Monday, September 23, 2024
Homeచిత్ర ప్రభGlamour queen: స్టార్ హీరోయిన్, స్టార్ మదర్

Glamour queen: స్టార్ హీరోయిన్, స్టార్ మదర్

ఆమెకు ఐరన్ లెగ్ అని పేరు అలాంటి ఆమె సడన్ గా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చారు.  మోస్ట్ గ్లామరస్ యాక్ట్రెస్ గా రికార్డ్ క్రియేట్ చేశారు.  అంతేకాదు లేట్ ఏజ్ లోనూ ఆమె ట్రెండింగ్ స్టార్ గా  హై డిమాండ్ లో ఉన్న స్టార్ యాక్టర్ గా వెలిగిపోతున్నారు.  ఇదంతా ప్యాన్ ఇండియా స్టార్ రమ్యకృష్ణ స్పెషాలిటీ అందుకే ఆమె మన మహానటి అయ్యారు.

- Advertisement -

చో రామస్వామి మేనకోడలు

ప్రముఖ జర్నలిస్ట్ చో రామస్వామి మేనకోడలే మన రమ్యకృష్ణ.  టాలీవుడ్ లోని దాదాపు అందరు హీరోలతోనూ స్క్రీన్ పైన రొమాన్స్ చేశారు రమ్యకృష్ణ.  ఇప్పుడు ఈమె చాలా బిజీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా, లేడీ విలన్ గా మారారు. నరసింహా సినిమాలో రజనీకాంత్ తో పోటీపడి యాక్ట్ చేశారు రమ్య.  అయితే ఈ సినిమా షూటింగ్ తరువాత ఆమె హైదరాబాద్ వచ్చేశారు.  నీలాంబరి రోల్ లో తన క్యారెక్టర్ చూసి రజనీ ఫ్యాన్స్ తనను టార్గెట్ చేస్తారని ఆమె భయపడ్డారట.  ఈ విషయం ఈమధ్యనే రమ్య చెప్పేవరకూ ఎవరికీ తెలియదు.

సూపర్ స్టార్ రజనీతో సమానంగా..

తెలుగు,తమిళ్ లో బ్లాక్ బస్టర్ హిట్ అయిన నరసింహ సినిమాలో రమ్యకృష్ణకు రజనీతో సమానంగా మైలేజ్ వచ్చింది ఆ రేంజ్ లో ఆమె పర్ఫార్మ్ చేశారు.  రజనీకి పెద్దగా హిట్స్ లేకపోవటంతో ఇప్పుడు రజనీ నెక్ట్స్ మూవీలోనూ రమ్యను విలన్ గా పెట్టి సినిమా తీస్తున్నారు డైరెక్టర్ నెల్సన్.  ప్రాబబ్లీ రజనీ కెరీర్ లో ఇదే లాస్ట్ మూవీ కూడా కావచ్చు. పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తో రజనీ రిటైర్డ్ అవ్వాలనుకుంటున్న టైంలో రజనీకి విలన్ గా రమ్యకృష్ణను సెలెక్ట్ చేసుకున్నట్టు చెన్నైలో రూమర్ వచ్చింది.

నంబర్ 1 లేడీ విలన్..

లేడీ విలన్స్ లో నంబర్ 1గా రమ్యకృష్ణకు మార్కెట్ ఉంది.  బాహుబలితో ఇది మరింత పీక్స్ కు పోయింది. 1985లో భలే మిత్రులు సినిమా రమ్యకృష్ణకు ఫస్ట్ తెలుగు మూవీ.  ఆతరువాత వచ్చిన సూత్రధారులు పెద్ద హిట్ అయి..ఆమెకు మంచి యాక్ట్రెస్ గా పేరువచ్చింది కానీ ఛాన్స్ లు మాత్రం మంచివి రాలేదు.  అప్పట్లో రమ్యకృష్ణ హీరోయిన్ గా చేసిన సినిమాలు వరుసపెట్టి డిజాస్టర్ అవుతుంటే ఆమెకు ఐరన్ లెగ్ అని పేరు పెట్టారు.  సరిగ్గా ఈటైంలో వచ్చింది అల్లుడుగారు సినిమా.  ఇది 1992లో రిలీజ్ అయి రమ్య లక్ ను పెద్ద మలుపు తిప్పింది.  కే రాఘవేంద్రరావు డైరెక్షన్లో వచ్చిన చాలా సినిమాల్లో హీరోయిన్ గా రమ్యకృష్ణ యాక్టే చేసి హిట్స్ ఇచ్చారు.  ఆతరువాత రమ్యకృష్ణ హీరోయిన్ గా ఉంటేచాలు సినిమా పెద్ద హిట్ కమర్షియల్ హిట్ గ్యారెంటీ అనేలా ఆమె దూసుకుపోయారు.  అందుకే ప్రొడ్యూసర్స్ కు ఆమె అప్పట్లో ఫస్ట్ ఛాయిస్ గా ఉండేవారు.

