Sunday, June 22, 2025
HomeతెలంగాణBalmuri Venkat: కేటీఆర్, హరీశ్ రావుకు సిగ్గుండాలి: బల్మూరి వెంకట్

Balmuri Venkat: కేటీఆర్, హరీశ్ రావుకు సిగ్గుండాలి: బల్మూరి వెంకట్


Balmuri Venkat: పైసల దందాలో అరెస్ట్ అయిన హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డికి సపోర్ట్ చేస్తున్నందుకు మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావుకు సిగ్గుండాలని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ మండిపడ్డారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై గాంధీ భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై కౌశిక్ రెడ్డి ఏమైనా ఉద్యమం చేశారా? అని ప్రశ్నించారు. క్రషర్ వాళ్లను పైసల కోసం వాళ్లని బ్లాక్ మెయిల్ చేస్తే అరెస్ట్ చేశారని తెలిపారు. అనంతరం క్వారీ కంపెనీ వాళ్లు కేసు పెట్టగానే గుండెడు గ్రామ ప్రజలకు పది లక్షల రూపాయల చెక్ గుడి కోసం ఇచ్చారన్నారు.

బ్లాక్ మెయిల్ దందాలు చేసే దొంగకు కేటీఆర్, హరీశ్ సపోర్ట్ చేయకండని సూచించారు. కౌశిక్ రెడ్డి ది బ్లాక్ మెయిల్ చరిత్ర అని ఆరోపించారు. ఉద్యోగాలు ఇప్పిస్తానని మోసం చేసి పైసలు తీసుకున్నారంటూ ఆరోపణలు చేశారు. ఇలాంటి బ్లాక్ మెయిలర్ తమ ఎమ్మెల్యే కావడంపై హుజూరాబాద్ నియోజకవర్గ ప్రజలు బాధపడుతున్నారని పేర్కొన్నారు. కౌశిక్ రెడ్డి ప్రజలను మోసం చేసిన ఘటనలు కోకొల్లలు ఉన్నాయని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎలా అయితే దొంగలను విదేశాలకు పంపించారో.. కౌశిక్ రెడ్డిని కూడా దేశం దాటించాలని చూశారని తెలిపారు. వెంటనే పోలీసులు అప్రమత్తమై అరెస్ట్ చేశారని వెల్లడించారు.

కేసీఆర్ ను త్వరలోనే కేటీఆర్, హరీశ్ రావు జైలుకు పంపడం ఖాయమని జోస్యం చెప్పారు. బనకచర్ల ప్రాజెక్టు విషయంలో వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ తో లోపాయికారి ఒప్పందం చేసుకుంది నిజం కాదా అని ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్ కు దమ్ముంటే బనకచర్ల విషయంలో ప్రమాణం చేయాలని ఛాలెంజ్ విసిరారు. వాసాలమర్రిలో ఆగమ్మకు ఇల్లు ఇస్తామని చెప్పి ఇళ్లు కట్టలేదని గుర్తు చేశారు. ఆగమ్మకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం అన్నారు. కేసీఆర్ కేవలం మాటల మనిషి అని కవిత తెలుసుకోవాలన్నారు.

కాగా 50 లక్షల రూపాయలు ఇవ్వాలని కౌశిక్ రెడ్డి బెదిరించారని వరంగల్ జిల్లాకు చెందిన క్వారీ యజమాని మనోజ్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈఫిర్యాదు మేరకు ఆయనను శంషాబాద్ విమానాశ్రయంలో ఇవాళ తెల్లవారుజామున అరెస్ట్ చేశారు. కౌశిక్ రెడ్డి అరెస్టుపై కేటీఆర్, హరీశ్ రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News