Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభRashmika Mandanna: ‘కుబేర’ సక్సెస్‌లో రష్మిక గోల్డెన్ హ్యాండ్

Rashmika Mandanna: ‘కుబేర’ సక్సెస్‌లో రష్మిక గోల్డెన్ హ్యాండ్

Kubera: ఇప్పుడు టాలీవుడ్‌లో బిజీగా ఉన్న హీరోయిన్స్ ఎవ‌రు? అని అడిగితే ముందు గుర్తుకొచ్చే పేరు ర‌ష్మిక మంద‌న్న‌నే. హిట్ లిస్టులో వరుసగా తన పేరును నిలిపుకుంటూ, కెరీర్‌లో స్పెషల్ జోరుతో దూసుకుపోతోంది. ‘పుష్ప’, ‘యానిమ‌ల్’, ‘చావా’, ఇప్పుడు ‘కుబేర‌’ – ఒక్కొక్క‌టీ బ్లాక్‌బ‌స్ట‌ర్ చిత్రాలుగా నిలిచాయి. అయితేతాజాగా ఆమె నటించిన కుబేర కూడా ఈ లిస్టులో చేరింది. అయితే ‘కుబేర‌’ మాత్రం కాస్త ప్రత్యేకమనే చెప్పాలి. ఎందుకంటే ఇది రెగ్యుల‌ర్ కమర్షియ‌ల్ హీరోయిన్ పాత్ర కాదు. కథను న‌డిపించే కీల‌క‌మైన పాత్ర‌లో నటించింది.

- Advertisement -

కుబేర తరహాలో సినిమాలోని పాత్రల్ని ఎంచుకోవాలంటే కేవ‌లం గ్లామర్ మాత్రమే స‌రిపోదు, న‌మ్మ‌కం, ధైర్యం కూడా కావాలి. ఈ రెండు అంశాలు ర‌ష్మిక‌లో పుష్కలంగా ఉన్నాయి. ‘కుబేర‌’లో ఆమె క్యారెక్టర్ స్క్రీన్ టైమ్ పరంగా పెద్దదిగా లేకపోయినా, సినిమా మీద ప్రభావం మాత్రం గణనీయంగా ఉంది. ఈ మూవీకి వచ్చిన హిట్ టాక్‌తో పాటు, రష్మిక లక్ కూడా ఒక ప్లస్‌గా నిలిచింది. కుబేర సక్సెస్ మీట్‌లో చిరంజీవి, నాగార్జున, దేవిశ్రీప్రసాద్ వంటి స్టార్‌లు రష్మికపై ప్రశంసల వర్షం కురిపించడం చిన్న విషయం కాదు. చిరు, నాగ్ ఇద్దరూ “ర‌ష్మిక నా క్ర‌ష్‌” అంటూ సరదాగా పోటీ పడ‌డం ఆమె పాపులారిటీకి నిద‌ర్శ‌నం. నాగ్ అయితే ఆమెను శ్రీ‌దేవితో పోల్చటం గొప్ప కాంప్లిమెంట్.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/mega-brother-nagababu-comments-on-his-daughter-niharika-konidela-divorce/

ప్ర‌తి ఒక నిర్మాత‌, ద‌ర్శ‌కుడికి సహకారం అందిస్తూ, ఎలాంటి ఇబ్బందులు కలిగించకుండా తన పాత్రను పూర్తి నిబద్ధతతో చేయడం రష్మిక స్పెషాలిటీ. ‘కుబేర‌’ చిత్రంలో చెత్త‌తో నిండిన వాహనంలో ప్రయాణించడం, నెత్తిపై నుంచి చెత్త పొర్లించుకోవడం లాంటి సీన్లకు కూడా ఆమె ఎటువంటి అభ్యంతరం చూపకుండా నటించిందంటే, ఆమె ప్రొఫెషనలిజాన్ని గుర్తించాల్సిందే. అంతే కాదు – ఆమెపై తెరకెక్కించిన ఓ పాటను తుది కట్‌లో తీసేయగానే కూడా అసహనం వ్యక్తం చేయలేదు. ఇవే ఆమెను దర్శకుల ఫేవరెట్‌గా నిలిపాయి.

రష్మికకు వస్తోన్న ఈ ప్రశంసలన్నీ కేవలం లక్‌తో వచ్చినవేం కావు. ర‌ష్మిక ఏ క‌థ ఎంచుకోవాలి? ఎవ‌రితో ప‌ని చేయాలి? అన్న విష‌యంలో స్పష్ట‌తతో, శ్రద్ధతో నిర్ణయాలు తీసుకుంటోంది. పారితోషికం ఎక్కువ ఇస్తే ఒప్పుకునే ఓపిక లేని వృద్ధి ఆమె వద్ద లేదు. అందుకే ఈ స్థాయికి ఎదిగింది. డెడికేషన్ ఉన్నా, ప‌ర్‌ఫార్మెన్స్‌తో మెప్పించగలిగే న‌టి స‌మ‌యంలోనే టాప్ రేంజ్‌కి వెళ్ల‌గ‌ల‌దు. ర‌ష్మిక అలాంటి రేర్‌ ఎగ్జాంపుల్‌. ‘కుబేర‌’ విజయంతో ఆమె స్థానం మరింత బలపడింది. ఇక ముందు ఆమె చేస్తోన్న సినిమాలు మరింత భారీ అంచనాలతో ప్రారంభం కానున్నాయి. రష్మిక మాత్రం ఇవన్నీ పక్కన పెట్టి, తన దారిలో తనేం చేయాలో చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతోంది. అందుకే ఈ ‘నేషనల్ క్రష్‌’ ఇప్పుడు ఇండస్ట్రీ క్రష్‌ అయింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News