Monday, June 23, 2025
Homeచిత్ర ప్రభRashmika Mandanna: రష్మికను పొగడటంలో పోటీ పడ్డ చిరు నాగ్ ..కామెంట్స్ వైరల్

Rashmika Mandanna: రష్మికను పొగడటంలో పోటీ పడ్డ చిరు నాగ్ ..కామెంట్స్ వైరల్

Megastar Chiranjeevi – Nagarjuna Akkineni: శేఖర్ కమ్ముల దర్శకత్వంలో రూపొందిన కుబేర సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. ధనుష్, రష్మిక మందన ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రంలో కింగ్ నాగార్జున కీలక పాత్ర పోషించిన సంగతి తెలిసిందే దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందించిన ఈ చిత్రం విజయం సాధించిన నేపథ్యంలో చిత్ర యూనిట్ గ్రాండ్ సక్సెస్ సెలబ్రేషన్ ఈవెంట్‌ను నిర్వహించింది. ఈ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరై హంగామా చేశారు. ఈ సందర్భంగా చిరంజీవి, నాగార్జున ఇద్దరూ.. హీరోయిన్ రష్మిక మందనపై చేసిన కామెంట్స్ ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

- Advertisement -

కుబేర సక్సెస్ మీట్‌లో నాగార్జున మాట్లాడుతూ దీపక్ వంటి పాత్ర ఇచ్చిన శేఖర్ కమ్ములకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేశారు. ‘నా పాత్రను ఎలా చేశానా? అనే డౌట్ ఉండేది. అయితే ధనుష్, రష్మిక సహా చాలా మంది తన పాత్ర గురించి పోన్ చేసి చెబుతుంటే చాలా సంతోషమేసింది. బాగా చేశానని నమ్మాను. ఆ క్రెడిట్ అంతా శేఖర్ కమ్ములకే చెందుతుంది. రష్మిక గురించి చెప్పాలంటే తనని అందరూ నేషనల్ క్రష్ అంటుంటారు. కానీ నేషనల్ క్రష్ మాత్రమే కాదు.. నా క్రష్ కూడా. తనను ఈ సినిమాలో చూసేటప్పుడు క్షణక్షణంలో శ్రీదేవిలో కనిపించావ్’ అంటూ రష్మికపై నాగ్ ప్రశంసల వర్షం కురిపించారు.

ALSO READ:https://teluguprabha.net/cinema-news/rashmika-mandanna-received-another-success-with-kubera/

ఆ తరువాత మెగాస్టార్ చిరంజీవి మాటలు ఇంకొంత హైలైట్ అయ్యాయి. ‘నాగ్, నువ్వు చెప్పింది నేను చెప్పాలనుకున్నదే. కానీ అయినా నేను నా మాట చెప్పకుండా ఉండలేను. రష్మిక, నువ్వు నేషనల్ క్రష్ మాత్రమే కాదు, నా క్రష్ కూడా! నీ మొదటి సినిమా ఈవెంట్‌కి కూడా నేను గెస్ట్‌గా వచ్చినప్పుడు గుర్తుందా? అప్పటి నుంచి నీ అభినయం చూస్తున్నా. సినిమా సినిమాకు ఆమె ఇమేజ్ పెరుగుతోంది. ఇందులో నీ లవర్ చేతిలో మోసపోయిన సీన్‌లో చూసినప్పుడు నాకు చూడాలని ఉంది సినిమాలో సౌందర్యలా అనిపించావ్. మరో సీన్‌లో బిడ్డని చేతిలో పట్టుకుని భావోద్వేగంగా నటించింది. తను కళ్లు మాట్లాడతాయ్ .. నువ్వు నేషనల్ క్రష్ కాదు.. నువ్వు ఇంటర్నేషనల్ క్రష్’ అని తెలిపారు.

ఇలా ఓ వేదికపై ఇద్దరు సీనియర్ స్టార్ హీరోల నుంచి ఇలా ప్రత్యేకమైన ప్రశంసలు రావడం రష్మికకు మరింత ప్రత్యేకంగా మారింది. ఆమె ఆనందాన్ని మాటల్లో చెప్పలేనంతగా వ్యక్తం చేసింది. సినిమా తొలి ఆట నుంచి పాజిటివ్ జబ్‌తో బాక్సాఫీస్ కలెక్షన్స్‌ను రాబడుతోంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News