Saturday, September 21, 2024
HomeదైవంSrisailam: ఘనంగా సర్కారీ పల్లకీ సేవ

Srisailam: ఘనంగా సర్కారీ పల్లకీ సేవ

శ్రీశైల దేవస్థానంలో లోక కళ్యాణం కోసం శ్రీ స్వామి అమ్మవార్లకు పల్లకి ఉత్సవాన్ని నిర్వహించింది. ఈ పల్లకి ఉత్సవం ప్రతి ఆదివారం, పౌర్ణమి, మూల నక్షత్రం రోజులలో సర్కారీ సేవగా నిర్వహిస్తారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో ముందుగా లోక కళ్యాణాన్ని కాంక్షిస్తూ అర్చక స్వాములు సేవా సంకల్పాన్ని పఠించారు. తర్వాత కార్యక్రమం నిర్విఘ్నంగా జరగాలని మహాగణపతి పూజ చేశారు. అనంతరం శ్రీ స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులను పల్లకిలో కూర్చోబెట్టి శాస్త్రోక్తంగా షోడశోపచార పూజలు చేశారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News