Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభNiharika Konidela: నిహారిక పెళ్లిపై నాగబాబు కామెంట్స్

Niharika Konidela: నిహారిక పెళ్లిపై నాగబాబు కామెంట్స్

Mega Brother Ngababu: మెగా ఫ్యామిలీకి చెందిన నిహారిక కొణిదెల తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయినప్పటి నుంచి నటన, నిర్మాణం, వ్యక్తిగత జీవితం ఇలా పలు రకాలుగా ఆమె డిస్క‌ష‌న్స్‌లో నిలుస్తోంది. పెళ్లి చేసుకున్న నిహారిక జీవితం మాత్రం విడాకులు వైపు దారి తీసింది. డివోర్స్ త‌ర్వాత నిహారిక సినీ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ఈసారి హీరోయిన్‌గా కాదు.. నిర్మాత‌గా. వెబ్ సిరీస్‌ను నిర్మించిన నిహారిక సినీ నిర్మాత‌గా మారింది. త‌న సొంత బ్యాన‌ర్‌పై ఆమె నిర్మించిన చిత్ర‌మే ‘కమిటీ కుర్రాళ్లు’. ఈ మూవీ చాలా పెద్ద స‌క్సెస్ అయ్యింది. ఈ విజ‌యంలో నిహారిక చాలా కీ రోల్ పోషించింది. సినిమాను ప్ర‌మోట్ చేయ‌టంలో ముందుండి టీమ్‌ను న‌డిపించింది.

- Advertisement -

అయితే నిహారిక వ్య‌క్తిగ‌త జీవితం విష‌యంలో ఆమె స‌క్సెస్‌ఫుల్ కాలేక‌పోయారు. 2020లో సాఫ్ట్ వేర్ ఇంజ‌నీర్ అయిన‌ జొన్నలగడ్డ చైతన్యను ఆమె వివాహం చేసుకున్నారు. అయితే వివాహ జీవితం అనుకున్నట్టుగా సాగకపోవడంతో, 2023 జూలైలో పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకున్నారు. ఈ విషయంలో నిహారిక తండ్రి, మెగా బ్రదర్ నాగబాబు తాజాగా ఓ ఇంట‌ర్వ్యూలో స్పందించారు. ఆయ‌న మాట్లాడుతూ ‘పెళ్లి విషయంలో మేము సరైన నిర్ణయం తీసుకోలేకపోయాం. కరెక్ట్‌గా జ‌డ్జ్ చేయ‌లేక‌పోయాం. ఇద్ద‌రూ విడిపోదామ‌ని ప‌ర‌స్ప‌ర అంగీకారంతోనే విడిపోయారు’ అన్నారు. ఏదో ఒకరోజు ఒక అబ్బాయిని చూసుకుని పెళ్లాడుతుంది.. ఇక వాళ్ల వ్య‌క్తిగ‌త విషయాల్లో నేను జోక్యం చేసుకోను. ఆమెకు నచ్చినట్టు జీవించాలి అన్నదే తన అభిప్రాయమని ఈ సంద‌ర్భంగా మెగా బ్ర‌ద‌ర్ వెల్లడించారు. ఇప్పుడిప్పుడే నిహారిక ఈ ప‌రిస్థితుల నుంచి నిహారిక బ‌య‌ట‌ప‌డుతుంద‌ని నాగ‌బాబు తెలియ‌జేశారు.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/copy-right-issues-on-natural-star-nani-hit-3/

సిల్వ‌ర్ స్క్రీన్‌పై న‌టిగా కెరీర్ స్టార్ట్ చేసిన నిహారిక ఇప్పుడు నిర్మాత‌గా రాణిస్తోంది. ఇప్ప‌టికే క‌మిటీ కుర్రోళ్లు వంటి స‌క్సెస్‌ఫుల్ మూవీ చేసిన ఆమె ఇప్పుడు త‌న బ్యాన‌ర్‌లో సంగీత్ శోభ‌న్ హీరోగా రెండో సినిమాను స్టార్ట్ చేసింది. మ‌రోవైపు తన ప్రొడక్షన్‌లో మెగా ఫ్యామిలీ హీరోలను కూడా తీసేందుకు నిహారిక చొరవ చూపుతోందని వార్త‌లు కూడా వినిపిస్తున్నాయి. ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టే.. భవిష్యత్తులో ఆమె భారీ చిత్రాలు నిర్మించే అవకాశాలున్నాయని ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. మరోవైపు ఆమె డైరెక్ష‌న్ చేసే అవ‌కాశాలు లేక‌పోలేదు. ఎందుకంటే ఓ ఇంటర్వ్యూలో నిహారిక చెప్పినట్లుగా, ఆమెకు దర్శకత్వంపై ఆసక్తి ఉందని తెలియజేసింది. దీంతో ఆమె డైరెక్టర్ అవుతుందా? అనే ఆసక్తికర చర్చలు మొదలయ్యాయి. నిర్మాతగా ఇప్పటికే తన ప్రతిభను నిరూపించుకున్న నిహారిక, త్వరలోనే మెగా ఫోన్ పట్టే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News