Monday, June 23, 2025
Homeటెక్నాలజీUpcoming Smartphones: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. వచ్చే వారం రాబోయే స్మార్ట్ ఫోన్లు ఇవే..

Upcoming Smartphones: టెక్ ప్రియులకు గుడ్ న్యూస్.. వచ్చే వారం రాబోయే స్మార్ట్ ఫోన్లు ఇవే..

Upcoming Smartphones: చాలా రోజులుగా కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తున్నారా..? అయితే మీకో గుడ్ న్యూస్. వచ్చే వారంలో దాదాపు నాలుగు స్మార్ట్‌ఫోన్‌లు మార్కెట్లో లాంచ్ కానున్నాయి. ప్రముఖ ఫోన్ల తయారీ కంపెనీలు ఒప్పో, వివో, పోకో, శామ్‌సంగ్ తమ కొత్త ఫోన్‌లను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. అయితే, ఈ స్మార్ట్‌ఫోన్‌లన్నింటిలో అందుబాటులో ఉన్న కొన్ని ప్రత్యేక ఫీచర్లు, లాంచ్ వివరాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.


POCO F7

POCO F7 స్మార్ట్ ఫోన్ జూన్ 24న మార్కెట్లో లాంచ్ కానుంది. దీనిలో స్నాప్‌డ్రాగన్ 8s Gen 4 ప్రాసెసర్‌ను చూడవచ్చు. దాదాపు 7550 mAh బ్యాటరీతో ఈ మొబైల్ వస్తుంది. 6.67-అంగుళాల AMOLED డిస్‌ప్లేను ఫోన్‌లో చూడవచ్చు. దీనితో పాటు ఫోన్ 120Hz రిఫ్రెష్ రేట్, డాల్బీ విజన్‌కు కూడా మద్దతు ఇస్తుంది. కెమెరా పరంగా.. 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్, 2 మెగాపిక్సెల్ మైక్రో కెమెరా కలిగి ఉంటుంది. కాగా, ఈ ఫోన్ ధర రూ. 35,000 కంటే తక్కువగా ఉంటుంది.


OPPO K13x 5G

ఒప్పో తమ OPPO K13x 5G మొబైల్ ను జూన్ 23న మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది. ఈ స్మార్ట్ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 695 5G రెడీ ప్రాసెసర్‌ తో పనిచేస్తుంది. ఈ ఫోన్‌లో 6.72 అంగుళాల FHD + LCD డిస్ప్లే, 128 రిఫ్రెష్ రేట్‌ను చూడవచ్చు. ఇందులో 5000 mAh బ్యాటరీ, 67 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ పొందవచ్చు. కెమెరా పరంగా.. దీనిలో 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాను ఉంటుంది. కాగా,ఈ ఫోన్ ధర రూ.12 వేల నుండి రూ.14 వేల వరకు ఉంటుంది.


Samsung Galaxy M36 5G

జూన్ 27న మార్కెట్లో Samsung Galaxy M36 5G స్మార్ట్ ఫోన్ లాంచ్ కానున్నది. ఈ పరికరం Exynos 1380 ప్రాసెసర్‌తో అమర్చబడి ఉంటుంది. ఈ ఫోన్‌లో AI-మెరుగైన 50MP ట్రిపుల్ కెమెరా ఉంటుంది. ఈ ఫోన్ 6000mAh బ్యాటరీ తో 25W ఫాస్ట్ ఛార్జింగ్‌కు కూడా మద్దతును ఇస్తుంది. ఈ ఫోన్ ధర రూ. 18,000 నుండి రూ. 20,000 వరకు ఉంటుంది.


vivo T4 Lite 5G

vivo T4 Lite 5G జూన్ 24న లాంచ్ కానున్న వివో కంపెనీ పేర్కొంది. ఈ ఫోన్ మీడియాటెక్ 6300 ప్రాసెసర్‌తో కూడిన ఎంట్రీ లెవల్ స్మార్ట్‌ఫోన్. ఈ స్మార్ట్ ఫోన్ 6000 mAh బ్యాటరీ తో వస్తుంది. ఈ ఫోన్ లో 6.5-అంగుళాల HD ప్లస్ LCD డిస్ప్లేను ఇస్తారు. ఇందులో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అందుబాటులో ఉంటుంది. ఫోన్ 8-మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది. కాగా, ఈ ఫోన్ ధర రూ. 10000 కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ ఇప్పటికే ధృవీకరించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News