Gopichand Malineni: వరుస విజయాలతో దూసుకెళ్తోన్న బాలకృష్ణ ఈ ఏడాది దసరా సందర్భంగా అఖండ2తో సందడి చేయబోతున్న సంగతి తెలిసిందే. తర్వాత సినిమాను కూడా సెట్స్ పైకి తీసుకెళ్లటానికి బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసాడు. అయితే ఈ నందమూరి హీరో సినిమాలను ఎంపిక ప్యాట్రన్‌ను గమనిస్తే ఓ ఆసక్తికరమైన విషయం మనకు తెలుస్తుంది. అదేంటనే వివరాల్లోకెళ్తే… ఈ ఏడాది డాకు మహారాజ్ అంటూ బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్స్ కొల్లగొట్టారు నందమూరి బాలకృష్ణ. ఇప్పుడు అఖండ2 మూవీని పూర్తి చేసే పనిలో ఉన్నారు. దసరాకు అఖండ2 రిలీజ్ కావాల్సి ఉంది. బాలయ్య కెరీర్లోకే భారీ బడ్జెట్‌తో దీన్ని రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. బాలయ్య, బోయపాటి కాంబోలో రాబోతోన్న నాలుగో సినిమా ఇది. దీనిపై భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అఖండ చిత్రానికి కొనసాగింపుగా అఖండ2 రానుంది. రీసెంట్గా విడుదలైన టీజర్ ఈ మూవీపై ఉన్న అంచనాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లాయి.
బాలకృష్ణ హిట్ అవసరం అయిన సమయంలో సింహా వంటి బ్లాక్ బస్టర్ అందించిన బోయపాటి శ్రీను.. తనపై అభిమానులు పెట్టుకున్న నమ్మకాన్ని ప్రతీసారి ప్రూవ్ చేసుుకుంటున్నారు. అందులో భాగంగానే లెజెండ్, అఖండ చిత్రాలతోనూ తిరుగులేని సక్సెస్ చిత్రాలను అందించారు. వీరి కాంబోలో నాలుగో సినిమా రావటానికి ఎక్కువ సమయం పట్టలేదు. అఖండ2 మూవీ సెప్టెంబర్ 25న రిలీజ్ కానుంది. ప్రగ్యా జైశ్వాల్‌తో పాటు సంయుక్తా మీనన్ కూడా రెండో భాగంలో కథానాయికగా కనిపించనుంది. ఈసారి అఖండ2తో బాలయ్య ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తాడనేది అందరిలోనూ ఆసక్తిని రేపుతోన్న అంశం.
ALSO READ: https://teluguprabha.net/cinema-news/ntr-is-dominating-prabhas-in-dragon-movie/
అఖండ తర్వాత బాలకృష్ణ గోపీచంద్ మలినేనితో వీర సింహారెడ్డి సినిమాను చేశాడు.ఫ్యాక్షన్స్ బ్యాక్ డ్రాప్‌తో పాటు సిస్టర్ సెంటిమెంట్‌ను యాడ్ చేసి బాలయ్యతో చేసిన వీర సింహారెడ్డి కూడా హిట్ కావటమే కాకుండా వంద కోట్ల క్లబ్‌ను టచ్ చేసింది. తర్వాత బాలయ్య భగవంత్ కేసరి, డాకు మహారాజ్ సినిమాలు చేశారు. ఈ రెండు సినిమాలు హిట్ మూవీస్‌గా నిలిచాయి. ఇప్పుడు బాలకృష్ణ అఖండ2 సినిమా సెట్స్ పై ఉండగానే గోపీచంద్ మలినేని సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈసారి బాలయ్యను గోపీచంద్ ఎలా చూపించబోతున్నాడనేది అందరిలోనూ క్యూరియాసిటీని పెంచుతోంది.
బాలయ్య గతంలో బోయపాటితో అఖండ చేసిన తర్వాత గోపీచంద్ మలినేనితో వీరసింహా రెడ్డి చేసి హిట్ కొట్టాడు. ఇప్పుడు అదే బోయపాటితో అఖండ2 చేస్తున్నారు. నెక్ట్స్ మూవీని గోపీచంద్ మలినేనితోనే చేస్తున్నారు. డైరెక్టర్స్‌ని రిపీట్ చేయటం అనేది సాధారణమైన విషయమే. అయితే ఓ ఆర్డర్లో బాలయ్య డైరెక్టర్స్‌ను రిపీట్ చేస్తున్నారు మరి. ఈసారి బాలకృష్ణను గోపీచంద్ మలినేని ఎలాంటి పవర్ఫుల్ రోల్లో చూపించబోతాడో తెలియాలంటే మరి కొన్నాళ్లు ఆగాల్సిందే మరి.