డ్ అనే ప్రత్యేక సైనిక విభాగం.ఇది పారామిలిటరీగా ఏర్పడినా, నిజంగా అది ఖమేనీకి నేరుగా జవాబుదారీగా ఉండే శక్తివంతమైన దళం. సైన్యంలో ఇది మొదటిపాలే…ఇదే బలంతో శాంతిపరులైన రాజకీయం, మార్పులను కోరే గొంతులు ఒక్కొక్కటిగా మౌనం చేశారు. ఇంతటితో ఆగలేదు, ఇరాన్‌ మత పెద్దల సహకారంతో “గార్డియన్ కౌన్సిల్”అనే వ్యవస్థ కూడా ఏర్పాటైంది.

ఈ కౌన్సిల్‌ చేస్తుందేమిటంటే..?
ఎవరైనా , అసెంబ్లీ, స్థానికంగా పోటీ చేయాలంటే ఈ కౌన్సిల్‌ “అభిమతం” ఉండాలి. అంటే, మత పెద్దల అనుమతి లేకుండా ప్రజాప్రతినిధులు అవ్వడం దాదాపుగా అసాధ్యం. ఇలా… ఖమేనీ దేశాన్ని మతంతో గట్టిగా తాళం వేశాడు. పాలనలో ఉన్న ప్రతి శక్తిని మతపరమైన ముద్రతో ముడిపెట్టి “ఆధునిక రిపబ్లిక్”ని, “ఇస్లామిక్ స్టేట్”గా మార్చేశాడు.

ఖమేనీ నిర్మించిన మౌన యంత్రం ఇప్పుడు ఊపిరాడకుండాపోతుందా..? : అధికారంలోకి వచ్చిన వెంటనే అలీ ఖమేనీ ముందు ఒకే లక్ష్యం. ఎవరూ ప్రశ్నించలేని పాలకుడిగా మారాలి. ఇది సాధించాలంటే? కేవలం పదవి సరిపోదు, శక్తి ఉండాలి. భయపెట్టే శక్తి, నియంత్రించే శక్తి అని భావించాడు. అందుకే ఖమేనీ దృష్టి అంతా ఒక ప్రత్యేక దళం మీదే పెట్టాడు. అదే “ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్” (IRGC) ఈ గార్డ్‌నే ఆయన తన ఆరోప్రాణంగా మలిచాడు.

ఇది పేరు పెట్టేందుకు పారామిలిటరీ దళం లాంటిది అయినా…దీనికి ఉన్న శక్తి, స్వేచ్ఛ, భయపెట్టే స్థాయికి మించి ఉంటుంది.
ఇవే దేశంలో సంస్కరణలను అణిచేశాయి, ఇవే మత విపక్షాలను పీక్కొట్టాయి, ఇవే ప్రజల్లో ‘ఒకే ఒట్టు – ఖమేనీ’ అనే భయాన్ని నింపాయి. ఇది దేశంలో మాత్రమే కాదు… విదేశాల్లోనూ పనిచేసే యంత్రం. ఈ రెవల్యూషనరీ గార్డ్ అంతర్జాతీయ విభాగమే ‘ఖుద్స్ ఫోర్స్’ ఇదే పశ్చిమాసియా వ్యాప్తంగా మిలిటెంట్ సంస్థల్ని పెంచింది. హమాస్ (పాలస్తీనా), హిజ్బుల్లా (లెబనాన్), హౌతీలు (యెమన్), షియా మిలీషియాలు (ఇరాక్, సిరియా) ఈన్నింటికీ ఆయుధాలూ, నిధులూ, వ్యూహాలూ అందించింది ఈ ఖుద్స్ ఫోర్సే.

ఇంతకే పరిమితం కాదు ఇరాన్‌లో వ్యాపారాలు నిర్వహించే హక్కూ ఈ గార్డుకే ఇచ్చాడు ఖమేనీ. ఆర్ధిక వ్యవస్థలోనూ ఇవే పట్టేసుకున్నాయి.కాబట్టి… ఈ గార్డు లేకుండా ఖమేనీ పాలన అనడం వృథా అవుతుంది.

ఇరాక్‌ నుంచే మొదలైంది విస్తరణ : ఖమేనీ పాలన ప్రారంభమైన తర్వాత ఇరాక్‌తో శత్రుత్వం కొనసాగిస్తూ…అక్కడ షియా మిలీషియాలను ఏర్పాటుచేశాడు.2003లో సద్దాం హుస్సేన్ కూలగొట్టిన తర్వాత, ఇరాక్‌లో ఈ మిలీషియాలు దాదాపుగా అదుపులోకి వచ్చాయి. అక్కడి నుంచి ఆయుధం, వ్యూహం సప్లైను పాలస్తీనా, లెబనాన్, సిరియా, యెమన్ వరకు విస్తరించారు. 2015 నాటికి ఈ మిలిటెంట్‌ సంస్థలు పూర్తిగా ఖమేనీ వలయంలోకి వచ్చాయి.

కానీ అంతా ఇలా సాగదు కదా… 2009లో ఓటింగ్ రిగ్గింగ్ ఆరోపణలతో ప్రజలు తిరుగుబాటు చేశారు. 2017, 2019లోనూ ప్రజలు మతం పేరుతో పెడుతున్న ఒత్తిళ్లుపై ఆగ్రహంతో రోడ్లెక్కారు.కానీ 2022లో జరిగిన ఘటన మాత్రం ఖమేనీ పాలనలో పెద్ద గాయమే, మహ్సా అమీనీ అనే యువతి హిజాబ్ తప్పుగా ధరించిందన్న కారణంగా పోలీసుల చేతిలో చనిపోవడం జరిగింది. ఇది ఇరాన్‌వ్యాప్తంగా పెద్ద ఉద్యమానికి రూపం దిద్దింది. వందల మంది చనిపోయారు. దేశం తలకిందులైంది. ఖమేనీ తల వంచకపోయినా… కొద్దిపాటి సడలింపులు మాత్రం ఇచ్చాడు.

ఈ ‘విష వలయం’ నుంచి బయటపడేదెలా..?
2023లో హమాస్ ఇజ్రాయెల్‌పై దాడి చేసింది. దానితో ఇజ్రాయెల్ పూర్తిగా యుద్ధం మోస్తోంది. హమాస్ దాదాపుగా చితికిపోయింది. హిజ్బుల్లా నేతలు హతమయ్యారు. ఆయుధ డిపోలు కూలిపోయాయి. సిరియా మారిపోయింది. ఆయుధ సప్లై నిలిచిపోయింది. యెమన్, ఇరాక్‌లోనూ పరిస్థితి గతానికన్నా బలహీనంగా మారింది. ఇంతలో రష్యా, చైనా వంటి మిత్ర దేశాలు కూడా ఇరాన్‌కు ఓపెన్‌గా సపోర్ట్ చేయడం మానేశాయి. ఇప్పుడు ఖమేనీకి భద్రత కోసం బంకర్‌ లో తల దాచుకునే పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఖమేని ఈ ‘విష వలయం’ నుంచి బయటపడతాడా..? లేక శత్రువులకి చిక్కి పోతాడా అనేది కాలమే సమాధానం చెప్పాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News