Wednesday, June 25, 2025
Homeటెక్నాలజీPoco F7 5G : భారీ బ్యాటరీతో పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది..

Poco F7 5G : భారీ బ్యాటరీతో పోకో F7 5G స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది..

Poco F7 5G Launch : తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు అందించే ఫోన్ల మార్కెట్‌లో ఫోకో సంస్థ మరోసారి సంచలనం సృష్టించింది. ఈ సరికొత్త చైనా స్మార్ట్‌ఫోన్ తయారీదారు పోకో మంగళవారం (జూన్ 24) తన కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ ఫోకో F7 5జిని లాంచే చేసింది. ఈ ఫోన్‌ను భారత మార్కెట్లో ఫ్లిప్‌కార్ట్ ద్వారా విక్రయించనున్నారు. ప్రీమియం సెగ్మెంట్‌లో విడుదలైన ఈ ఫోన్ అత్యాధునిక ఫీచర్లతో ఆకట్టుకుంటోంది.

- Advertisement -

డిస్‌ప్లే & డిజైన్

ఫోకో F7 5G లో 6.83 అంగుళాల 1.5Kp OLED డిస్‌ప్లే ఉంది. ఇది 120Hz డైనమిక్ రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. అంటే స్క్రీన్ కంటెంట్ కు అనుగుణంగా రిఫ్రెష్ రేట్ మారుతుంది. ఈ డిస్‌ప్లే అత్యధికంగా 3,200 నిట్స్ బ్రైట్‌నెస్ అందిస్తుంది. దీని వల్ల ఎండలోనూ స్క్రీన్ స్పష్టంగా కనిపిస్తూ వినియోగదారుడికి ఇబ్బంది లేకుండా చేస్తుంది. స్క్రీన్‌ను కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 7ఐ ప్రొటెక్షన్ తో తీసుకొచ్చారు, ఇది మరింత దృఢంగా ఉంటుంది.

బ్యాటరీ & ఛార్జింగ్

ఈ స్మార్ట్‌ఫోన్‌లో 7,550 mAh భారీ బ్యాటరీ ఉంది. ఇది చాలా సమయం మనకు చార్జింగ్ అవసరాన్ని లేకుండా చేస్తుంది. దీనికి 90W ఫాస్ట్ ఛార్జర్ బాక్స్‌లోనే అందించబడుతుంది. దీంతో ఫోన్‌ను వేగంగా చార్జ్ చేసుకోవచ్చు. అదనంగా ఈ ఫోన్ 22.5W రివర్స్ ఛార్జింగ్ ఫీచర్‌ను కూడా సపోర్ట్ చేస్తుంది, అంటే ఈ ఫోన్‌ను పవర్ బ్యాంక్‌లా వాడి ఇతర పరికరాలను ఛార్జ్ చేయవచ్చు.

ప్రాసెసర్ & స్టోరేజ్

పోకో F7 5G అత్యంత శక్తివంతమైన స్నాప్ డ్రాగన్ 8ఎస్ జెన్4 ప్రాసెసర్‌ కల్గివుంది, దీని ద్వారానే ఫంక్షన్లను నిర్వహిస్తుంది. ఇది ప్రీమియం లెవెల్ పనితీరు కోసం డిజైన్ చేశారు. దీని తోపాటు 12జిబి ఎల్పిడిడిఆర్5ఎక్స్ ర్యామ్, 512జిబి వరకు యుఎఫ్ఎస్ 4.1 స్టోరేజ్ కూడా ఈ కంపెనీ అందిస్తోంది. HyperOS ఇంటర్‌ఫేస్ స్మూత్ మరియు వినియోగదారుని అనుభవాన్ని మెరుగుపరచే విధంగా డిజైన్ చేశారు.

కెమెరా ఫీచర్లు

ఫొటోగ్రఫీ ప్రియుల అవసరాలకు అనుగుణంగా Poco F7 5G లో 50MP ప్రైమరీ కెమెరా కూడా పొందుపర్చారు. దీని తో పాటు 8MP అల్ట్రా వైడ్ కెమెరా కూడా ఉంటుంది. సెల్ఫీ ప్రియుల కోసం 20MP ఫ్రంట్ కెమెరా ఉంటుంది. కెమెరా ఫీచర్లు డే లైట్ మరియు లో లైట్ ఫోటోగ్రఫీ కోసం అనుకూలంగా ఉంటాయి.

ధర & రంగులు

పోకో F7 5G మూడు రంగులలో అందుబాటులో ఉంది. సైబర్ సిల్వర్, ఫ్రోస్ట్ వైట్, ఫ్యాంటమ్ బ్లాక్లో లభిస్తుంది.

ధర వివరాలు ఇలా..

  • 12GB + 256GB వేరియంట్: రూ.35,999
  • 12GB + 512GB వేరియంట్: రూ.37,999

ఈ ఫోన్ కొనాలంటే మాత్రం వచ్చే నెల వరకు ఆగాల్సిందే. ఇది జూలై 1 నుంచి ఫ్లిప్‌కార్ట్‌ వెబ్ సైట్లో విక్రయానికి అందుబాటులో ఉంటుంది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News