Saturday, June 21, 2025
Homeబిజినెస్Real Cheers From Real: రియల్‌ నుంచి 'రియల్‌ చీర్స్‌'

Real Cheers From Real: రియల్‌ నుంచి ‘రియల్‌ చీర్స్‌’

Real Cheers: వినియోగదారులను ఆకట్టుకునేందుకు వ్యాపార సంస్థలు వినూత్న ప్రయోగాలు చేస్తున్నాయి. ప్రజల అభిరుచికి తగ్గట్టుగా కొత్త బ్రాండ్ పేరుతో తమ వ్యాపారాన్ని విస్తరిస్తున్నాయి. అటు కస్టమర్స్‌ను సంతృప్తి పరుస్తూ మార్కెట్‌లో ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాయి. వినియోగదారుల అభిరుచికి తగినట్లు డాబర్ ఇండియా లిమిటెడ్‌కు చెందిన ఫ్రూట్‌ జ్యూస్‌ బ్రాండ్‌ రియల్‌ కొత్తగా ‘రియల్‌ చీర్స్‌’ పేరిట కాక్‌టెయిల్‌ మిక్సర్‌ విభాగంలోకి అడుగుపెట్టింది. ఈ రియల్‌ చీర్స్‌ శ్రేణిలో నాలుగు ఉత్తేజకరమైన రకాలను తీసుకురావడంతో తన ఫోర్ట్‌పోలియోను మరింత విస్తరిస్తున్నట్లు ప్రకటించింది. ఇందులో భాగంగా జాముంటిని, గ్రీన్ ఆపిల్ మోజిటో, టానిక్ వాటర్‌తో పాటు అల్లం ఆలే రకాలను మార్కెట్‌లోకి తెచ్చింది. ఈ కాక్‌టెయిల్‌ మిక్సర్ల శ్రేణి అత్యుత్తమ నాణ్యత గల పదార్థాలతో తయారు చేయబడ్డాయని, రియల్‌ చీర్స్‌ నిపుణులతో రూపొందించబడిన ఈ రుచులు వినియోగదారులకు మంచి అనుభవాన్ని అందిస్తాయని పేర్కొంది.

ALSO READ: https://teluguprabha.net/telangana-news/rappa-rappa-placards-in-brs-mla-harish-rao-meeting/
డాబర్‌ ఇండియా లిమిటెడ్‌ మార్కెటింగ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మయాంక్‌ కుమార్‌ మాట్లాడుతూ ‘వినియోగదారుల ప్రాధాన్యతలను నిరంతరం ఆవిష్కరించడం, తీర్చడం మా లక్ష్యం. ఈ ఆవిష్కరణతో పానీయాల విభాగంలో రియల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుంది. రియల్ చీర్స్ పరిచయం మా ఉత్పత్తి పోర్ట్‌ఫోలియోను విస్తృతం చేయడమే కాకుండా.. మారుతున్న వినియోగదారుల అభిరుచి, వారి ప్రాధాన్యతలను కూడా తీరుస్తుంది. అంతేకాకుండా కొత్త వినియోగదారులతో పాటు మిలీనియల్స్, జెన్ జెడ్‌ జనరేషన్లకు ఇది కచ్చితంగా కనెక్ట్ అవుతుంది’ అని ధీమా వ్యక్తం చేశారు. డాబర్ ఇండియా లిమిటెడ్ మార్కెటింగ్‌, ఫుడ్స్‌ జీఎం మోనిషా ప్రషేర్‌ మాట్లాడుతూ ‘రియల్ చీర్స్ ప్రారంభంతో, మా సిగ్నేచర్ నాణ్యత, రుచి నైపుణ్యాన్ని కాక్‌టెయిల్ మిక్సర్ల ప్రపంచానికి తీసుకురావడానికి మేం సంతోషిస్తున్నాం. మా మిక్సర్లు ఉపయోగించడానికి సులభంగా ఉంటాయి. ముఖ్యంగా రుచికరమైనవిగా రూపొందించబడ్డాయి. రియల్ చీర్స్ కాక్‌టెయిల్‌లను మెరుగుపరిచేందుకు సౌలభ్యం, నాణ్యత, రుచి యొక్క పరిపూర్ణ మిశ్రమాన్ని అందిస్తుంది’ అని పేర్కొన్నారు.
ALSO READ:https://teluguprabha.net/telangana-news/balmuri-venkat-comments-on-padi-kaushik-reddy-arrest/

రియల్ చీర్స్ మిక్సర్లు 250 ఎంఎల్‌లో అందుబాటులో ఉన్నాయి. దీని వలన వినియోగదారులు తమకు ఇష్టమైన పానీయంలో చీర్స్‌ను సులభంగా కలపవచ్చు. జాముంటిని, గ్రీన్ ఆపిల్ మోజిటో రూ.99, జింజర్ ఆలే, టానిక్ వాటర్ రూ.65గా ధరలుగా నిర్ణయించారు. ఇప్పటికే ప్రధాన త్వరిత వాణిజ్య వేదికలైన జెప్టో, స్విగ్గీ ఇన్‌స్టామార్ట్, బిగ్ బాస్కెట్, బ్లింకిట్‌లలో అందుబాటులో ఉండగా, త్వరలో రిటైల్ ఛానెల్‌లలోనూ అందుబాటులోకి రానుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News