Saturday, November 23, 2024
HomeతెలంగాణVemula: ఎంపీ అరవింద్ ను నిలదీయండి

Vemula: ఎంపీ అరవింద్ ను నిలదీయండి

నా బిఆర్ఎస్ కుటుంబ సభ్యులను ఒక్కచోట చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని, బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే బలం, బలగం, బలమైన కార్యకర్తలు లేని పార్టీల మనుగడ లేనేలేదంటూ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కేసీఆర్ పోరాటంలో కార్యకర్తల భూమిక గొప్పదన్నారు.

- Advertisement -

బాండ్ పేపర్ వాల్యూ పోగొట్టిన ఎంపి అరవింద్ ను గ్రామాల్లోకి వస్తుంటే ప్రజలే అతన్ని నిలదీయాలని, ఎంపిగా ఎన్ని నిధులు తెచ్చావు, ఏం అభివృద్ది చేశావు? ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి ఎంత మందికి ఆర్ధిక సహాయం చేశావ్ అంటూ ప్రజలు నిలదీయాలన్నారు వేముల.

కాంగ్రెస్,బీజేపీ అసత్య ప్రచారాలు బిఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని, బిఆర్ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన అన్నారు. బిఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నాడు భీంగల్ మండలం లింబాద్రి గుట్ట వద్ద జరిగింది. ఈ ఆత్మీయ సమ్మేళనంలో రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి – నీరజారెడ్డి దంపతులు సతీసమేతంగా పాల్గొన్నారు. డీసీఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్,డిసిసిబి వైస్ చైర్మన్ రమేష్ రెడ్డి,డా.మధు శేఖర్, భీంగల్ మండల బిఆర్ఎస్ పార్టీ శ్రేణులు సతీ సమేతంగా పెద్ద ఎత్తున హాజరయ్యారు.

పార్టీ శ్రేణులను ఉద్దేశించి అధినేత కేసీఆర్ పంపిన సందేశాన్ని ఆత్మీయ సమ్మేళనంలో నిజామాబాద్ డిసిఎంఎస్ చైర్మన్ సాంబారి మోహన్ చదివి వినిపించారు. కేసిఆర్ సందేశం విన్న బిఆర్ఎస్ శ్రేణులు చప్పట్లతో హర్షం వ్యక్తం చేశారు. అనంతరం పార్టీ శ్రేణులకు వేముల దంపతులు బోజనాలు వడ్డించి వారితో కలిసి సహపంక్తి భోజనాలు చేశారు. ఈ కార్యక్రమంలో భీంగల్ మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షుడు,ఆయా గ్రామాల అద్యక్ష్యులు,మండల ప్రజా ప్రతినిధులు, సర్పంచ్ లు,పలువురు కార్యకర్తలు హాజరయ్యారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES
spot_img

Latest News