Wednesday, June 25, 2025
Homeచిత్ర ప్రభMahavatar: ఏడు సినిమాలతో 'మహావతార్ సినిమాటిక్ యూనివర్స్'

Mahavatar: ఏడు సినిమాలతో ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’

Mahavatar Cinematic Universe Unveiled: ఇటీవల సినిమాటిక్ యూనివర్సిటీలో సినిమాలు తీయడం కామన్ అయిపోయిన సంగతి తెలిసిందే. తమిళ దర్శకుడు లోకేశ్ కనగరాజన్ ఈ సినిమాటిక్ యూనివర్సిటీకి శ్రీకారం చుట్టాడు. డ్రగ్స్ గ్యాంగ్ నేపథ్యంలో ఆయన ఈ సినిమాటిక్ యూనివర్సిటీలో భాగంగా ఖైదీ, విక్రమ్, లియో సినిమాలు ఇప్పటికే తీశాడు. త్వరలోనే వీటికి కొనసాగింపుగా ఖైదీ 2 సినిమా తీయనున్నాడు. అంటే ఈ సినిమాలన్ని ఒకే పాయింట్ తో వేరే వేరు అంశాల ఆధారంగా ఉంటాయి.

ఈ సినిమాలకు ప్రజల నుంచి ఆదరణ లభించడంతో ఇలాంటి సినిమాటిక్ యూనివర్సిటీలకు ఆదరణ పెరుగుతోంది. తెలుగులోనూ ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్సిటీలో వరుసగా భారత ఇతివృత్తాల ఆధారంగా సూపర్ హీరోల సినిమాలు తీయనున్నట్లు ప్రకటించిన విషయం విధితమే. ఈ క్రమంలోనే హనుమాన్ చిత్రం రిలీజై సూపర్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం జై హనుమాన్ మూవీ తెరకెక్కిస్తున్నాడు. అలాగే మహాకాళి అనే మూవీని నిర్మిస్తున్నాడు. ఇక హిందీలోనూ యశ్ రాజ్ ఫిల్మ్స్ సినిమాటిక్ యూనివర్సిటీ కింద సినిమాలు తెరెక్కుతున్నాయి. ఇందులో భాగంగా వార్, పఠాన్, వార్ 2 సినిమాలు తెరకెక్కాయి.

తాజాగా కన్నడ చిత్ర పరిశ్రమ నుంచి ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ ‘మహావతార్ సినిమాటిక్ యూనివర్స్’లో భాగంగా ఏడు సినిమాలను తీయనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా ఆ సినిమాల పేర్లు, ఎప్పుడు విడుదల చేస్తామో కూడా తెలిపింది. ఇప్పటికే అశ్విన్కుమార్ దర్శకత్వంలో ‘మహావతార్: నరసింహ’ సినిమాను రూపొందిస్తుంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం జులై 25, 2025న విడుదల కానుంది. దీంతో మరో ఆరు సినిమాలను అనౌన్స్ చేసింది. 12 సంవత్సరాల్లో 10 అవతారాలపై సినిమాలు తీస్తున్నట్లు పేర్కొంది.

- Advertisement -

మహావతార్: పరశురామ్ (2027), మహావతార్: రఘునందన్ (2029), మహావతార్: ద్వారకాదీశ్ (2031), మహావతార్: గోకులానంద్ (2033), మహావతార్: కల్కి 1 (2035), మహావతార్: కల్కి 2 (2037) చిత్రాలను తెరకెక్కించనున్నట్లు చెప్పుకొచ్చింది. విష్ణుమూర్తి దశావతారాలపై సినిమాలను తెరకెక్కిస్తున్నందుకు ఆనందంగా ఉన్నట్లు నిర్మాణ సంస్థ తెలిపింది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని వెల్లడించింది.

కాగా హోంబలే బ్యానర్ మీద ఇప్పటికే విజయవంతమైన ‘కేజీఎఫ్’, ‘కేజీఎఫ్ 2’, ‘కాంతార’, ‘సలార్’ సినిమాలు విడుదలై ప్రేక్షకులను అలరించాయి. కాంతార, సలార్ సినిమాలకు సీక్వెల్, ప్రీక్వెల్ మూవీలు నిర్మిస్తున్న విషయం విధితమే.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News