Sunday, June 22, 2025
Homeటెక్నాలజీItel Zeno 5G: 50ఎంపీ కెమెరా, 5,000ఎంఏహెచ్​ బ్యాటరీతో కొత్త మొబైల్.. ధర కూడా...

Itel Zeno 5G: 50ఎంపీ కెమెరా, 5,000ఎంఏహెచ్​ బ్యాటరీతో కొత్త మొబైల్.. ధర కూడా కేవలం రూ. 9299



Itel-zeno-5G: కొత్త స్మార్ట్ ఫోన్ కొనాలని చూస్తున్నారా..? చైనాకు చెందిన ఐటెల్ మార్కెట్లో కొత్త బడ్జెట్​ ఫ్రెండ్లీ స్మార్ట్​ఫోన్​ని లాంచ్​ చేసింది​. అదే ఐటెల్​ జెనో 5G స్మార్ట్ ఫోన్. తక్కువ ధరకే ఎక్కువ ఫీచర్ల ఉన్న ఫోన్ కొనుగోలు చేయాలనుకుంటే ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ఈ ఫోన్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 ప్రాసెసర్‌తో నడుస్తుంది. దాదాపు 5,000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తున్న ఈ స్మార్ట్ ఫోన్ కేవలం రూ. 10 వేల బడ్జెట్ లో ఉండడం విశేషం. ఇప్పుడు ఐటెల్​ జెనో 5G స్మార్ట్ ఫోన్ కు సంబంధించి ఫీచర్లు, ధర, సేల్ వివరాలు తెలుసుకుందాం.

- Advertisement -



ధర, సేల్ వివరాలు

కంపెనీ ఐటెల్ జెనో 5G భారతదేశంలో రూ. 9,299 ధరకు లాంచ్ చేసింది. డిస్కౌంట్ కావాలంటే రూ. 1,000 అమెజాన్ కూపన్‌ను ఉపయోగించి ఈ స్మార్ట్ ఫోన్ ను అతి తక్కువ ధరకు కొనొచ్చు. కాగా, ఐటెల్ జెనో 5G కాల్క్స్ టైటానియం, షాడో బ్లాక్, వేవ్ గ్రీన్ అనే మూడు రంగులలో లభిస్తోంది.



ఫీచర్లు

ఈ స్మార్ట్ ఫోన్ 6.67-ఇంచ్​ హెచ్​డీ+ పంచ్-హోల్ డిస్‌ప్లేతో వస్తుంది. అంతేకాకుండా 120హెచ్​జెడ్​ రిఫ్రెష్ రేట్, 240హెచ్​జెడ్​ టచ్ శాంప్లింగ్ రేట్‌ను కలిగి ఉంది. ఐటెల్ జెనో 5G​ ఐపీ54 రేటింగ్‌తో డస్ట్​ అండ్​ వాటర్​ రెసిస్టెన్స్​తో తీసుకొచ్చారు. ఈ మొబైల్ మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్‌సెట్‌తో నడుస్తుంది. అయితే, ఈ మొబైల్ లో 4GB LPDDR4X RAM, 128GB UFS 2.2 స్టోరేజ్ సౌకర్యం అందుబాటులో ఉంది. వర్చువల్ ర్యామ్ ద్వారా దీని RAMను దాదాపు 4GB వరకు విస్తరించవచ్చు. ఈ ఫోన్ మందం 7.8mm.

కెమెరా విషయానికి వస్తే.. వెనుక భాగంలో 50ఎంపీ సింగిల్ కెమెరా సెటప్‌ను, ఇక సెల్ఫీలు- వీడియో కాలింగ్ కోసం.. 8ఎంపీ ఫ్రెంట్ కెమెరాను అందించారు. ఈ మొబైల్ ఐటెల్ ఏఐ అసిస్టెంట్ ‘ఐవానా’ను కూడా అనుసంధానిస్తుంది. దీంతో రైటింగ్, ట్రాన్స్ లేషన్ అనువాదం, టెక్ట్స్​ దిద్దుబాటు పనులకు సపోర్ట్ చేస్తుంది.

ఇక బ్యాటరీ గురుంచి మాట్లాడితే..ఈ ఫోన్ 5,000ఎంఏహెచ్​ బ్యాటరీతో వస్తుంది. 10వాట్​ ఛార్జింగ్‌కు సపోర్ట్​ చేస్తుంది. డస్ట్, వాటర్ నుంచి రక్షణ పొందడానికి ఈ ఫోన్ IP54 రేటింగ్‌తో వస్తుంది. డ్యూయల్ 5G సిమ్ కార్డులు, వైఫై, బ్లూటూత్, జీపీఎస్​, ఐఆర్​ బ్లాస్టర్, యూఎస్​బీ-సీ కనెక్టివిటీకి వంటి ఫీచర్లు కలిగి ఉంటాయి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News