Thursday, June 26, 2025
Homeచిత్ర ప్రభKuberaa: ఆఫీషియల్.. రూ.100 కోట్ల క్లబ్ లోకి కుబేర

Kuberaa: ఆఫీషియల్.. రూ.100 కోట్ల క్లబ్ లోకి కుబేర

Kuberaa Movie collections: తమిళ స్టార్ హీరో ధనుష్ హీరోగా కింగ్ నాగార్జున కీలక పాత్రలో నటించిన చిత్రం ‘కుబేర’. జూన్ 20న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంతో పాటు ధనుష్, నాగార్జున నటన సినిమాను ప్రేక్షకులకు బాగా కనెక్ట్ చేసింది. ముఖ్యంగా బిచ్చగాడి పాత్రలో ధనుష్ నటనకు అందరూ ఫిదా అయిపోతున్నారు. బిచ్చగాడి పాత్రలో ధనుష్ జీవించాడు అని.. ఆయన నటనకు జాతీయ అవార్డు ఖాయమంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు.

దీంతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు రాబడుతోంది. రూ.66కోట్ల బ్రేక్ ఈవెన్ తో విడుదలైన ఈ సినిమా మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లకు లాభాలు తెచ్చిపెట్టింది. తాజాగా ఈ మూవీ రూ.100కోట్లకు పైగా వసూళ్లు రాబట్టినట్లు మూవీ యూనిట్ అధికారికంగా ప్రకటించింది. ఈమేరకు ఓ పోస్టర్ ను విడుదల చేసింది. తమ చిత్రాన్ని ఇంతగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపింది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడైన వ్యక్తికి.. వీధుల్లో బిచ్చగాడిగా జీవించే అతి పేదవాడికి మధ్య జరిగే సంఘర్షణే కథగా ఈ చిత్రం తెరకెక్కించారు. ప్రపంచం కుబేరుడిగా ఎదగాలనుకున్న విలన్.. ఈ లక్ష్యం కోసం మాజీ సీబీఐ ఆఫీసర్ అయిన నాగార్జునను రంగంలోకి దించుతాడు. దీంతో నాగార్జున తన తెలివితేటలతో ఐదురుగు బిచ్చగాళ్లను ఎంచుకుని వారి ఖాతాల్లో రూ.10వేల కోట్ల చొప్పున డబ్బులు డిపాజిట్ చేస్తాడు. అందులో నలుగురు బిచ్చగాళ్లను చంపేయగా.. ధనుష్ మాత్రం తప్పించుకుంటాడు. ఆ తర్వాత ఏం జరిగిందనేది సినిమాలో చూడాలి. ఇందులో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింి.

ధనుష్ ఇటీవల హీరోగా నటించిన చిత్రాలు వరుస విజయాలు అందుకుంటున్నాయి. ఆయన గత చిత్రాలు ‘తిరు’, ‘సార్’, ‘రాయన్’ రూ.100 కోట్లు వసూళ్లు చేశాయి. తాజాగా ‘కుబేర’ చిత్రం కూడా రూ.100 కోట్ల క్లబ్ లోకి చేరడంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News