Sunday, October 6, 2024
HomeతెలంగాణErrabelli: మన సంస్కృతి, సంప్రదాయాలకు సినిమాల్లో ప్రాధాన్యత

Errabelli: మన సంస్కృతి, సంప్రదాయాలకు సినిమాల్లో ప్రాధాన్యత

గువేరా ఫిల్మ్స్ కొత్త సినిమా షూటింగ్ ను ప్రారంభించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.. రాష్ట్రం వచ్చాకే సినిమా రంగంలో తెలంగాణ వాళ్ల ప్రాధాన్యం పెరిగిందని, తెలంగాణ నుంచి అనేక మంది కళాకారులు దర్శకులు, నిర్మాతలు ముందుకు వస్తూ తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే గొప్ప గొప్ప సినిమాలు నిర్మిస్తున్నారన్నారు. జనగామ జిల్లా పాలకుర్తి మండలం విసునూరు గ్రామంలో గువేరా ప్రొడక్షన్స్ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న సినిమా పూజ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. సినిమా షూటింగ్ ను ప్రారంభించారు.

- Advertisement -

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ సినిమా రంగంలో ఒకప్పుడు తెలంగాణ పాత్ర తక్కువగా ఉండేదని, తెలంగాణ వాళ్లు పరిమిత సంఖ్యలో పని చేసేవారని చెప్పారు.

సినిమా దర్శకుడు ఎస్ ఎస్ వర్మ, నిర్మాత శ్వేత అమర్ వాది, హీరో హీరోయిన్ లు డాక్టర్ విశ్వాస్,  దివ్య దత్తాత్రేయ, సంగీత దర్శకుడు  సురేష్ బొబ్బిలి, కెమెరా పవన్ గుంటుకు, పాటల రచయితలు గోరటి వెంకన్న, పూర్ణా చారి, శ్రీనివాస మౌళి, మనోహర్, నటీనటువర్గం సాంకేతిక నిపుణులు, తదితరులకు మంత్రి శుభాకాంక్షలు, అభినందనలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంత్రి వెంట స్థానిక ప్రజాప్రతినిధులు ఆ గ్రామ పుర ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News