Tuesday, June 24, 2025
Homeచిత్ర ప్రభCoolie: ‘కూలీ’ తెలుగు రైట్స్ ఎవరివంటే..!

Coolie: ‘కూలీ’ తెలుగు రైట్స్ ఎవరివంటే..!

Rajinikanth – Lokesh Kanagaraj: కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ టైటిల్ పాత్రలో యంగ్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘కూలీ’. ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రంలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, ఉపేంద్ర, సాబిన్ షాహిర్, సత్యరాజ్, శ్రుతి హాసన్, రెబా మోనికా జాన్ వంటి ప్రముఖ తారాగణం కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ముఖ్యంగా కింగ్ నాగార్జున తొలిసారి పూర్తి స్థాయి విల‌న్ పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నారు. కళానిధి మారన్ సారథ్యంలోని సన్ పిక్చర్స్ బ్యానర్ పై భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ‘కూలీ’ షూటింగ్ ఇప్పటికే పూర్తైంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని ఆగస్టు 14వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

- Advertisement -

రజినీకాంత్, లోకేష్ కనకరాజ్ వంటి క్రేజీ కాంబోలో రాబోతున్న సినిమా కావటంతో సినిమా ఎక్స్‌పెక్టేష‌న్స్ పీక్స్‌లో ఉన్నాయి. పాన్ ఇండియా రేంజ్‌లో గ్రాండ్‌గా మూవీని రిలీజ్ చేయ‌బోతున్నారు. ఈ మూవీ తెలుగు థియేట్రికల్ హక్కులపై సినీ వర్గాల్లో కొద్ది రోజులుగా పెద్ద చ‌ర్చే జ‌రుగుతోంది. సినిమా హక్కుల కోసం రూ. 40-45 కోట్ల డీల్ ఉన్న‌ట్లు వార్తలు వచ్చాయి. త‌మిళ సినిమా తెలుగు హ‌క్కుల‌కు ఈ రేంజ్ డిమాండ్ ఉందంటే సినిమాపై ఉన్న అంచ‌నాలెలా ఉన్నాయో అర్థం చేసుకోవ‌చ్చు. ఇటీవ‌ల అన్నపూర్ణ స్టూడియోస్ తరపున నాగార్జున కూలీ హక్కులను కొనుగోలు చేశారనే వార్త‌లైతే వినిపించాయి. అయితే అది నిజం కాదని సినీ స‌ర్కిల్స్ అంటున్నాయి. కూలీ మూవీ తెలుగు హక్కుల కోసం అన్నపూర్ణ స్టూడియోస్, మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్, దిల్ రాజు, ఏషియ‌న్‌ సునీల్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌ వంటి ప్రముఖ సంస్థలు పోటీపడిడ్డాయి.

ALSO READ: https://teluguprabha.net/cinema-news/producer-dilraju-open-comments-on-game-changer-flop/

లేటెస్ట్ న్యూస్ ప్ర‌కారం ఏషియ‌న్ సునీల్ కూలీ తెలుగు థియేట్రికల్ హక్కులను ఫ్యాన్సీ ఆఫర్‌కు ఆయన సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఇది వ‌ర‌కు సునీల్ నారంగ్.. రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ ‘జైలర్’ను కూడా తెలుగులో డిస్ట్రిబ్యూట్ చేసి భారీ లాభాల‌ను సంపాదించుకున్నారు. ఇప్పుడు ‘కూలీ’ సినిమాకు సంబంధించి సన్ పిక్చర్స్ సంస్థతో డీల్ కుదిరినట్లు సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. తెలుగు రైట్స్ కోసం ఇంత భారీ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయ‌టం మామూలు విష‌యం కాదు. మ‌రి ఈ క్రేజ్‌ను క్యాష్ చేసుకుని కూలీ మూవీ తెలుగులో ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో, ఎలాంటి రికార్డులను సృష్టిస్తుందో వేచి చూడాలి.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News