Saturn And Moon Conjunction 2025: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం, గ్రహాల గమనంలోని మార్పులు మెుత్తం 12 రాశిచక్రాల వారి జీవితాలను ప్రభావితం చేస్తుంది. అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. హిందువులు శనిదేవుడు అంటే భయపడతారు. ఎందుకంటే అతని దృష్టి వల్ల చెడు జరుగుతుందమోనని వారి భయం. కానీ శనీశ్వరుడు మనం చేసే కర్మలను బట్టి ఫలితాలను ఇస్తాడు. మంచి పనులు చేస్తే శుభఫలితాలను, చెడు పనులు చేస్తే కఠినంగా శిక్షించడం చేస్తాడు. మరోవైపు భూమికి ఒకే ఒక్క ఉపగ్రహం చంద్రుడు. ఇతడిని మానసిక ప్రశాంతతకు సూచికగా భావిస్తూ ఉంటారు. అలాంటి ఈ రెండు గ్రహాలు జూన్ 18న మీనరాశిలో కలుసుకున్నాయి. శని చంద్రగ్రహాల కలయిక ఏయే రాశుల వారికి అనుకూలంగా ఉంటుందో ఓసారి తెలుసుకుందాం.
తులా రాశి
చంద్రుడు-శనిదేవుడు మైత్రి తులారాశి వారి కష్టాలను తొలగిస్తుంది. కెరీర్ అద్భుతంగా ఉండబోతుంది. అప్పుల ఊబి నుండి బయటపడతారు. మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. మీపై ఎల్లప్పుడూ లక్ష్మీదేవి కాసుల వర్షం కురిపిస్తుంది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. మీరు మంచి పొజిషన్ కు చేరుకుంటారు. మీరు ఏ రంగంలో అడుగుపెడితే అందులో రాణిస్తారు. వైవాహిక జీవితంలోని సమస్యలన్నీ తొలగిపోతాయి.
వృషభరాశి
శని, చంద్రుల కలయిక వృషభరాశి వారి అదృష్టాన్ని మార్చబోతుంది. వీరికి ధనప్రాప్తి కలుగుతుంది. వ్యాపారం వృద్ధి చెందుతుంది. మునుపెన్నడూ లేని లాభాలను చూస్తారు. ఉద్యోగులకు జీతం పెరగడంతోపాటు ప్రమోషన్ కు అవకాశాలు ఉన్నాయి. పెళ్లికాని యువతీయువకులకు వివాహం కుదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రభుత్వం ఉద్యోగం రావచ్చు. కుటుంబ సమస్యలన్నీ తొలగిపోతాయి.
మిథునరాశి
మిథున రాశి వారికి శని చంద్రుల సంయోగం లాభిస్తుంది. వీరు భారీగా ఆస్తులు కూడబెడతారు. పిల్లలు లేని దంపతులకు సంతానప్రాప్తి కలుగుతుంది. నిరుద్యోగులకు జాబ్ దొరుకుతుంది. అనారోగ్యం నుండి బయటపడతారు. కుటుంబ సభ్యుల మధ్య ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయి. చదువు కోసం విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. బిజినెస్ లో భారీగా లాభాలను పొందుతారు. పేదరికం నుంచి విముక్తి కలుగుతుంది. ఎమ్ఎన్సీ కంపెనీలు నుంచి ఆఫర్స్ వచ్చే అవకాశం ఉంది.