Sunday, June 22, 2025
Homeచిత్ర ప్రభMaruthi: ‘యోగా ఆంథెమ్’ను రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి

Maruthi: ‘యోగా ఆంథెమ్’ను రిలీజ్ చేసిన డైరెక్టర్ మారుతి

Yoga Anthem: ఎన్నో సినిమా పాటలకు కలిసి వర్క్ చేసిన మెలోడి బ్రహ్మ మణిశర్మ, పాటల రచయిత అనంత శ్రీరామ్ మరో పాటకు చేతులు కలిపారు. అయితే ఈసారి వారిద్దరూ చేతులు కలిపింది సినిమా పాట కోసం కాదు. యోగా అంథెమ్ సాంగ్ కోసం. ఈ పాట మొదటి స్థానంలో నిలవగా దానికి ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయలను బహుమతిగా ప్రకటించింది. ఇషాన్ క్రియేషన్స్ సంస్థ నిర్మించిన ఈ పాటను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేశారు. ఈ సందర్భంగా…

- Advertisement -

దర్శకులు మారుతి మాట్లాడుతూ ‘‘యోగా గురించి మాట్లాడాలంటే చాలా అర్హత ఉండాలి. ఆ ప్రాధాన్యతను తెలుసుకునే మన దేశ ప్రధాని మోదీ గారు యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు.అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఏపీలో జరుగుతున్న యోగాంధ్ర సెలబ్రేషన్స్ లో ఈ యోగా ఆంథెమ్ ఫస్ట్ ప్రైజ్ గెల్చుకోవడం సంతోషకరం. యోగాకు ఎలాంటి మతం లేదు. అందరూ ఆరోగ్యం కోసం యోగా చేయాలి. ఈ పాటకు సంగీతాన్ని మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేశారు. అనంత శ్రీరామ్ గారు అందరికీ అర్థమయ్యేలా చక్కటి లిరిక్స్ రాశారు’’ అన్నారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/hero-ram-pothineni-is-set-to-become-a-producer/

పాటల రచయిత అనంత శ్రీరామ్ మాట్లాడుతూ ‘‘ మనసు, శరీరాన్ని కలిపే ఉంచే శక్తి యోగాకు ఉంది. మన భారతదేశం ప్రపంచానికి అందించిన గొప్ప బహుమతి యోగ. దీనిపై పాట రాయటం చాలా అదృష్టంగా భావిస్తున్నాను. అందరికీ కనెక్ట్ కావాలనే ఉద్దేశంతో ఎక్కువగా సంస్కృత పదాలు ఉపయోగించి పాటను రాశాను. అశోక్ గారికి ధన్యవాదాలు’’ అన్నారు.

ఇషాన్ క్రియేషన్స్ అధినేత అశోక్ మాట్లాడుతూ ‘‘నాకు చిన్నప్పటి నుంచి యోగా చేయడం అలవాటుగా ఉండేది. సినీ ఇండస్ట్రీలో డిస్ట్రిబ్యూషన్ ఆపేశాక ఏడాదిపాటు రోజుకు 18 గంటలు యోగా ప్రాక్టీస్ చేశాను. 17 శక్తి పీఠాలు, 12 జ్యోతిర్లింగాలకు వెళ్లి దర్శించుకున్నాను. అంతర్జాతీయంగా యోగా డేను సెలబ్రేట్ చేస్తున్నారు. ఇది 11వ వసంతం. ఈసారి యోగాంధ్ర సెలబ్రేషన్స్ లో మా యోగా ఆంథెమ్ సాంగ్ కు తొలి బహుమతి వచ్చింది. ఈపాటను మణిశర్మ గారు అద్భుతంగా కంపోజ్ చేయగా, అనంత శ్రీరామ్ గారు అందమైన లిరిక్స్ ఇచ్చారు. ఈ పాటకు నాకు ఏపీ ప్రభుత్వం లక్ష రూపాయల నగదు బహుమతి, ఫస్ట్ ప్రైజ్ ఇచ్చారు. రేపు మోదీ గారిని కలిసే 50 మందిలో నాకు మొదటి అవకాశం కల్పించారు’’అన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News