8 Vasanthalu OTT Partner: అనంతిక సనీల్ కుమార్, హను రెడ్డి, రవి దుగ్గిరాల ప్రధాన పాత్రల్లో రూపొందిన ‘8 వసంతాలు’. జూన్ 20న రిలీజైన ఈ ప్రేమకథా చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. ఓ అమ్మాయి జీవితంలో 17 ఏళ్ల వయసు నుంచి పాతికేళ్ల వయసు వరకు జరిగే పరిణామాలు, ప్రేమ, ఆమె ఎదుర్కొన్న సవాళ్లు, వాటిని ఎలా అధిగమించింది. ఎలా పరిణితి సాధించింది. ప్రేమలో ఆమెకు ఎదురైన సమస్య ఏంటి? చివరకు ఎలా విజయాన్ని సాధించిందనే కథాంశంతో ఈ సినిమాను దర్శకుడు ఫణీంద్ర నరిశెట్టి తెరకెక్కించారు. మను సినిమా తర్వాత ఈయన డైరెక్ట్ చేసిన సినిమా ఇది.
‘8 వసంతాలు’ సినిమా ఓటీటీలోకి ఎప్పుడొస్తుందనేది ఇప్పుడు డిస్కషన్ పాయింట్‌గా మారింది. సినీ వర్గాల్లో వినిపిస్తోన్న సమాచారం మేరకు సినిమా బాక్సాఫీస్ దగ్గర గొప్పగా ఆడటం లేదు కాబట్టి.. నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఈ సినిమాను ఫ్యాన్సీ రేటుకి దక్కించుకుంది. త్వరలోనే ‘8 వసంతాలు’ ఓటీటీ రిలీజ్ డేట్ విషయంలో మరింత క్లారిటీ రానుందని మూవీ వర్గాలంటున్నాయి.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/sailore-song-from-ghati/
మ్యాడ్ ఫేమ్ అనంతిక ఇందులో చాలా మంచి రోల్లో నటించింది. గ్లామరస్ పాత్రలే నటించాలనుకోకుండా పెర్ఫామెన్స్ ఓరియెంటెడ్ పాత్రకు ఆమె మొగ్గు చూపటం అభినందించాల్సిన విషయం. ఇందులో హీరోయిన్ యాక్షన్ సన్నివేశాల్లో నటించటానికి మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుని మరీ నటించటం విశేషం. మ్యాడ్ చిత్రంలో అనంతిక తను చేసిన పాత్రకు పూర్తి భిన్నమైన పాత్రను ఈ చిత్రంలో చేసింది. దర్శకుడు చెప్పాలనుకున్న విషయాన్ని ఎక్కువ కవితాత్మకంగా చెప్పాలనుకోవటంతో చాలా మందికి కనెక్ట్ కాలేదుని, కథ, కథనం విషయంలో డైరెక్టర్ మరింత శ్రద్ధ తీసుకుని ఉండాల్సిందనే విమర్శలు కూడా వచ్చాయి. అయితే కొన్ని సినిమాలు థియేటర్స్‌లో సరిగ్గా ఆడకపోయినప్పటికీ ఓటీటీలో ఆదరణ పొందుతుంటాయి. దీనికి చాలా ఉదాహరణలే ఉన్నాయి. అలాంటి కోవలోకి 8 వసంతాలు సినిమా వస్తుందా? ఇంతకీ ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాలి మరి.