Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభThalapathy Vijay: ‘జ‌న నాయ‌కుడు’గా ద‌ళ‌ప‌తి విజ‌య్‌.. అనుమానాలు నిజ‌మేనా!

Thalapathy Vijay: ‘జ‌న నాయ‌కుడు’గా ద‌ళ‌ప‌తి విజ‌య్‌.. అనుమానాలు నిజ‌మేనా!

Jana Nayakudu: కోలీవుడ్ సూపర్ స్టార్ ద‌ళ‌పతి విజయ్ చివరి సినిమా ‘జన నాయగన్’. దీన్ని తెలుగులో ‘జన నాయకుడు’గా రిలీజ్ చేస్తున్నారు. విజయ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూవీ తెలుగు టైటిల్ పోస్టర్‌ను విడుదల చేసిన టీమ్ తమిళంలో టీజర్‌ను విడుదల చేసింది. సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఫస్ట్ రోర్ పేరిట విడుదలైన 65 సెకన్ల ఈ వీడియోలో పెద్దగా కథను రివీల్ చేయకుండా, విజయ్ స్టైల్‌లో ఖాకీ యూనిఫార్మ్ వేసుకొని, కత్తి పట్టుకొని మీసాలు మెలేస్తూ నడిచే సన్నివేశంతో ముగించారు. ఈ షాట్ అభిమానులకు గూజ్ బమ్స్ తెప్పిస్తుందనటంలో సందేహం లేదు.

- Advertisement -

ఇదంతా బాగానే ఉంది..కానీ ‘జన నాయకుడు’ మూవీ తెలుగులో నందమూరి బాల‌కృష్ణ హీరోగా న‌టించిన భగవంత్ కేసరి రీమేక్ అంటూ కొన్నాళ్లు ముందు గ‌ట్టిగానే వార్త‌లు వైర‌ల్ అయ్యాయి. ఇప్పుడు టీజ‌ర్‌తో ఈ అనుమానాలు మరోసారి ముదిరాయి. ఇప్పటికే ఇదే విషయంపై సోషల్ మీడియాలో విపరీతంగా చర్చ జరుగుతోంది. గతంలో ఓ ఈవెంట్‌లో నటుడు వి.టి.గణేష్ భ‌గ‌వంత్ కేస‌రినే త‌మిళంలో విజ‌య్ చేయ‌బోతున్నారంటూ చేసిన వ్యాఖ్యలు జ‌న నాయ‌కుడు టీమ్‌ను ఇరుకున పెట్టింద‌నే చెప్పాలి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/vijay-deverakonda-says-sorry-on-his-controversy-words-through-his-social-media-2/

అయితే తమిళ మీడియా, ప్రొడక్షన్ హౌస్ పీఆర్ టీమ్ మాత్రం దీనిని పూర్తిగా ఖండించాయి. జ‌న నాయ‌కుడు ఓ కొత్త కథ అని, భ‌గ‌వంత్ కేస‌రి నుంచి కేవలం ఓ పాయింట్ మాత్రమే తీసుకొని కొత్తగా స్క్రిప్ట్ డెవలప్ చేశారని కోలీవుడ్ పి.ఆర్‌.టీమ్‌, మీడియా తెలియ‌జేసింది. అయితే కూడా ద‌ళ‌ప‌తి విజయ్ ఖాకీ దుస్తుల్లో కనిపించడం, అభిమానులకు భగవంత్ కేసరిలో బాలయ్య లుక్‌ను గుర్తు చేస్తుండటంతో రీమేక్ అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. తెలుగులో కాజ‌ల్ అగ‌ర్వాల్ చేసిన పాత్ర‌ను త‌మిళంలో పూజా హెగ్డే చేస్తుంద‌ని తెలుస్తుంది. ఇక తెలుగులో శ్రీలీల చేసిన పాత్రకు తలపడే రోల్‌ను తమిళంలో మమిత బైజు పోషిస్తుంది. న‌టీన‌టుల వివ‌రాల‌ను చూస్తే పూజా హెగ్డే మిన‌హాయిస్తే మ‌రే వివ‌రాలు బ‌య‌ట‌కు రాలేదు. అయితే ఇప్పటికే లీకులు వెలువడ్డాయి. ఇలా క్యాస్టింగ్ నుంచి స్టోరీ పాయింట్ల వరకు ఉన్న సారూప్యతలు రీమేక్ టాక్‌ను ఖండించలేనిదిగా మారుస్తున్నాయి.

జ‌న నాయ‌కుడు సినిమా రీమేక్ అయినా, కాకపోయినా విజయ్ స్టార్ డ‌మ్ ముందు అవన్నీ చిన్న విషయాలనే చెప్పాలి. గతంలో ఆయ‌న హీరోగా అట్లీ తెర‌కెక్కించిన తేరి సినిమా విజయ్ కాంత్ హీరోగా న‌టించిన‌ క్షత్రియుడు సినిమాను బేస్‌గా తీసుకున్నా, అది మాస్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. జ‌న నాయ‌కుడు సినిమా విష‌యానికి వ‌స్తే ద‌ళ‌ప‌తి విజ‌య్ న‌టిస్తోన్న చివ‌రి సినిమా ఇది. ఆయ‌న రాజ‌కీయాల్లోకి రంగ ప్ర‌వేశం చేశారు. రానున్న త‌మిళనాడు అసెంబ్లీ ఎన్నిక‌ల్లో ఆయ‌న పార్టీ పోటీ చేయ‌నుంది. విజ‌య్ రాజ‌కీయాల్లో బిజీగా మార‌బోతున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా ఓపెనింగ్స్ చరిత్ర సృష్టించబోతున్నాయని టాక్. ఈ చిత్రం మీదే ప్రస్తుతం మిగతా సౌత్ ఇండస్ట్రీస్‌ కన్ను పడింది. రానున్న ఏడాది సంక్రాంతి సీజ‌న్‌న టార్గెట్ చేసుకుని జ‌న‌వ‌రి 9న జ‌న నాయ‌కుడు సినిమాను విడుద‌ల చేయ‌బోతున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News