Tuesday, June 24, 2025
Homeచిత్ర ప్రభVijay Antony: పాపం విజయ్ ఆంటోని.. కబ్జా చేసేస్తున్నారు

Vijay Antony: పాపం విజయ్ ఆంటోని.. కబ్జా చేసేస్తున్నారు

Bichagadu: మాస్, క్లాస్, కామెడీ, హర్రర్, ఫ్యాక్షన్..ఇలా ఒక బ్యాక్‌డ్రాప్ లో సినిమాలు చేస్తూ దర్శకులు, హీరోలు సక్సెస్‌లు అందుకుంటుంటారు. కొంతమంది హీరోలకి ఒకే రకమైన జోనర్ సినిమాలు స్టార్ డమ్‌ని తీసుకొస్తుంటాయి. అందుకే, మన సౌత్ హీరోలలో చాలామంది గిరి గీసుకొని ఆ తరహా సినిమాలనే చేస్తుంటారు. అలాంటి స్టోరీస్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డులు సృష్టిస్తూ కాసుల వ‌ర్షం కురిపిస్తుంటాయి. దాంతో మిగ‌తా హీరోలు కూడా అదే త‌ర‌హా కాన్సెప్ట్‌తో సినిమా చేయాల‌ని ఆరాటపడుతుంటారు.

- Advertisement -

ప్రస్తుతం ఇండస్ట్రీలో ఇదే జ‌రుగుతోంది. అయితే ఈ విష‌యంలో విజ‌య్ ఆంటోనీ కాన్సెప్ట్‌ని ఇలా క‌బ్జా చేసేస్తే ఎలా అని ప్రేక్షకులు మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ అసలు విషయం ఏంటంటే మ్యూజిక్ డైరెక్ట‌ర్‌గా మంచి గుర్తింపుని తెచ్చుకున్న విజ‌య్ ఆంటోని ఆ త‌రువాత ‘నాన్‌’ మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చారు. ఒక డిఫ‌రెంట్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ సినిమాను ప్రేక్ష‌కులు బాగా ఆదరించారు. దాంతో విజ‌య్ ఆంటోనీ హీరోగా కంటిన్యూ అవుతూ వస్తున్నారు. ఈ క్రమంలోనే ఆయనకి సౌత్‌లో మంచి గుర్తింపుని తెచ్చింది బిచ్చ‌గాడు సినిమా.

2016లో విడుద‌లైన ఈ చిత్రం త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుదలై సంచ‌ల‌న విజయాన్ని అందుకుంది. తెలుగు రైట్స్ కొన్న నిర్మాతకి కాసుల వర్షం కురిపించింది బిచ్చగాడు. త‌ల్లి ఆరోగ్యం కోసం బిచ్చ‌గాడిగా మారే కోటీశ్వ‌రుడి క‌థ‌గా పూర్తి వెరైటీ కాన్సెప్ట్‌తో రూపొందిన ఈ సినిమా రెండు భాష‌ల్లోనూ రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టడం అప్పట్లో ఓ హాట్ టాపిక్ అయింది. హీరోగా విజ‌య్ ఆంటోనీకి తిరుగులేని గుర్తింపు వచ్చింది.

ALSO READ:https://teluguprabha.net/cinema-news/dhanush-nagarjuna-and-rashmika-movie-kubera-3-days-ww-collections/

అయితే, దాదాపు ఏడేళ్ల సుదీర్గ విరామం తర్వాత విజ‌య్ ఆంటోనీ మ‌ళ్లీ త‌న‌కు క‌లిసొచ్చిన బిచ్చ‌గాడు కాన్సెప్ట్ ని తీసుకుని సీక్వెల్ గా బిచ్చ‌గాడు 2 చేశారు. ఈ సినిమాకి ఆయనే స్వ‌యంగా ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ సీక్వెల్ మూవీ కూడా సూపర్ హిట్ కావ‌డంతో అందరూ ఇప్పుడు బిచ్చ‌గాడు 3 కోసం ఎదురు చూస్తున్నారు. అయితే ఈ బిచ్చ‌గాడు కాన్సెప్ట్‌ని కొందరు ద‌ర్శ‌కులు కాపీ చేస్తున్నారు. తాజాగా ధ‌నుష్, నాగార్జున, రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో దర్శకుడు శేఖ‌ర్ క‌మ్ముల తెర‌కెక్కించిన సినిమా కుబేర‌. బిచ్చ‌గాడు కాన్సెప్ట్‌తోనే వచ్చిన ఈ సినిమా జూన్ 20న విడుద‌లై హిట్ టాక్‌ని తెచ్చుకుంది. ఈ సినిమాలో ధనుష్ పాత్ర కూడా బిచ్చగాడు.

త్వరలో సెట్స్‌పైకి రాబోతున్న పూరి జగన్నాధ్, విజయ్ సేతుపతిల సినిమా కూడా ఇదే పాయింట్‌తో రాబోతుంది. ఆల్రెడీ బెగ్గర్ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. దాంతో విజయ్ ఆంటోనీ సక్సెస్ అందుకుంటున్న బిచ్చగాడు పాయింట్ ని అందరూ వాడేస్తున్నారని ఆయన అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. మరి, విజయ్ నెక్స్ట్ సినిమాకి కాన్స్పెట్ మార్చుకుంటారా..లేక ఇదే పాయింట్‌తో డిఫరెంట్ కథా, కథనాలతో వస్తారా అనేది వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News