Sun Transit in Gemini 2025: మన తెలుగు రాష్ట్రాల్లో జ్యోతిష్య శాస్త్రాన్ని నమ్మేవారు చాలా మందే ఉన్నారు. వారు మంచి గడియలు లేనిదే ఏ పని చేయరు. ఇంటి నుంచి బయటకు వెళ్లాలన్నా, ఏదైనా వర్క్ మెుదలుపెట్టాలన్నా, ఏ శుభ కార్యం తలపెట్టాలన్నా పంచాంగం చూసి చేస్తారు. ఆస్ట్రాలజీలో గ్రహాల స్థానం చాలా ముఖ్యమైనది. గ్రహాబలం మంచిగా ఉంటేనే అనుకున్న పని జరుగుతుందని నమ్ముతారు.
సైన్స్ ప్రకారం, విశ్వంలో ప్రధానమైనవి 8 గ్రహాలు. వీటిన్నింటికి బాస్ సూర్యుడు. మన జాతక చక్రంలో ఆదిత్యుడు పొజిషన్ బాగుంటేనే మంచి ఫలితాలు వస్తాయి. ఇటీవల సూర్యభగవానుడు తన గమనాన్ని మార్చుకుని మిథునరాశి ప్రవేశం చేశాడు. రవి మార్పు కారణంగా కొన్ని రాశులవారు జాక్ పాట్ కొట్టనున్నారు. ఆ లక్కీ రాశులు ఏవో తెలుసుకుందాం.
సింహరాశి
ఈ రాశికి అధిపతిగా సూర్యదేవుడిని భావిస్తారు. దీని కారణంగా ఎల్లప్పుడూ సింహరాశివారిపై తన కరుణను కురిపిస్తూ ఉంటాడు ఆధిత్యుడు. రవి జెమినిలోకి ప్రవేశించడం వల్ల ఈ రాశి అభ్యర్థులకు ప్రభుత్వ ఉద్యోగాలు పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం జాబ్ చేస్తున్నవారికి ప్రమోషన్ దక్కవచ్చు. అనారోగ్యంతో బాధపడుతున్నవారు కోలుకుంటారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. సంతానం లేని దంపతులకు పిల్లలు కలుగుతారు.
మేషరాశి
ఆదిత్యుడు దయ మేషరాశి వారిపై కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే మేషరాశికి అధిపతి అయిన అంగారకుడు రవికి మంచి ఫ్రెండ్. గ్రహారాజు స్థానం మార్పు కారణంగా ఈ రాశి వారి వ్యాపారం వృద్ధి చెందుతుంది. ఇంతకముందు ఎప్పుడూ చూడని లాభాలను ఆర్జిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం వస్తుంది. మేషరాశి వారు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. విదేశీయానం ఉంది. తీసుకున్న రుణాన్ని చెల్లిస్తారు.
మిథునరాశి
మిథునరాశి గ్రహాల అధిపతి అయిన సూర్యుడు ఇదే రాశిలోకి ప్రవేశించాడు. దీని కారణంగానే ఈ రాశి వారికి ధనానికి లోటు ఉండదు. పోగొట్టుకున్న సొమ్ము లభిస్తుంది. మిథునరాశి వారు షేర్లలో మంచి పెట్టుబడి పెట్టడం వల్ల భారీ స్థాయిలో లాభాలను ఆర్జిస్తారు.