Vastu Tips in telugu: సాధారణంగా మన ఇళ్లను వాస్తు ప్రకారం నిర్మించడం జరుగుతుంది. కొన్నిసార్లు స్థలం వృథా అవ్వకూడదనే ఉద్ధేశంతో దానిని కూడా ఏదో రకంగా వాడేస్తాం. కొంత మంది ఇళ్లలో మెట్ల కింద బాత్రూమ్ ఉంటుంది. ముఖ్యంగా ఇలాంటి నిర్మాణాలు పట్టణాలు ఎక్కువగా చూడొచ్చు. ఎందుకంటే నగరాల్లో ప్లేస్ తక్కువగా ఉంటుంది కాబట్టి ఈ విధంగా కడతారు. అయితే ఇలా చేయడం మంచిదా కాదా? అసలు వాస్తు శాస్త్రం ఏం చెబుతోందో? ఇప్పుడు తెలుసుకుందాం.
వాస్తు ప్రకారం, ఇంటి నిర్మాణం చేయడం వల్ల మీ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎల్లప్పుడూ ఉంటుంది లేకపోతే మీరు అనేక సమస్యలను ఎదుర్కోవల్సి రావచ్చు. మెట్ల కింద బాత్రూమ్ కట్టడం వాస్తుప్రకారం మీ ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది. ఎందుకంటే మెట్ల అంటేనే బరువు, అలాంటిది దాని కింద బాత్రూమ్ నిర్మించడం వల్ల మీపై అది ప్రతికూల ప్రభావాన్ని చూపిస్తుంది. మీ కుటుంబ సభ్యులు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంది. ఆర్థిక సమస్యలను ఎదుర్కోంటారు. మానసిక స్థితి సరిగ్గా ఉండదు. వైవాహిక జీవితంలో సమస్యలు వస్తాయి. కెరీర్ అంత బాగుండదు. వ్యాపారులు నష్టపోతారు.
పరిష్కారాలు
మీ ఇంట్లో మెట్ల కింద బాత్రూమ్ ఉంటే దాని యెుక్క ప్రతికూల ప్రభావాలను తగ్గించడానికి వాస్తు నిపుణులు కొన్ని చిట్కాలు చెప్పారు. బాత్రూమ్ ఎల్లప్పుడూ క్లీన్ గా ఉండేలా చూసుకోవాలి. వెంటిలేషన్ తోపాటు మంచి సువాసన ఇచ్చే ఎయిర్ ఫ్రెషనర్లను వాడండి. బాత్రూమ్ లో ఉప్పు ఉంచడం కూడా మంచి ఫలితాలను ఇస్తుంది. అంతేకాకుండా అద్దాలను సరైన దిశలో ఉంచడం ద్వారా నెగటివ్ ఎనర్జీని బయటకు పంపించవచ్చు. నీలం, ఆకుపచ్చ రంగులను కూడా ఉపయోగించడం వల్ల ప్రతికూల శక్తులు తగ్గుతాయి. అందుకే ఇంటి నిర్మాణం చేసేటప్పుడు వాస్తు నిపుణుడిని సంప్రదించండి.