Tuesday, June 24, 2025
Homeలైఫ్ స్టైల్Calcium: కాల్షియం లోపాన్ని తగ్గించాలంటే ఈ డ్రింక్స్ తాగండి..

Calcium: కాల్షియం లోపాన్ని తగ్గించాలంటే ఈ డ్రింక్స్ తాగండి..

Calcium Drinks: చాలా మందికి పాలు తాగడం ఇష్టం ఉండదు. లాక్టోస్ అసహనం కారణంగా పాలు తాగలేరు. అయితే, ఆ వ్యక్తులు కాల్షియం లోపం బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పాలు కాల్షియం ఉత్తమ వనరులలో ఒకటి. ఎముకలు, దంతాల బలానికి అవసరమైన కాల్షియం చాలా ముఖ్యమైన ఖనిజం. ఇటువంటి పరిస్థితిలో కాల్షియం లోపం వల్ల ఎముకల నొప్పి లేదా ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలు తీసుకోవాలి. అయితే, పాలు తాగడం ఇష్టంలేని వారికి శరీరంలోని కాల్షియం లోపాన్ని తీర్చడంలో సహాయపడే కొన్ని డ్రింక్స్ గురుంచి ఇక్కడ తెలుసుకుందాం.


సోయా పాలు

సోయా పాలు పాలకు గొప్ప ప్రత్యామ్నాయం. ముఖ్యంగా లాక్టోస్ అసహనం ఉన్నవారు దీని తీసుకోవచ్చు. సోయా పాలలో సహజంగా కాల్షియం ఉంటుంది. ఒక కప్పు సోయా పాలలో దాదాపు 300mg కాల్షియం ఉంటుంది. ఇది పాలతో సమానంగా ఉంటుంది. దీనితో పాటు ఇది ప్రోటీన్‌తో సమృద్ధిగా ఉంటుంది. ఈ డ్రింక్ గుండె ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుంది.

బాదం పాలు

బాదం పాలులో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. సహజ బాదం పాలలో కాల్షియం తక్కువగా ఉన్నప్పటికీ, మార్కెట్లో లభించే ఫోర్టిఫైడ్ బాదం పాలలో ప్రతి కప్పులో 450mg వరకు కాల్షియం ఉంటుంది. దీనిని తాగడం వల్ల శరీరానికి విటమిన్-E, ఆరోగ్యకరమైన కొవ్వులు లభిస్తాయి. ఇందులో కేలరీలు కూడా తక్కువగా ఉంటాయి. గుండెకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది.

ఆరెంజ్ జ్యూస్

ఆరెంజ్ జ్యూస్ విటమిన్-సి మంచి మూలం. కానీ, కాల్షియం-ఫోర్టిఫైడ్ ఆరెంజ్ జ్యూస్ ప్రతి కప్పులో 350mg వరకు కాల్షియం కలిగి ఉంటుంది. ఇది రోజువారీ కాల్షియం అవసరాన్ని తీర్చడంలో సహాయపడుతుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది. యాంటీఆక్సిడెంట్లతో సమృద్ధిగా ఉంటుంది. జీర్ణక్రియకు కూడా ప్రయోజనకరంగా ఉంటుంది.

మజ్జిగ

మజ్జిగ లేదా లస్సీ అనేది పెరుగుతో తయారు చేసిన పానీయం. కావున ఇందులో ఇందులో కాల్షియం అలాగే ప్రోబయోటిక్స్ ఉంటాయి. ఇది జీర్ణవ్యవస్థకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఒక కప్పు మజ్జిగలో దాదాపు 300mg కాల్షియం ఉంటుంది. ఇది జీర్ణక్రియకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్‌ శరీరాన్ని చల్లబరుస్తుంది.

నువ్వుల పాలు

నువ్వులు కాల్షియం అద్భుతమైన మూలం. నువ్వుల పాలను ఇంట్లో సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ డ్రింక్ కాల్షియం లోపాన్ని అధిగమించడంలో సహాయపడుతుంది. ఒక కప్పు నువ్వుల పాలలో దాదాపు 200-300mg కాల్షియం ఉంటుంది. దీనితో పాటు ఇందులో మెగ్నీషియం, జింక్ కూడా పుష్కలంగా ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News