8వ క్లాస్ నుంచే యాక్టింగ్

1990 నుంచి 2000 వరకు పదేళ్లు తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలోకూడా ఆమె సినిమాలు చేసి మనల్ని ఎంటర్టైన్ చేశారు.  మీకు తెలుసా 8వ తరగతి నుంచే ఆమె నటించటం స్టార్ట్ చేశారు.  మంచి క్లాసికల్ డ్యాన్సర్ అయిన ఈమె డ్యాన్స్ ఇరగదీస్తారు.  న్యూయార్క్, డల్లాస్ వంటిచోట్ల ఈమె తన క్లాసికల్ డ్యాన్స్ పర్ఫార్మ్ చేశారుకూడా.  ఏస్ డైరెక్టర్ కృష్ణవంశీని లవ్ మ్యారేజ్ చేసుకున్న రమ్యకు ఒక కొడుకు.

కొడుకు పేరుతో ప్రొడక్షన్ కంపెనీ

కొడుకు రిత్విక్ పేరుతో ప్రొడక్షన్ కంపెనీకూడా ఆమె స్టార్ట్ చేశారు.  ఫిల్మీ పర్సనాలిటీస్ ను ఇంటర్వ్యూ చేసేందుకు జరా మస్తీ జరా ధూమ్ అనే టీవీషో కూడా చేశారు.  ఇంకా చాలా రకాల టీవీ షోలు చేసేందుకు రమ్యకృష్ణ పెద్ద ప్లాన్ రెడీగా పెట్టుకున్నారు కూడా.  సో త్వరలో ఆమె మన లివింగ్ రూమ్ కు వచ్చి మనకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వనున్నారు.

కంటే కూతుర్నే కను సినిమాలో తన బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన రమ్య బెస్ట్ యాక్ట్రెస్ నంది అవార్డు గెలిచారు.  2009లో రాజు మహారాజు సినిమాతో నంది అవార్డు బెస్ట్ యాక్ట్రెస్ గా సొంతం చేసుకున్నారు.  అవార్డులకంటే ఆడియన్స్ ఎక్స్ పెక్టేషన్సే రమ్యకు పెద్ద అసెట్ అని చెప్పాలి.  ఈమె ఉందంటే సినిమా మినిమం గ్యారెంటీ అనే రేంజ్ లో ఉంటుంది ఎక్స్ పెక్టేషన్స్.

స్పెషల్ సాంగ్స్ క్వీన్

ఈశ్వర్, సింహాద్రి సినిమాల్లో స్పెషల్ సాంగ్ చేశారు ఈమె.  ఈ పాటలతో తెలుగు వారిని ఉర్రూతలూగించారు.  రమ్యకృష్ణ సినిమాల్లో పాటలు సూపర్ హిట్ అవ్వటం ఖాయం. 

ఆయనకిద్దరు, ఇంగ్లీష్ పెళ్లాం ఈస్ట్ గోదావరి మొగుడు, క్రిమినల్, హలో బ్రదర్, అల్లరి మొగుడు,  అల్లరి ప్రియుడు, ఆహ్వానం, బృందావనం, ముగ్గురు మొనగాళ్లు, మేజర్ చంద్రకాంత్, ముద్దుల ప్రియుడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి, బంగారు బుల్లోడు, బంగార్రాజు వంటి సినిమాల్లో రమ్య రోల్స్ ను మనమెవరం మరచిపోలేం.

అమ్మోరు, అన్నమయ్య, శ్రీఆంజనేయం, సమ్మక్క-సారక్క, శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి చరిత్ర లాంటి సినిమాల్లో.. తన యాక్టింగ్ తో రమ్యకృష్ణ తెలుగువారి హృదయాలు గెలుచుకున్నారు.  పౌరాణికాలు వేయాలన్నా, అమ్మవార్ల రోల్ వేయాలన్నా రమ్యకృష్ణ సూపర్ గా సెట్ అవుతారు.  అందుకే ఆమె జస్ట్ స్కిన్ షో మాత్రమే కాదు లేడీ విలన్, ఐటెం బాంబా గానూ, హీరోయిన్ గానూ, గెస్ట్ అప్పియరెన్స్ ల్లోనూ మైథాలజీ, పీరియాడిక్ సినిమాల్లోనూ ఇలా అన్ని జోనర్స్ లో సూపర్ గా సెట్ అవుతారు.

మతిపోగెట్టే ఫోటో షూట్స్

నీలాంబరి, శివగామిగా ఆమె శెభాష్ అనిపించుకున్నారు.  హాట్ అందాలతో ఒకప్పుడు చాలా హీట్ పెంచే హీరోయిన్ గా యంగ్ స్టర్స్ కు డ్రీమ్ గర్ల్ గా రమ్యకృష్ణ వెలుగులు వెలిగారు.  సోషల్ మీడియాలో ఆమె పెట్టే ఫోటో షూట్స్ మతిపోగొట్టేలా ఉంటాయి.  అవన్నీ ఎప్పటికప్పుడు వైరల్ అయిపోతుంటాయి. ఇప్పుడు కూడా యంగ్ హీరోయిన్స్ కు గట్టిపోటీ ఇస్తారు రమ్య. 

స్క్రీన్ ఏదైనా తన మాటే శాసనం

స్మాల్ స్క్రీన్, బిగ్ స్క్రీన్ తేడాలేకుండా..దుమ్ము లేపే సత్తా ఉన్న ఏకైక హీరోయిన్ గా రమ్యకృష్ణ తెలుగులో తనకు తిరుగు లేదనిపించుకుంటున్నారు.  బిగ్ బాస్ షోకు ఒకరోజు యాంకరింగ్ చేసి తనమాటే శాసనం అని నిరూపించారు.  సౌత్ ఇండియాలో హయ్యస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటున్న క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఆమె ఇప్పుడు సెటిల్ అయ్యారు.

జస్ట్ ఫర్ వుమెన్ అనే మ్యాగజైన్ కవర్ స్టోరీ గర్ల్ గా రమ్య చేసిన ఫోటో షూట్ సూపర్బ్ అనిపించుకుంది.  అయితే ఆమధ్య రమ్యకృష్ణ-కృష్ణవంశీ డైవర్స్ తీసుకుంటున్నారనే రూమర్స్ వచ్చాయి.  అయితే అలాంటిదేం లేదని తాను హ్యాపీగా ఉన్నట్టు, సెలబ్రిటీలపై ఈ రూమర్స్ రొటీన్ అంటూ కృష్ణవంశీ క్లారిటీ ఇచ్చారు.

సెకెండ్ ఇన్నింగ్స్ లో ఫుల్ స్పీడ్

హీరోయిన్ గా ఉన్న ఫస్ట్ ఇన్నింగ్స్ ను కాసేపు పక్కనపెడితే సెకెండ్ ఇన్నింగ్స్ లో రమ్య చాలా స్పీడ్ పెంచారు.  ఎవర్ గ్రీన్ బ్యూటీ, నవరస నటరమ్యగా రమ్యకృష్ణ కెరీర్ ఇప్పుడు రాకెట్ లా దూసుకుపోతోంది. తమిళ్ బిగ్ బాస్ షో హోస్ట్ గా రమ్య అదరగొడుతున్నారు. హీరోలకు తల్లిగా ఆమె స్టార్ మదర్ గా వెలిగిపోతున్నారు.  కొంచెం ఇష్టం కొంచెం కష్టం వంటి సినిమాల్లో హీరోకు తల్లిగా అందరినీ మెప్పించారు.

స్పాట్

యాంకర్ 17

1970లో పుట్టిన రమ్య ఇప్పటికీ చాలా ఫిట్ గా, హెల్తీగా కనిపిస్తారు.  200 కుపైగా సినిమాల్లో యాక్ట్ చేశారు.  రమ్యకృష్ణకు రియల్ లైఫ్ లో ఇన్స్పిరేషన్ జయలలిత. ఇన్సిడెంటల్లీ రమ్యకృష్ణనే జయలలిత రోల్ ను రీల్ పై ప్లే చేశారు.  క్వీన్ అనే వెబ్ సిరీస్ లో జయలలిత రోల్ ను రమ్యకృష్ణ సూపర్ గా చేశారు. 

యాక్టింగ్ టార్గెట్ కాదు

చిన్నప్పటి నుంచే కూచిపూడి, భరతనాట్యం డ్యాన్సులు నేర్చుకున్న రమ్యకృష్ణకు యాక్టింగ్ అసలు టార్గెట్టే కాదు.  సినిమాల్లో యాక్ట్ చేస్తే ఈజీగా పాపులారిటీ వస్తుందని.. దీంతో మరిన్ని డ్యాన్స్ షోస్ చేయచ్చని రమ్యకృష్ణ మదర్ కు ఎవరో చెప్పారట.  దీంతో సినిమాల్లో ఆరంగేట్రం చేశారు రమ్య.  కానీ చివరికి సినిమాలే తన లోకమయ్యాయని తనకెప్పుడూ సినిమాల్లోకి రావాలని లేదని ఆమె క్లియర్ గా ఎక్స్ ప్లైన్ చేశారు.

నరసింహ, అంతఃపురంలో సౌందర్య చేసిన రోల్స్ ను తాను చేయలేకపోయినందుకు ఇప్పటికీ బాధగా ఉందని రమ్యకృష్ణ చెబుతుంటారు.  రాఘవేంద్రరావు, కేఎస్ రవికుమార్ల రుణం తానెప్పటికీ తీర్చుకోలేనని, ఆ ఇద్దరు డైరెక్టర్స్ తనకు మంచి బ్రేక్ ఇచ్చారని సగర్వంగా చెబుతారు.   కాస్త టైం దొరికితే కొడుకుతో గడుపుతూ, వంటలు చేస్తూ, తాను ఇంట్లో చాలా హ్యాపీగా టైం పాస్ చేస్తానని రమ్యకృష్ణ ఓ యావరేజ్ లేడీలా చెప్పటం హైలైట్. 

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News